Photo Credit: OnePlus
చైనాలో OnePlus Ace 5 Pro, OnePlus Ace 5 హ్యాండ్‌సెట్‌లు లాంచ్ అయ్యాయి. ఈ కొత్త OnePlus Ace సిరీస్ స్మార్ట్ ఫోన్‌లు గరిష్టంగా 16GB RAM, 1TB వరకు స్టోరేజీతో వస్తున్నాయి. ఇవి 1.5K రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. అలాగే, ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్ ప్రాసెసర్ ద్వారా శక్తిని గ్రహిస్తుండగా, Ace 5 మోడల్ మాత్రం స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తో వస్తోంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఈ రెండూ చైనాలో కొనుగోలు చేసేందుకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.
చైనాలో OnePlus Ace 5 Pro మోడల్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 3,399 (దాదాపు రూ. 39,000)గా ఉంది. అలాగే, 16GB + 1TB మోడల్‌ల ధర CNY 4,699 (దాదాపు రూ. 54,000)గా నిర్ణయించారు. ఇది స్టార్రీ పర్పుల్, సబ్‌మెరైన్ బ్లాక్, వైట్ మూన్ పోర్సిలైన్-సిరామిక్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. అలాగే, OnePlus Ace 5 మోడల్ 12GB + 256GB వేరియంట్ ధర CNY 2,299 (దాదాపు రూ. 26,000), 16GB + 1TB మోడల్ ధర CNY 3,499 (దాదాపు రూ. 40,000)గా ఉంది.ఇది ఫుల్ బ్లాక్, సెలాడాన్-సిరామిక్ స్పెషల్ ఎడిషన్, గ్రావిటేషనల్ టైటానియం షేడ్స్‌లో లభిస్తుంది.
రెండూ OIS సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ఒకేలాంటి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నాయి. ఈ కెమెరా సెటప్‌లో ఆటోఫోకస్‌తో కూడిన 8-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం భాగంలో 16-మెగాపిక్సెల్ సెన్సార్‌తో రూపొందించారు. కనెక్టివిటీ ఆప్షన్‌లను చూస్తే 5G, 4G LTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, Beidou, GLONASS, గెలీలియో, GPS, NFCలు ఉన్నాయి.
ఈ హ్యాండ్‌సెట్‌లు ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వస్తున్నాయి. రెండు మోడల్‌లు IP65-రేటెడ్ బిల్డ్‌ను అందిస్తున్నాయి. OnePlus Ace 5 Proలో OnePlus 100W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 6,100mAh బ్యాటరీని అందించారు. ఇది కేవలం 35 నిమిషాల్లో బ్యాటరీని సున్నా నుండి 100 శాతానికి నింపుతుంది. 161.72x75.77x8.14mm పరిమాణంలో 203 గ్రాములు బరువుతో వస్తుంది.
OnePlus Ace 5 మోడల్ 6,400mAh బ్యాటరీని 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఒక్క ఛార్జ్‌పై బ్యాటరీ 14 గంటలపాటు నిరంతర TikTok లాంటి వీడియోలను చూసే సమయాన్ని అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 161.72x75.77x8.02mm పరిమాణంతో 207 గ్రాముల బరువుతో వస్తుంది. రెండింటిలోనూ డ్యూయల్-సిమ్ (నానో) Android 15లో ColorOS 15.0తో రన్ అవుతున్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌లను మెటల్ మిడిల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్‌తో రూపొందించారు.
ప్రకటన
ప్రకటన