Vivo X300 FE విషయానికి వస్తే, ప్రస్తుతం స్పెసిఫికేషన్లపై పూర్తి సమాచారం లేదు.

బ్లూటూత్ SIG లిస్టింగ్ ప్రకారం, “V2561” అనే మోడల్ నంబర్ Vivo X200Tకి చెందినదిగా నమోదైంది. ఇదే సర్టిఫికేషన్ పేజీలో Vivo X200, Vivo X200 Pro మోడళ్లు కూడా కనిపించడం విశేషం.

Vivo X300 FE విషయానికి వస్తే, ప్రస్తుతం స్పెసిఫికేషన్లపై పూర్తి సమాచారం లేదు.

Photo Credit: Vivo

బ్లూటూత్ SIG డేటాబేస్‌లో వివో యొక్క రాబోయే X300 FE స్మార్ట్‌ఫోన్

ముఖ్యాంశాలు
  • Vivo X200T, X300 FE ఫోన్లు BIS సర్టిఫికేషన్లలో నమోదు
  • 6,200mAh బ్యాటరీ వంటి హైఎండ్ ఫీచర్లు అంచనా
  • జనవరి 2026లో X200T లాంచ్ అవకాశం
ప్రకటన

ఇటీవలే Vivo తీసుకురాబోతున్న X300 FE స్మార్ట్‌ఫోన్‌ను బ్లూటూత్ SIG డేటాబేస్‌లో గుర్తించగా, ఇప్పుడు అదే సర్టిఫికేషన్‌లో మరో కొత్త డివైస్ Vivo X200T కూడా కనిపించింది. గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ రెండు ఫోన్లు భారతదేశానికి సంబంధించిన BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) సర్టిఫికేషన్‌ను కూడా పూర్తిచేశాయి. దీనితో, Vivo నుంచి ఈ కొత్త మోడళ్ల భారత్ లాంచ్ త్వరలోనే జరిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. బ్లూటూత్ SIG లిస్టింగ్ ప్రకారం, “V2561” అనే మోడల్ నంబర్ Vivo X200Tకి చెందినదిగా నమోదైంది. ఇదే సర్టిఫికేషన్ పేజీలో Vivo X200, Vivo X200 Pro మోడళ్లు కూడా కనిపించడం విశేషం. అంటే, X200 సిరీస్ మొత్తానికి సంబంధించిన ప్రిపరేషన్స్ ఇప్పటికే పూర్తయ్యాయని అర్థమవుతోంది.

భారత BIS సర్టిఫికేషన్ విషయానికి వస్తే, V2561 మోడల్‌తో పాటు మరో మోడల్ నంబర్ “V2537” కూడా అక్కడ దర్శనమిచ్చింది. ఈ రెండు డివైసులకు 2025 డిసెంబర్ 31న BIS అనుమతి లభించింది. BIS డేటాబేస్‌లో ఫోన్ పేర్లు కనిపించకపోయినా, బ్లూటూత్ SIG లిస్టింగ్ ద్వారా V2561 అనేది Vivo X200T అని స్పష్టత వచ్చింది. ఇదే విధంగా, V2537 మోడల్‌ను గతంలో బ్లూటూత్ SIGలో Vivo X300 FEగా గుర్తించారు.

అదనంగా, V2542 అనే మరో మోడల్ నంబర్ కూడా X300 FEకి సంబంధించినదిగా లిస్టింగ్ కావడం, ప్రాంతాల వారీగా వేరియంట్లు ఉండొచ్చని సూచిస్తోంది. ఈ మోడల్ EEC సర్టిఫికేషన్‌లో కూడా ముందుగానే కనిపించింది. లీకుల ప్రకారం, Vivo X200T ఫోన్‌లో 6.67 అంగుళాల ఫ్లాట్ 1.5K OLED LTPS BOE Q10 డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 1,600 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుందని సమాచారం. ఫోన్‌కు శక్తినిచ్చేది MediaTek Dimensity 9400+ చిప్‌సెట్. LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్, Immortalis G925 GPUతో పాటు Android 15పై ఈ డివైస్ రన్ అవుతుందని అంచనా.

