CIPA 6.5 సర్టిఫైడ్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో, చేతిలో పట్టుకుని మూడు సెకన్ల పాటు ఫోటో తీసినా బ్లర్ రాకుండా ఉండేలా టెక్నాలజీని అభివృద్ధి చేశారు
Photo Credit: Honor
హానర్ కంపెనీ చైనాలో హానర్ మ్యాజిక్ 8 RSR పోర్స్చే డిజైన్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది.
HONOR తన ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్ లైన్‌లో మరో ప్రత్యేక మోడల్‌ను చైనాలో అధికారికంగా ఆవిష్కరించింది. HONOR Magic 8 RSR Porsche Design, డిజైన్, పనితీరు, కెమెరా టెక్నాలజీ మరియు బ్యాటరీ సామర్థ్యంలో అత్యున్నత అనుభవం ఇవ్వడం లక్ష్యంగా రూపొందించబడింది. Porsche Design భాగస్వామ్యంతో వచ్చిన ఈ ఫోన్, లగ్జరీ మరియు టెక్నాలజీని ఒకే ఫ్రేమ్‌లో సమకూర్చి, సాధారణ ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు భిన్నంగా కనిపిస్తుంది. డిజైన్ పరంగా, ఈ ఫోన్ Porsche సూపర్‌కార్ల నుంచి ప్రేరణ పొందింది. స్లేట్ గ్రే, మూన్ స్టోన్ రంగుల్లో లభించే ఫోన్, క్లాసిక్ Porsche స్లీక్ లైన్స్‌ను ప్రతిబింబిస్తుంది. వెనుక భాగం మైక్రోక్రిస్టలైన్ నానో-సెరామిక్‌తో తయారు చేయబడింది, Mohs స్కేల్ 8.5 హార్డ్నెస్, A0 గ్రేడ్ మిర్రర్ పాలిష్‌తో సాఫ్ట్, ప్రీమియం ఫీల్ ఇస్తుంది. గత మోడళ్లతో పోలిస్తే ఇది సుమారు 10% తక్కువ బరువుతో రూపొందించబడింది. వెనుక కెమెరా మాడ్యూల్ డిజైన్, Porsche మ్యాట్రిక్స్ హెడ్‌లైట్స్‌ను గుర్తు చేస్తుంది.
పనితీరు విషయానికి వస్తే, HONOR Magic 8 RSR Porsche Designలో తాజా Snapdragon 8 Elite Gen 5 చిప్‌ను ఉపయోగించారు. 3nm టెక్నాలజీపై తయారైన ఈ ప్రాసెసర్, భారీ గేమింగ్, మల్టీటాస్కింగ్, AI ఆధారిత పనులను సులభంగా నిర్వహించగలదు. ఫోన్‌లో గరిష్టంగా 24GB వరకు హైస్పీడ్ LPDDR5X ర్యామ్ అందించగా, స్టోరేజ్ పరంగా 1TB వరకు UFS 4.0 మెమరీ ఆప్షన్ ఉంది. HONOR Hongyan కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా Tiantong మరియు Beidou శాటిలైట్ కనెక్టివిటీకి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం Giant Rhino గ్లాస్‌తో పాటు IP68, IP69, IP69K రేటింగ్‌లతో నీరు, ధూళి నుంచి అత్యున్నత స్థాయి రక్షణ లభిస్తుంది.
కెమెరా విభాగంలో HONOR Magic 8 RSR Porsche Design ప్రొఫెషనల్ స్థాయి అనుభవాన్ని లక్ష్యంగా రూపొందించారు. ఇందులో 50MP వైడ్ కెమెరా, అల్ట్రా వైడ్ కెమెరాతో పాటు ప్రధాన ఆకర్షణగా 200MP టెలిఫోటో కెమెరా ఉంది. ప్రత్యేకంగా ఇచ్చే ప్రొఫెషనల్ ఇమేజింగ్ కిట్‌లో మాగ్నెటిక్ కెమెరా గ్రిప్ ఉండటం వల్ల DSLR తరహా హోల్డింగ్ అనుభవం లభిస్తుందని HONOR వెల్లడించింది. 67mm ఫిల్టర్ అడాప్టర్ రింగ్‌తో పాటు 200mm Nox టెలిఫోటో లెన్స్‌ను అమర్చుకునే అవకాశం కూడా ఉంది. Kepler లెన్స్ ఆర్కిటెక్చర్ వల్ల దూరంలోని వస్తువులు కూడా స్పష్టంగా క్యాప్చర్ అవుతాయి. AiMAGE కలర్ ఇంజిన్ సహజ రంగులను ఖచ్చితంగా రీప్రొడ్యూస్ చేస్తుంది. CIPA 6.5 సర్టిఫైడ్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో, చేతిలో పట్టుకుని మూడు సెకన్ల పాటు ఫోటో తీసినా బ్లర్ రాకుండా చిత్రాలు రావడం ప్రత్యేకత.
బ్యాటరీ విభాగంలో కూడా ఈ ఫోన్ బలంగా నిలుస్తుంది. 7200mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో వచ్చిన ఈ మోడల్ 120W వైర్డ్, 80W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అదనంగా 100W PPS యూనివర్సల్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రోటోకాల్‌తో కూడా ఇది కంపాటిబుల్. డిస్‌ప్లే పరంగా 6.71 అంగుళాల క్వాడ్ కర్వ్డ్ LTPO OLED స్క్రీన్, అధిక బ్రైట్నెస్‌తో పాటు స్మూత్ రిఫ్రెష్ రేట్‌ను అందించి ప్రీమియమ్ విజువల్ అనుభూతిని ఇస్తుంది. ధరల విషయానికి వస్తే, చైనా మార్కెట్‌లో 16GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్‌కు 7999 యువాన్, 24GB ర్యామ్ + 1TB స్టోరేజ్ మోడల్‌కు 8999 యువాన్ ధరగా HONOR నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ఫోన్ చైనాలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
ces_story_below_text
ప్రకటన
ప్రకటన
Motorola Edge 70 Fusion Full Specifications Including Snapdragon 7s Gen 3 SoC, 7,000mAh Battery Leaked