ఈ సామ్‌సంగ్ గెలాక్సీ S24 Ultra మీద ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నారు. 12GB RAM + 256GB స్టోరేజ్ ఉన్న బేస్ వేరియంట్ అమెజాన్‌లో రూ. 71,999కి అందుబాటులో ఉంది. 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,04,999గా ఉంది.
Samsung Galaxy S25 Ultra మరియు iPhone 16 Pro అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపు ధరలకు అందుబాటులో ఉన్నాయి.
అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ తమ ప్రీమియం సబ్‌స్క్రైబర్ల కోసం ప్రత్యేకంగా ఫెస్టివల్ సేల్ ఈవెంట్లను ప్రారంభించాయి. ఇందులో గత ఏడాది సామ్‌సంగ్ మరియు ఆపిల్ ఫ్లాగ్‌షిప్ మోడళ్లు అయిన సామ్‌సంగ్ గెలాక్సీ S24 Ultra మరియు iPhone 16 Pro తగ్గింపు ధరల్లో లభిస్తున్నాయి. ఇవి తాజా ఫ్లాగ్‌షిప్‌లు కాకపోయినా, కెమెరా పనితీరు, చిప్‌సెట్ శక్తి, అలాగే బ్యాటరీ లైఫ్ పరంగా చాలా మందికి సరిపోయే స్థాయిలో ఉన్నాయి. సాధారణ వినియోగదారుల కోసం ఇవి ఇప్పటికీ మంచి ఆప్షన్ చెప్పవచ్చు. ఇక మిగతా కొనుగోలుదారుల కోసం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మరియు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 ఈ మంగళవారం అర్ధరాత్రి నుండి ప్రారంభం కానున్నాయి.
సామ్‌సంగ్ గెలాక్సీ S24 Ultra మీద ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నారు. 12GB RAM + 256GB స్టోరేజ్ ఉన్న బేస్ వేరియంట్ అమెజాన్‌లో రూ. 71,999కి అందుబాటులో ఉంది. 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,04,999గా ఉంది. ఇవి టైటానియం గ్రే, టైటానియం బ్లాక్, టైటానియం వైలెట్ కలర్స్‌లో లభిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ సభ్యులు అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్తో చెల్లిస్తే 5% క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.
ఈ తగ్గింపు ధర డైరెక్ట్ ప్రైస్ కట్ మాత్రమే. అంటే, అదనంగా బ్యాంక్ ఆఫర్లు లేదా క్యాష్‌బ్యాక్ స్కీమ్స్ పొందితే ధర ఇంకా తగ్గవచ్చు. కానీ ఈ ఆఫర్ ఫెస్టివల్ సేల్ ముగిసే వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ మోడల్ భారత మార్కెట్‌లో 2024 జనవరిలో విడుదలైనప్పుడు ప్రారంభ ధర రూ. 1,29,999గా ఉంది.
గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదలైన iPhone 16 Pro ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 85,999కి అందుబాటులో ఉంది. ఇది 128GB బేస్ వేరియంట్ ధర, అదనపు బ్యాంక్ ఆఫర్లు మినహా. ICICI బ్యాంక్ లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డుతో చెల్లిస్తే మరో రూ. 5,000 తగ్గింపును పొందవచ్చు. EMI ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి, కాబట్టి ఒక్కసారిగా మొత్తం చెల్లించనవసరం లేదు. ఈ మోడల్ డెజర్ట్ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం కలర్స్‌లో లభిస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ ముందే ప్రకటించిన ప్రకారం, బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 సమయంలో బ్యాంక్ డిస్కౌంట్లతో కలిపి ఈ ఫోన్ ధర రూ. 69,999 వరకు తగ్గనుంది. ఐఫోన్ 16 ప్రో భారతదేశంలో విడుదలైనప్పుడు బేస్ 128GB వేరియంట్ ధర రూ. 1,19,900గా ఉండగా, 256GB వేరియంట్ రూ. 1,29,900, 512GB వేరియంట్ రూ. 1,49,900, 1TB వేరియంట్ రూ. 1,69,900కి లాంచ్ చేయబడింది. సామ్‌సంగ్ గెలాక్సీ S24Ultra అలాగే iPhone 16 Pro మొబైల్ కొనాలనుకుంటున్న కస్టమర్లకు ఇది సరైన సమయం అని చెప్పవచ్చు. మంచి ఆఫర్లను పొందుతూ ఈ ఫోన్లను సొంతం చేసుకోండి.
ప్రకటన
ప్రకటన