OPPO A6s 4G (CPH2815) స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, ఇందులో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను అందించారు. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 240Hz టచ్ సాంప్లింగ్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది.
Photo Credit: Oppo
OPPO ఇటీవల Oppo A6 4G ని పరిచయం చేసింది.
ఇటీవలే OPPO A6 4G స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసిన ఒప్పో, ఇప్పుడు అదే సిరీస్‌లో మరో కొత్త వేరియంట్‌ను తీసుకొచ్చింది. తాజా మోడల్ పేరు OPPO A6s 4G. డిజైన్, డిస్‌ప్లే, కెమెరా వంటి అంశాల్లో ఈ రెండు ఫోన్లు చాలా వరకు ఒకేలా ఉన్నప్పటికీ, ఛార్జింగ్ విభాగంలో మాత్రం స్పష్టమైన తేడా కనిపిస్తోంది. OPPO A6లో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటే, A6s మోడల్‌లో మరింత వేగమైన 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ అందిస్తున్నారు. అంతేకాదు, A6 మాదిరిగానే A6sలో కూడా రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, అయితే ఇది గరిష్టంగా 5W వరకే పరిమితం. OPPO A6s 4G (CPH2815) స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, ఇందులో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను అందించారు. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 240Hz టచ్ సాంప్లింగ్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. సాధారణంగా 800 నిట్స్ బ్రైట్‌నెస్ ఇవ్వగలిగే ఈ డిస్‌ప్లే, హై బ్రైట్‌నెస్ మోడ్‌లో 1,125 నిట్స్ వరకు వెలుతురు అందిస్తుంది.
ఫోన్ పనితీరుకు Qualcomm Snapdragon 685 4G ప్రాసెసర్ శక్తినిస్తుంది. దీనికి 8GB LPDDR4X ర్యామ్, 128GB లేదా 256GB UFS 2.2 స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. అవసరాన్ని బట్టి మెమరీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను పెంచుకునే అవకాశం కూడా ఉంది. USB OTG సపోర్ట్‌ను కూడా ఇందులో అందించారు. ఈ డివైస్ ColorOS 15పై పనిచేస్తుంది. OPPO అందించే Trinity Engine, Luminous Rendering Engineల కారణంగా యూజర్ ఇంటర్‌ఫేస్ మరింత స్మూత్‌గా, దీర్ఘకాలం స్థిరంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.
కెమెరా విభాగంలో వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ వైడ్ యాంగిల్ కెమెరా (f/1.8, ఆటో ఫోకస్‌తో), దానికి తోడుగా 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సర్ ఉంది. ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. పోర్ట్రెయిట్, నైట్ మోడ్, డ్యూయల్ వ్యూ వీడియో, టైమ్‌ల్యాప్స్, స్క్రీన్ ఫిల్ లైట్, రీటచ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్‌లో భారీ 7,000mAh బ్యాటరీను అమర్చారు. ఇది 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది. అలాగే, అవసరమైనప్పుడు ఇతర డివైసులను ఛార్జ్ చేయడానికి 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉంది.
భద్రత, మన్నిక విషయాల్లో OPPO A6sకి IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది. స్పీకర్లు, పోర్ట్‌లలోకి వెళ్లిన నీరు లేదా ధూళిని మైక్రో వైబ్రేషన్ల ద్వారా బయటకు తోసే ప్రత్యేక స్ప్రే వాటర్ రిమూవల్ ఫీచర్‌ను కూడా అందించారు. ఉష్ణ నియంత్రణ కోసం 3,900 చ.మి. వెపర్ చాంబర్‌తో కూడిన SuperCool VC కూలింగ్ సిస్టమ్ ఇందులో ఉంది. కనెక్టివిటీ పరంగా డ్యూయల్ నానో సిమ్, Wi-Fi 5, Bluetooth 5.0, NFC (ప్రాంతాన్ని బట్టి), USB Type-C పోర్ట్ ఉన్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్‌తో పాటు యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సర్, అంబియంట్ లైట్ సెన్సర్, ఈ-కంపాస్, GNSS వంటి సెన్సర్లను కూడా ఇందులో ఇచ్చారు.
OPPO A6s 4G క్యాపుచినో బ్రౌన్, ఐస్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ధర, లభ్యతకు సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ ఫోన్ OPPO అధికారిక వెబ్‌సైట్‌లో, గ్లోబల్ మార్కెట్ల కోసం A6 సిరీస్‌లోని ఇతర మోడళ్లతో పాటు లిస్టింగ్ అయి ఉంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
Infinix Xpad 30 Pro Launched With MediaTek Helio G200 Ultimate SoC, 8,200mAh Battery: Price, Specifications