Photo Credit: Samsung
భారత్‌లో Samsung కంపెనీ ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ గెలాక్సీ ఎస్24 అల్ట్రాతోపాటు గెలాక్సీ ఎస్24ను లాంచ్ చేసింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే ఉన్న ఒరిజినల్ గెలాక్సీ ఎస్24, గెలాక్సీ ఎస్24 అల్ట్రాతో సమానమైన స్పెసిఫికేషన్‌లతో అందిస్తోంది. అయితే, Enterprise Edition మోడళ్లు ఎంటర్‌ప్రైజ్-ఫోకస్డ్ టూల్స్‌తో వస్తున్నాయి. అంతేకాదు, Galaxy AI ఫీచర్లను ఈ Galaxy S24, Galaxy S24 అల్ట్రా ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ వెర్షన్‌లలో అందిస్తున్నారు. అలాగే, ఒక సంవత్సరం నాక్స్ సూట్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా కలిగి ఉంటాయి.
మన దేశంలో ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ గెలాక్సీ ఎస్24 స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 256GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 78,999గా ఉంది. ఇది ఓనిక్స్ బ్లాక్ షేడ్‌లో లభిస్తోంది. అలాగే, గెలాక్సీ S24 అల్ట్రా ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 96,749కాగా, ఇది టైటానియం బ్లాక్ కలర్‌లో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతానికి ఈ మోడల్స్ Samsung కార్పొరేట్+ పోర్టల్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి.
కంపెనీ కార్పొరేట్ కస్టమర్లను మరింత ఆకర్షించే ప్రణాళికలో భాగంగా ఈ రెండు హ్యాండ్‌సెట్‌లను మూడేళ్ల వారంటీతో డెలివరీ చేస్తోంది. స్పెర్స్ సెక్యూరిటీ, ఎంటర్‌ప్రైజ్ మొబిలిటీ మేనేజ్‌మెంట్ (EMM) కోసం శామ్‌సంగ్ నాక్స్ సూట్ సబ్‌స్క్రిప్షన్‌ను ఒక ఏడాది పాటు అందిస్తోంది. అలాగే, 50 శాతం సబ్సిడీ ధరతో ఎంటర్‌ప్రైజ్ కస్టమర్‌లు రెండవ సంవత్సరం నుండి నాక్స్ సూట్ సబ్‌స్క్రిప్షన్‌ను అందుకోవచ్చు.
ప్రొటక్షన్‌లో భాగంగా ఎంటర్‌ప్రైజ్ మోడళ్లకు ఏడు సంవత్సరాల OS అప్‌డేట్‌లు, సెక్యూరిటీ మెయింటెనెన్స్ విడుదల చేస్తున్నట్లు Samsung స్పష్టం చేసింది. వీటిలో లైవ్ ట్రాన్స్‌లేట్, ఇంటర్‌ప్రెటర్, చాట్ అసిస్ట్, నోట్ అసిస్ట్, ట్రాన్‌స్క్రిప్ట్ అసిస్ట్, సర్కిల్‌తో గూగుల్‌తో సెర్చ్ చేయడం లాంటి ముఖ్యమైన గెలాక్సీ AI ఫీచర్‌లను అందిస్తోంది. 6.8-అంగుళాల ఎడ్జ్ QHD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేతో Galaxy S24 అల్ట్రా 1Hz–120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. Galaxy S24 ఫోన్ 6.2-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లేతో వస్తుంది. మన దేశంలో అల్ట్రా మోడల్ Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌పై రన్ అవుతుండగా, వనిల్లా మోడల్ అండర్ ది హుడ్ Exynos 2400 ప్రాసెసర్‌తో పనిచేస్తోంది.
కెమెరా విషయానికి వస్తే.. Galaxy S24 అల్ట్రా మోడల్‌ను క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో అందిస్తున్నారు. ఇది 200-మెగాపిక్సెల్ వైడ్ కెమెరా హెడ్‌లైన్‌తో రూపొందించబడింది. 50-మెగాపిక్సెల్ వైడ్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో Galaxy S24 వస్తుంది. ఈ రెండు మోడల్స్‌లో 12-మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్స్‌లతోపాటు దుమ్ము, నీటి నియంత్రణ కోసం IP68 రేటింగ్ కలిగి ఉన్నాయి. Samsung Galaxy S24 Ultraలో 5,000mAh బ్యాటరీ, Galaxy S24లో 4,000mAh బ్యాటరీని అందించారు.
ప్రకటన
ప్రకటన