ఈ అప్‌డేట్‌లో ప్రధానంగా CVE-2026-20969 అనే భద్రతా లోపానికి పరిష్కారం అందించారు.
Samsung తన మొదటి 2026 సెక్యూరిటీ ప్యాచ్‌ను Galaxy S25కి విడుదల చేయడం ప్రారంభించింది
సామ్‌సంగ్ గెలాక్సీ S25 సిరీస్ యూజర్లకు 2026 జనవరి నెలకు సంబంధించిన స్టేబుల్ సెక్యూరిటీ అప్‌డేట్‌ను విడుదల చేయడం ప్రారంభించింది. ఈ అప్‌డేట్ ప్రత్యేకంగా One UI 8.5 బీటా ప్రోగ్రామ్‌లో లేని, సాధారణ వినియోగదారుల కోసం తీసుకువచ్చినది. ఇప్పటికే ఈ నెల ప్రారంభంలో One UI 8.5 బీటా యూజర్లకు ఒకసారి జనవరి పాచ్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే నెలలో రెండోసారి, కానీ అందరికీ వర్తించేలా ఈ అప్‌డేట్‌ను సామ్‌సంగ్ అందిస్తోంది. జనవరి 13న SamMobile గమనించిన ప్రకారం, గెలాక్సీ S25, S25 ప్లస్, S25 అల్ట్రా, అలాగే S25 FE మోడళ్లకు ఈ సెక్యూరిటీ పాచ్ విడుదల అవుతోంది. సామ్‌సంగ్ అధికారిక సెక్యూరిటీ అప్‌డేట్స్ పేజీ ప్రకారం, ఈ పాచ్‌లో మొత్తం 21 కీలక భద్రతా పరిష్కారాలు ఉన్నాయి. వీటిలో 19 సమస్యలను “హై ప్రాధాన్యత”గా గుర్తించగా, మరో రెండు లోపాలను “క్రిటికల్” స్థాయిగా పేర్కొన్నారు.
ఈ అప్‌డేట్‌లో ప్రధానంగా CVE-2026-20969 అనే భద్రతా లోపానికి పరిష్కారం అందించారు. ఈ లోపం వల్ల దురుద్దేశం ఉన్న వ్యక్తులు సిస్టమ్ ప్రివిలేజెస్‌తో ఫైళ్లను యాక్సెస్ చేసే అవకాశం ఉండేది. దీనితో పాటు, అవుట్-ఆఫ్-బౌండ్స్ మెమరీ యాక్సెస్, క్యారియర్ రీలాక్ బైపాస్ వంటి ఇతర భద్రతా సమస్యలను కూడా ఈ పాచ్ పరిష్కరిస్తోంది. అసలు మొత్తం అప్‌డేట్‌ను పరిశీలిస్తే, సామ్‌సంగ్ వైపు నుంచి మాత్రమే దాదాపు 55 భద్రతా పరిష్కారాలు ఇందులో ఉన్నాయి. గూగుల్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ బులిటిన్ కూడా ఇందులో భాగమై ఉంది. గూగుల్ తనవైపు నుంచి డాల్బీ కాంపోనెంట్స్‌కు సంబంధించిన ఒక క్రిటికల్ సెక్యూరిటీ ఫిక్స్‌ను కూడా ఈ అప్‌డేట్‌లో చేర్చింది.
ఈ జనవరి పాచ్ వెర్షన్ నంబర్ vBYLRగా ఉంది. ప్రస్తుతం ఈ అప్‌డేట్ దక్షిణ కొరియాలో రోల్ అవుతోంది. సాధారణంగా జరిగే విధంగానే, కొద్ది రోజుల్లోనే అమెరికా, యూరప్, అలాగే ఇతర ప్రాంతాలకు కూడా ఈ అప్‌డేట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా ఈ వారం చివరికి లేదా వచ్చే వారం ప్రారంభంలో ఇతర దేశాలకు చేరుతుందని అంచనా. ఇప్పటికే చెప్పినట్టుగా, ఇది గెలాక్సీ S25 సిరీస్‌కు జనవరి నెలలో వచ్చిన రెండో అప్‌డేట్. మొదటిది One UI 8.5 బీటా 3 యూజర్ల కోసం విడుదలైంది. ఆ అప్‌డేట్ దాదాపు 1.2GB పరిమాణంలో ఉండి, లాక్ స్క్రీన్ గ్లిచ్‌లు, గ్యాలరీ ల్యాగ్, విడ్జెట్ సమస్యలు వంటి అనేక బగ్‌లను పరిష్కరించింది.
One UI 8.5 బీటా ఆశించిన దానికంటే కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది. దీనికి కారణం సామ్‌సంగ్ గెలాక్సీ S26 సిరీస్ ప్లానింగ్‌లో ఎదురైన అంతర్గత సమస్యలేనని వార్తలు చెబుతున్నాయి. 2026లో వినియోగదారులకు S26, S26 ప్లస్, S26 అల్ట్రా మోడళ్లనే అందించాలని సామ్‌సంగ్ నిర్ణయించినట్లు సమాచారం. One UI 8.5 అప్‌డేట్‌ను ఒక చిన్న అప్‌డేట్‌గా కాకుండా, పెద్ద స్థాయి సాఫ్ట్‌వేర్ మార్పుగా సామ్‌సంగ్ చూస్తోంది. ఈ అప్‌డేట్ ముందుగా గెలాక్సీ S26 సిరీస్‌తో విడుదలై, ఆ తర్వాత గెలాక్సీ S25 వంటి పాత మోడళ్లకు విస్తరించే అవకాశం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
ces_story_below_text
ప్రకటన
ప్రకటన
iPhone 17e Launch Timeline Leaked Again; Tipped to Feature Dynamic Island Instead of Notch