జూలై 9న జరగనున్న Samsung Galaxy Unpacked 2025 ఈవెంట్; Galaxy Z Fold 7 మరియు Galaxy Z Flip 7 ఆవిష్కరించబడతాయి

ఈ ఈవెంట్ జులై 9 ఉదయం 10 గంటలకున్యూయార్క్ లో జరగనున్నట్లు శాంసంగ్ కంపెనీ పేర్కొంది. ఈవెంట్ కి కొద్దిమందికి మాత్రమే పర్మిషన్ ఉండటంతో శాంసంగ్ అభిమానులు యూట్యూబ్లో ఉన్న శాంసంగ్ అఫీషియల్ ఛానల్ లేదా శాంసంగ్ వెబ్సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.

జూలై 9న జరగనున్న Samsung Galaxy Unpacked 2025 ఈవెంట్; Galaxy Z Fold 7 మరియు Galaxy Z Flip 7 ఆవిష్కరించబడతాయి

Photo Credit: Samsung

Samsung Galaxy Unpacked 2025 ఈ సంవత్సరం కంపెనీ యొక్క రెండవ ఈవెంట్

ముఖ్యాంశాలు
  • న్యూయార్క్ లో జులై 9న జరగనున్న సాంసంగ్ గెలాక్సీ అన్ ప్యాక్డ్ 2025 ఈవెంట్
  • శాంసంగ్ గెలాక్సీ z ఫ్లిప్ 7, z ఫోల్డ్ 7 కంప్లీట్ డీటెయిల్స్ రివీలింగ్
  • గెలాక్సీ వాచ్ 8, గెలాక్సీ బడ్స్ కోర్ కూడా ఈవెంట్ లోనే ప్రకటన
ప్రకటన

శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్. త్వరలో శాంసంగ్ గెలాక్సీ నుండి పలు కొత్త మోడల్ లాంచ్ కానున్నాయి. శాంసంగ్ నుండి వచ్చే కొత్త కొత్త మోడల్ ఫోన్లో కొరకు అభిమానులు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు వారిని ఎగ్జిట్ చేసే విధంగా కొత్త ఫోన్లో లాంచింగ్ డేట్ ను సాంసంగ్ రివీల్ చేసింది.ఈ సౌత్ కొరియన్ మొబైల్ బ్రాండ్ ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న లేటెస్ట్ జనరేషన్ ఫోల్డబుల్ మొబైల్స్ లను ఈ ఈవెంట్లో లాంచ్ చేయనుంది. పెద్ద ఎత్తున జరగనున్న ఈ గ్రాండ్ ఈవెంట్ కి టెక్ అభిమానులకు ఇన్విటేషన్లు కూడా పంపించింది. ఈవెంట్లో శాంసంగ్ గెలాక్సీ నుండి z ఫోల్డ్ 7, z ఫ్లిప్ 7 మోడల్స్ ను లాంచ్ చేయనుంది. వీటితో పాటుగా శాంసంగ్ నుండి మొట్టమొదటిసారి వస్తున్న గెలాక్సీ వాచ్ 8 సిరీస్, గెలాక్సీ బడ్స్ కోర్ కూడా రివీల్ చెయ్యనుంది.

ఈ ఈవెంట్ జులై 9 ఉదయం 10 గంటలకున్యూయార్క్ లో జరగనున్నట్లు శాంసంగ్ కంపెనీ పేర్కొంది. ఈవెంట్ కి కొద్దిమందికి మాత్రమే పర్మిషన్ ఉండటంతో శాంసంగ్ అభిమానులు యూట్యూబ్లో ఉన్న శాంసంగ్ అఫీషియల్ ఛానల్ లేదా శాంసంగ్ వెబ్సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.

అయితే ఈవెంట్లో ఎటువంటి ప్రకటనలు చేయబోతుందో శాంసంగ్ ఇప్పటికీ రివీల్ చేయలేదు. వచ్చే నెక్స్ట్ జనరేషన్ గెలాక్సీ డివైస్లు ఈ ఈవెంట్లో సందడి చేయనున్నట్లు తెలుస్తుంది. లేటెస్ట్ జనరేషన్ కి తగ్గట్టుగా అత్యాధునిక ఫీచర్స్ తో శాంసంగ్ బ్రాండ్ ఇమేజ్ కి తగ్గట్టుగా వీటిని రూపొందిస్తున్నారు.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం శాంసంగ్ గెలాక్సీ z ఫోల్డ్ 7 డివైస్ లైట్ వెయిట్ తో, స్లిమ్ బాడీతో, మోస్ట్ అడ్వాన్స్డ్ ఫోల్డబుల్ టెక్నాలజీతో వస్తున్నట్లు తెలుస్తుంది. ఇక శాంసంగ్ గెలాక్సీ z ఫ్లిప్ 7 అయితే శాంసంగ్ లేటెస్ట్ గా లాంచ్ చేసిన మోస్ట్ అడ్వాన్స్డ్ చిప్సెట్ Exynos 2500 SoC తో రూపొందుతోంది.

అయితే, శాంసంగ్ అభిమానులకు మరింత చేరువయ్యే విధంగా శాంసంగ్ గెలాక్సీ z ఫ్లిప్ FE ని అత్యంత తక్కువ ధరకే తీసుకురానున్నట్లు తెలిపింది. స్మార్ట్ ఫోన్ తో పాటు స్మార్ట్ వాచ్లు కూడా ఈవెంట్లో లాంచ్ చేయనుంది. శాంసంగ్ కి చెందిన క్లాసిక్ వర్షన్ గెలాక్సీ వాచ్ 8 సిరీస్లను కూడా ప్రకటించనుంది. ఇప్పటికే టీజర్ ద్వారా బయటికి వచ్చిన గెలాక్స్ బడ్స్ కోర్ కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఈ ఈవెంట్ లోనే తెలియని ఉన్నాయి. ఇవే కాకుండా సాంసంగ్ నుండి మరిన్ని మోస్ట్ ఎక్సైటింగ్ డెవలప్మెంట్స్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. గూగుల్ సహకారంతో డెవలప్ చేస్తున్న ఎక్స్టెండ్ రియాలిటీ హెడ్సెట్ ప్రాజెక్ట్ మొహన్ గురించి, అలాగే డెవలప్మెంట్ స్టేజ్ లో ఉందని చెబుతున్న ఫస్ట్ ఎవర్ ట్రై ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ డీటెయిల్స్ కూడా ఈవెంట్లో తెలిసే అవకాశం ఉందని చెబుతున్నారు.

మొత్తం మీద శాంసంగ్ గెలాక్సీ అన్ ప్యాక్డ్ 2025 ఈవెంట్ లో పలు సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో పాటు, ఎక్సైటింగ్ విషయాలను కూడా తెలిసే అవకాశం ఉంది.

మొత్తం మీద శాంసంగ్ లేటెస్ట్ అప్డేటెడ్ మొబైల్స్ లాంచింగ్ తో మరొకసారి స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తన హవాను చూపెట్టేందుకు సిద్ధమవుతుంది. ఈ మోడల్స్ కనుక క్లిక్ అయితే, శాంసంగ్ బ్రాండ్ వాల్యూ మరింత పెరిగే అవకాశం ఉంది.

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. మొత్తం మీద, OnePlus అభిమానులకు ఈ రోజు ఎంతో కీలకంగా మారనుంది.
  2. కెమెరా విభాగంలో, మూడు లెన్స్‌లతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.
  3. లిస్టింగ్ ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ Android 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది.
  4. స్నాప్ డ్రాగన్ 6s Gen 4తో రానున్న HMD Fusion 2 న్యూ మోడల్.. ఇందులోని ప్రత్యేకతలివే
  5. మార్కెట్లోకి రానున్న వివో ఎస్50, ఎస్50 ప్రో.. ఈ అప్డేట్ తెలుసుకోండి
  6. ఈ రెండు ఫోన్‌లు Android 16 బేస్డ్ HyperOS 3 పై నడుస్తాయి
  7. ఈ ఫోన్ కూడా అదే Dimensity 9500 చిప్‌సెట్ మరియు Android 16 OSపై నడుస్తుంది
  8. ఇది ప్రస్తుతం మిడ్‌నైట్ బ్లాక్ అనే ఒక్క కలర్ ఆప్షన్‌లో మాత్రమే కనిపిస్తుంది
  9. వాట్సప్‌లో కొత్త అప్డేట్ ఇదే.. ఈ విషయాలు తెలుసుకోండి
  10. మార్కెట్లోకి రెడ్ మీ వాచ్ 6.. అదిరే ఫీచర్స్
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »