క‌ఏవ‌లం రూ.15999ల‌కే Oppo A3 5G ఫోన్‌.. ఫీచ‌ర్స్ ఇవే!

Oppo దేశీయ మార్కెట్‌లోకి Oppo A3 5G పేరులో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎంతో క్లాసిక్ లుక్‌తో క‌నిపిస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్ చూప‌రుల‌ను ఇట్టే ఆక‌ట్టుకుంటోద‌నంలో ఎలాంటి సందేహం లేదు.

క‌ఏవ‌లం రూ.15999ల‌కే Oppo A3 5G ఫోన్‌.. ఫీచ‌ర్స్ ఇవే!
ముఖ్యాంశాలు
  • 6.67-అంగుళాల(720x1,604 pixels) HD + LCD డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్
  • న్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ రికగ్నిషన్ అన్‌లాక్ వంటి ఫీచ‌ర
  • 76-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూ మరియు f/1.8 ఎపర్చర్‌తో 50-మెగాపిక్సెల్ కెమెరా
ప్రకటన
ప్ర‌ముఖ టెక్ సంస్థ‌ Oppo దేశీయ మార్కెట్‌లోకి  Oppo A3 5G పేరులో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎంతో క్లాసిక్ లుక్‌తో క‌నిపిస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్ చూప‌రుల‌ను ఇట్టే ఆక‌ట్టుకుంటోద‌నంలో ఎలాంటి సందేహం లేదు. మ‌రీ ముఖ్యంగా కెమెరా విభాగంతోపాటు ప్రాసెసర్, డిస్‌ప్లే వంటివి అధ‌న‌పు ఈ మోడ‌ల్‌కు అద‌న‌పు బ‌లాన్ని చేకూర్చ‌నున్నాయి. Oppo A3 5G మోడ‌ల్ ఫోన్‌ 6.67 అంగుళాల HD + LCD డిస్‌ప్లేతో వ‌స్తూ.. వెనుక వైపున‌ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అలాగే, ముందువైపున‌ 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను క‌లిగి ఉంటుంది. మ‌రెందుకు ఆల‌స్యం.. Oppo A3 5G మోడ‌ల్ యొక్క‌ ఫీచర్లతోపాటు స్పెసిఫికేషన్స్ అలాగే, ధర వంటి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన వివ‌రాల‌ను చూసేద్దామా?! 

Oppo A3 5G మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల(720x1,604 pixels) HD + LCD డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 1,000 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌ను అందిస్తోంది. అలాగే, ఈ ఫోన్‌కు MediaTek డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో Mali-G57 MC2 GPUని జోడించారు. ఫోన్‌లో 6GB LPDDR4X RAMను అందించ‌డంతోపాటు దీనిని వర్చువల్ RAM ద్వారా పెంచుకునే అవ‌కాశాన్ని క‌ల్పించారు. అలా 128GB eMMC 5.1 స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా కలర్‌ఓఎస్ 14.0.1పై ఈ స్మార్ట్‌ఫోన్ ప‌ని చేస్తోంది. భ‌ద్ర‌త విష‌యంలోనూ దీనిపై కంపెనీ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వహించింది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ రికగ్నిషన్ అన్‌లాక్ వంటి ఫీచ‌ర్స్‌ను అందించారు. ఈ వెరియంట్‌ల‌లో ల‌భిస్తోన్న ఇత‌ర కంపెనీ ఫోన్‌ల‌కు Oppo A3 5G స్మార్ట్ ఫోన్ మంచి పోటీని ఇస్తుంద‌ని మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

కనెక్టివిటీ ఎంపికలలోనూ..

మ‌రీ ముఖ్యంగా Oppo A3 5G కెమెరా గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. ఫోటోలు మరియు వీడియోల కోసం ఈ Oppo A3 5Gలో 76-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూ మరియు f/1.8 ఎపర్చర్‌తో 50-మెగాపిక్సెల్ కెమెరాను వెనుక భాగంలో అందించారు. అలాగే, సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం 78-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూ మరియు f/2.2 ఎపర్చర్‌తో 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. 45W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,100mAh బ్యాటరీ సామ‌ర్థ్యంతో దీనిని రూపొందించారు. కనెక్టివిటీ ఎంపికలలోనూ మంచి అవ‌కాశాల‌ను క‌ల్పించారు. Wi-Fi 5, బ్లూటూత్ 5.3, USB టైప్ C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి ఫీచ‌ర్స్‌ను అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, లిక్విడ్ రెసిస్టెన్స్‌తో కొనుగోలుదారుల చేతుల్లో ఇట్టే ఇమిడిపోయేలా రూపొందించారు. దీని ప‌రిమాణం విష‌యానికి వ‌స్తే.. 165.7x76x7.7మిల్లీమీట‌ర్ల‌తో 187 గ్రాములు బరువు క‌లిగి ఉంటుంది.

ధ‌ర విష‌యానికి వ‌స్తే..

ఇక Oppo A3 5G ధర విషయంలోనూ కంపెనీ సాహ‌సోపేత‌మైన నిర్ణయాన్నే తీసుకుంది. 6GB RAM + 128GB స్టోరేజ్ సామ‌ర్థ్యం ఉన్న వేరియంట్ ధర రూ.15,999గా ప్ర‌క‌టించారు. అలాగే, వీటి ల‌భ్య‌త కూడా ఆక‌ర్ష‌ణీయ‌మైన రంగుల్లో ఉంది. ఓషన్ బ్లూ, నెబ్యులా రెడ్ కలర్ వంటి రెండు ఎంపిక‌ల్లో ఈ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఇండియా వెబ్‌సైట్‌లో కొనుగోలు చేసేందుకు అవ‌కాశం క‌ల్పించారు. అంతేకాదు, కంపెనీ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. కొనుగోలుదారులు 10 శాతం వ‌ర‌కూ తగ్గింపును పొందవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా, OneCard మరియు SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీలను ఉపయోగించి భారతదేశంలో Oppo A3 5Gని కొనుగోలు చేసేటప్పుడు రూ. 1,600 ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించారు. అలాగే, MobiKwik వాలెట్ వినియోగదారులు కూడా రూ. 500 క్యాష్‌బ్యాక్‌గా పొందే అవ‌కాశం ఉంటుంది. మీరు కూడా Oppo వినియోగ‌దారులైతే మాత్రం.. ఇక ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే ఈ మోడ‌ల్‌ను బుక్ చేసుకోండి!
Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. తక్కువ ధరకు 4GB RAMతో Poco M7 Plus 5G కొత్త వేరియంట్ ఫోన్, త్వరలో ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ ప్రారంభం
  2. iQOO 15 హ్యాండ్‌సెట్ ఫోటోలు లీక్, వేర్వేరు కలర్స్‌లో సరికొత్త లుక్‌లో హ్యాండ్‌సెట్
  3. సెప్టెంబర్ 19 నుంచి ఇవ్వాల్సిన డెలివరీలు వాయిదా పడుతున్నాయి
  4. రియల్ మీ P3 Lite 5G ధరను రియల్‌ మీ చాలా ఆకర్షణీయంగా నిర్ణయించింది.
  5. నథింగ్ ఇయర్ 3 లో మార్పులివే
  6. ఐఫోన్ లవర్స్‌కి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆఫర్
  7. ఇటీవల ఐఫోన్ 17 సిరీస్ భారత్‌లో విడుదల కావడంతో, ఐఫోన్ 16 ధరను తగ్గించారు
  8. ఈ సిరీస్ ముఖ్యంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్ల మార్కెట్‌లో పోటీని మరింత పెంచే అవకాశం ఉంది
  9. కొత్తగా షావోమీ 16 ప్రో మినీ అనే కాంపాక్ట్ వెర్షన్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం
  10. సామ్ సంగ్ గెలాక్సీ S26 ప్రో.. ఫీచర్స్‌లో హైలెట్స్ ఇవే
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »