దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ Samsung తన ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy A06ను త్వరలో మన దేశంలో లాంచ్ చేయబోతోంది. ఈ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ గురించి అనేక ఆసక్తికరమైన వివరాలను టిప్‌స్టర్ ద్వారా లీక్ చేసింది. ఇటీవల కాలంలో Samsung ప్రీమియం ఫోన్‌లను లాంచ్ చేసిన సంగతి తెలిసందే. అయితే, ఈ ఎంట్రీ లెవల్ ఫోన్ రిలీజ్ చేయనుండడంతో మార్కెట్ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది ఈ దక్షిణ కొరియా కంపెనీ. Samsung Galaxy A06 ఈ సంవత్సరం ప్రారంభంలో A సిరీస్‌లో లాంచ్ చేసిన ఇతర మోడళ్లను పోలి ఉండనుంది. గతేడాది నవంబర్‌లో విడుదలైన Samsung Galaxy A05కి కొనసాగింపుగా ఈ మోడల్ రాబోతోందని తెలుస్తోంది. అంతేకాదు, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ కోసం సపోర్టు పేజీని అప్‌డేట్ చేశారు. అతి త్వరలోనే దేశీయ మార్కెట్లోనూ Samsung Galaxy A06 విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వాటర్‌డ్రాప్ కటౌట్‌తో..
Tipster Steve Hemmerstoffer (@OnLeaks) GizNext సహకారంతో Samsung Galaxy A06 డిజైన్ రెండర్‌లను లీక్ చేసింది. దీంతో రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్ నుంచి ఎలాంటి ఫీచర్స్ ఉండే అవకాశం ఉందో అంచనా వేయొచ్చు. ముఖ్యంగా సెల్ఫీ కెమెరాను కలిగిన వాటర్‌డ్రాప్ కటౌట్‌తో ఫోన్ ఫ్లాట్ డిస్‌ప్లేతో వస్తుందని నివేదికల ద్వారా తెలుస్తోంది. అలాగే, ఈ డిస్‌ప్లే చుట్టూ లార్జ్ బెజెల్స్, ఫోన్ ఫ్లాట్ ఎడ్జ్‌లు కూడా ఉండనున్నాయి. Samsung Galaxy A06 కుడివైపున పవర్ (ఇంటిగ్రేటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో) అలాగే, వాల్యూమ్ బటన్‌లు వస్తున్నాయి. ఇవి Galaxy A55, Galaxy A35లలో కూడా కనిపించే కీ ఐలాండ్ పైనా ఉండడం గమనించవచ్చు. అలాగే, బ్యాక్ ప్యానెల్ షైనింగ్‌గా కనిపిస్తోంది. ఎల్ఈడీ ఫ్లాష్‌తో పాటు నిలువుగా డ్యూయల్ కెమెరా సెటప్, బ్యాక్ ప్యానెల్ దిగువన Samsung లోగో ఆకర్షణీయంగా ఉంటుంది. అంతేకాదు, ఈ హ్యాండ్‌సెట్‌లో లీకైన డివైస్ రెండర్‌లలో కనిపించే ఇతర బ్రాండింగ్ ఏదీ లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్ Samsung Galaxy A06 కింది భాగంలో స్పీకర్ గ్రిల్ రూపొందించారు.
వెబ్‌సైట్‌లో మోడల్ నంబర్..
Samsung Galaxy A06 సక్సెసర్ 6.7- అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్‌తో కనిపిస్తుంది. 120 Hz రీఫ్రెష్ రేటు, 720 x 1600 పిక్సెల్స్ రిజల్యూషన్ ఈ స్ర్కీన్‌కు ఉండనుంది. అలాగే, వెనక భాగంలో ఎల్ఈడీ ఫ్లాష్‌తో పాటు డ్యుయల్ కెమెరా సెటప్‌తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందిస్తున్నారు. టిప్‌స్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మీడియాటెక్ హెలియో జీ85 చిప్‌సెట్ ద్వారా పవర్‌ను పొందుతోంది. అలాగే, ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6జీబీ ర్యామ్ అమర్చిబడి ఉండనుంది. అయితే, ఇంటర్నల్ స్టోరేజీ లేదా ఇతర మెమరీ వేరియంట్‌ల గురించి విషయాలు వెల్లడికాలేదు.
లీకైన ఇమేజ్‌ల ద్వారా ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ అమర్చినట్టు అర్థమవుతుంది. అయితే, కెమెరా సెన్సార్లకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాలేదు. ఆండ్రాయిడ్ 14లో ఈ స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది. 15W ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తూ 5,000mAh బ్యాటరీతో రూపొందించబడింది. Samsung Galaxy A06 ఫోన్ మన దేశంలో లాంచ్ టైమ్‌లైన్‌ను మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ, మై స్మార్ట్‌ప్రైస్ భారత్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో మోడల్ నంబర్ SM-A065Fతో హ్యాండ్‌సెట్ సపోర్టు పేజీని మాత్రం గుర్తించినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. Samsung Galaxy స్మార్ట్ ఫోన్ వినియోగించాలనే కోరిక మీకు కూడా ఉన్నట్లయితే ఇంకొద్ది రోజులు వేచి ఉండండి మరి!