కెమెరా విభాగంలో, వెనుక భాగంలో 50MP Sony IMX921 ప్రైమరీ సెన్సర్ (OIS, VCS 2.0+), 50MP Samsung JN1 అల్ట్రా వైడ్ కెమెరా, 50MP Sony IMX882 3x పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉండనున్నాయి. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది. అలాగే, 6,200mAh బ్యాటరీ, 90W వైర్డ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండొచ్చని సమాచారం.

ఇంకా Wi-Fi 7, Bluetooth 5.4, NFC, IR బ్లాస్టర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్, IP68, IP69 రేటింగ్స్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉండవచ్చని తెలుస్తోంది.

Vivo X300 FE విషయానికి వస్తే, ప్రస్తుతం స్పెసిఫికేషన్లపై పూర్తి సమాచారం లేదు. అయితే, గతంలో X200 FE గ్లోబల్ వెర్షన్‌ను Vivo S30 Pro Miniగా రీబ్రాండ్ చేసిన విధానాన్ని బట్టి, X300 FE కూడా చైనాలో లాంచ్ అయిన S50 Pro Miniకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా రావచ్చని ఊహాగానాలు ఉన్నాయి.

లాంచ్ టైమ్‌లైన్ విషయానికొస్తే, Vivo X200T జనవరి 2026 చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ధర సుమారు రూ.55,000గా ఉండొచ్చని టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ అంచనా వేస్తున్నారు. X300 FE మాత్రం కొద్దిగా ఆలస్యంగా లాంచ్ అవుతూ, దాదాపు రూ.60,000 ధర శ్రేణిలో ఉండొచ్చని సమాచారం.
 

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ఫోన్ బ్యాటరీని మింగేసే యాప్స్‌పై గూగుల్ సర్జికల్ స్ట్రైక్.. కొత్త వార్నింగ్ ఫీచర్ వచ్చేసింది..!
  2. రియల్‌మీ సంచలనం.. రూ.13,499కే 144Hz డిస్‌ప్లే.. భారీ బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే ఫిదా..!
  3. గూగుల్ నుంచి పవర్‌ఫుల్ ఫోన్.. Pixel 10a సేల్ మొదలైంది.. ఆఫర్లలో భారీ తగ్గింపు..!
  4. లీకైన శామ్‌సంగ్ గెలాక్సీ A37, A57 5G ఫీచర్లు.. ఈ ఫోన్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తాయా..?
  5. చూడగానే ఫిదా అయిపోవాల్సిందే.. సరికొత్త గ్లిఫ్ లైటింగ్, అదిరిపోయే ఫీచర్లతో నథింగ్ ఫోన్ 4a సిరీస్..!
  6. వన్‌ప్లస్ సంచలనం.. ప్రపంచంలోనే మొదటి 165Hz రిఫ్రెష్ రేట్ ఫోన్.. స్పెసిఫికేషన్స్ చూస్తే మైండ్ బ్లాకే..!
  7. శామ్‌సంగ్ షాక్.. ఇండియాలో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ల ధరల పెంపు.. ఏ ఏ మోడల్స్ అంటే..?
  8. పవర్‌ బ్యాంక్ అవసరం లేదు.. మోటరోలా నుంచి 7,000mAh బ్యాటరీ ఫోన్.. ధర వింటే షాకవుతారు..!
  9. షాకింగ్ ప్రైస్ డ్రాప్.. రూ. 80,000 ఫోన్ ఇప్పుడు రూ.66,000 కే?.. ఆఫర్ ఎలా పొందాలో తెలుసా?
  10. గూగుల్ పిక్సెల్ యూజర్లకు పండగే.. ఫోన్ వాడకుండానే అన్నీ జరిగిపోతాయి.. ఎలాగో చూడండి..!
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »