Photo Credit: OnePlus
OnePlus కంపెనీ రెండవ ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్‌గా OnePlus Open 2 వచ్చే ఏడాది మార్కెట్‌లోకి రానున్నట్లు భావిస్తున్నారు. ఈ చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీదారు సంస్థ 2024లో మొదటి జనరేషన్ OnePlus Openకు కొనసాగింపుగా ఎలాంటి ఫోన్‌ను పరిచయం చేయకపోవడంతో ఈ హ్యాండ్‌సెట్ 2025లో లాంచ్ చేయనున్నట్లు టిప్‌స్టర్ అంచనా వేస్తోంది. Qualcomm టాప్-ఆఫ్-ది-లైన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో 2025 ప్రారంభంలో వచ్చే అవకాశమున్న Oppo Find N5 ఫోన్ రీబ్రాండెడ్ వెర్షన్‌గా రానున్నట్లు భావిస్తున్నారు. మరి ఈ OnePlus Open 2కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను చూసేద్దామా?!
సంజు చౌదరి అనే ఓ వినియోగదారు X వేదికగా లీక్ చేసిన వివరాల ప్రకారం.. ఈ OnePlus Open 2 రానున్న 2025 ఆఫ్ ఇయర్‌లో ఏదోఒక సమయంలో అందుబాటులోకి వస్తుంది. దీని ముందున్న హ్యాండ్‌సెట్ Oppo Find N5 మాదిరిగానే, దీనికి రీబ్యాడ్జ్ వెర్షన్‌గా వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అలాగే, ముందుగా ఇది 2025 ప్రారంభంలో చైనాలో అడుగుపెడుతుంది. కంపెనీ నుంచి అధికారిక ప్రకటన లేకపోవడం చాలావరకూ నిరాశకు గురిచేసిందనే చెప్పాలి.
ఈ అంచనాల ప్రకారం, OnePlus Open 2 గతంలో చైనాలో లాంచ్ అయిన మోడల్ మాదిరిగానే Snapdragon 8 Elite ప్రాసెసర్‌తోనే వస్తుందని భావిస్తున్నారు. అయితే, Open 2ని H2 2025లో పరిచయం చేసినట్లయితే, లోపల ఉన్న స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ కొన్ని నెలల పాటు మాత్రమే ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌గా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. Qualcomm సాధారణంగా దాని న్యూ స్నాప్‌డ్రాగన్‌ను అక్టోబర్‌లో జరిగే వార్షిక సమ్మెట్ సమావేశంలో విడుదల చేస్తుంది. అయితే, 2023లో ప్రారంభించిన మొదటి జనరేషన్ OnePlus Openకు కొనసాగింపుగా దీనిని పరిచయం చేసేలా కంపెనీ భావిస్తోందా లేదా అనేది విషయంపై OnePlus నుండి ఇప్పటి వరకూ ఎలాంటి స్పష్టతా రాలేదు.
టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ గతంలో OnePlus Open 2కు సంబంధించిన కొన్నిస్పెసిఫికేషన్‌లను లీక్ చేసిన విషయం తెలిసిందే. దాని ప్రకారం, ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. అలాగే, పెద్ద స్క్రీన్‌తో వచ్చే అవకాశం ఉన్నట్లు అభిప్రాయపడింది. రాబోయే Open 2 స్మార్ట్ ఫోన్ 5,700mAh బ్యాటరీతో రావొచ్చని అంచనా వేస్తోంది. అయితే, మొదటి జనరేషన్ మోడల్‌లో మాత్రం 4,800mAh సామర్థ్యం ఉన్న బ్యాటరీని అందించారు.
ఈ OnePlus Open 2 కోసం కంపెనీ కస్టమైజ్డ్ USB పోర్ట్‌పై కూడా పని చేస్తున్నట్లు టిప్‌స్టర్ ద్వారా వెల్లడైంది. కెమెరా విషయానికి వస్తే.. ఇది హ్యాసెల్‌బ్లాడ్ ట్యూన్డ్ రియర్ కెమెరాలను అందించనున్నట్లు అంచనా వేస్తున్నారు. OnePlus Open 2తోపాటు Oppo FInd N5 గురించి పూర్తి వివరాలు మరికొన్ని నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన