Photo Credit: Samsung
వచ్చే ఏడాది జనవరిలో Samsung Galaxy S25 సిరీస్ పరిచయం కానున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సిరీస్‌లో సాధారణ మూడు మోడల్స్ Galaxy S25, Galaxy S25+, Galaxy S25 Ultraతోపాటు కొత్తగా Galaxy S25 స్లిమ్ వేరియంట్‌ను కంపెనీ పరిచయం చేయనుంది. టాప్-ఆఫ్-ది-లైన్ Galaxy S25 అల్ట్రా మోడల్ ఐకానిక్ బాక్సీ డిజైన్‌కు కొన్ని ఆకర్షణీయమైన మార్పులను జోడించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇటీవలే కనిపించిన హ్యాండ్‌సెట్ డమ్మీ యూనిట్లు ఈ మార్పును మరింత బలపరుస్తున్నాయి. Galaxy S25 Ultra ఈసారి మరింత రౌండ్ డిజైన్‌తో కనిపించే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఇప్పటికే ఉన్న Galaxy S24 అల్ట్రాతో పోలిస్తే ఈ డిజైన్ స్ట్రాటజీ మరింతగా మార్పులతో వచ్చే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
X (గతంలో Twitter)లో ఒక పోస్ట్‌లో, టిప్‌స్టర్ @Jukanlosreve X (గతంలో Twitter)లో Samsung Galaxy S25 Ultraను సూచించేలా దీని డమ్మీ యూనిట్‌ల రెండు ఫోటోలను ఓ పోస్టులో షేర్ చేశారు. దక్షిణ కొరియా టెక్నాలజీ గల ఈ ఫ్లాగ్‌షిప్ నాన్-ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ డిజైన్ గుండ్రని అంచులను కలిగే మార్పలను సూచిస్తున్నట్లు లీక్ చేయబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు బ్లాక్ షేడ్‌తో సహా నాలుగు రంగులతో కూడిన డమ్మీ యూనిట్‌లతో ప్రత్యక్షమయ్యింది.
Galaxy S25 Ultra డమ్మీ యూనిట్‌లతో మార్పులతో కూడిన డిజైన్‌ను బహిర్గతం చేయడం ఇది రెండో సారిగా చేప్పొచ్చు. ఈ సిరీస్‌లో కంపెనీ నుంచి గత కొన్ని సంవత్సరాలుగా వస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లలో Samsung అల్ట్రా మోడల్‌లో తప్పనిసరిగా కనిపిస్తోన్న బాక్సీ డిజైన్‌కు ఈసారి స్వస్తి పలికే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయినప్పటికీ, కుడివైపున పవర్, వాల్యూమ్ బటన్‌ల ప్లేస్‌మెంట్‌తోపాటు ఒకేలాంటి వెనుక కెమెరా లేఅవుట్ సహా ప్రస్తుత మోడళ్లను పోలీ ఉండే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
ఇప్పటి వరకూ ఆన్‌లైన్‌లో వచ్చిన నివేదికల ప్రకారం.. Samsung Galaxy S25 Ultra 6.86-అంగుళాల AMOLED స్క్రీన్‌తో గతంలో వచ్చిన మోడల్ కంటే సన్నని బెజెల్స్‌తో రూపొందించవచ్చని భావిస్తున్నారు. అలాగే, ఈ హ్యాండ్‌సెట్‌లో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 10-మెగాపిక్సెల్ 3x టెలిఫోటో కెమెరా, 50-మెగాపిక్సెల్ 5x టెలిఫోటో కెమెరా, అప్‌గ్రేడ్ చేసిన 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉండొచ్చని అంచనా.
ఇది Qualcomm న్యూ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వచ్చే అవకాశం ఉంది. అలాగే, 16GB వరకు RAM సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్‌ను 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ సామర్థ్యంతో అందించనున్నారు. అంతేకాదు, ఇటీవలి లీక్‌ల ప్రకారం Galaxy S25 Ultra బిల్ ఆఫ్ మెటీరియల్స్ (BoM) కనీసం $110 (దాదాపు రూ. 9,300) ధరతో ముందున్న దాని కంటే ఎక్కువ ఉండొచ్చని, ఎంపిక చేసిన మార్కెట్లలో దీని ధరల పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
ప్రకటన
ప్రకటన