realme Neo8లో ట్రాన్స్పేరెంట్ RGB డిజైన్ ప్రధాన ఆకర్షణ. సైబర్ పర్పుల్, ఆరిజన్ వైట్, మెచా గ్రే అనే మూడు కలర్ వేరియంట్లలో ఇది లభిస్తుంది. కొత్త 3D ట్రాన్స్పేరెంట్ పార్టిషనింగ్ టెక్నాలజీ ద్వారా బ్యాక్ ప్యానెల్పై 11 రకాల టెక్స్చర్లను చెక్కారు. దీని వల్ల లైట్, షాడో ప్రతిబింబాలు వేర్వేరుగా కనిపిస్తాయి.
Photo Credit: Realme
P3 కలర్ గామట్, 165Hz రిఫ్రెష్, 3800Hz టచ్, ఐ ప్రొటెక్షన్ ఫీచర్లు ఉన్నాయి సపోర్ట్
realme హామీ ఇచ్చినట్టే చైనాలో తన కొత్త స్టాండఅలోన్ Neo సిరీస్ స్మార్ట్ఫోన్ realme Neo8 ను అధికారికంగా విడుదల చేసింది. డిజైన్ నుంచి పనితీరు, గేమింగ్ ఫీచర్లు నుంచి భారీ బ్యాటరీ వరకు ఈ ఫోన్ యూత్, గేమర్స్ను టార్గెట్ చేస్తూ పూర్తిగా కొత్త దృక్పథంతో తీసుకొచ్చినట్టుగా కనిపిస్తోంది.
realme Neo8లో ట్రాన్స్పేరెంట్ RGB డిజైన్ ప్రధాన ఆకర్షణ. Cyber Purple, Origin White, Mecha Gray అనే మూడు కలర్ వేరియంట్లలో ఇది లభిస్తుంది. కొత్త 3D ట్రాన్స్పేరెంట్ పార్టిషనింగ్ టెక్నాలజీ ద్వారా బ్యాక్ ప్యానెల్పై 11 రకాల టెక్స్చర్లను చెక్కారు. దీని వల్ల లైట్, షాడో ప్రతిబింబాలు వేర్వేరుగా కనిపిస్తాయి. “Make it real.” అనే ప్రత్యేక నేమ్ప్లేట్ డిజైన్ కూడా ఉంది.
Awakening Halo లైటింగ్ ఫీచర్ తిరిగి వచ్చింది. ఇది ఈ-స్పోర్ట్స్ లైటింగ్, నోటిఫికేషన్ లైట్స్, మ్యూజిక్ లైటింగ్కు సపోర్ట్ ఇస్తుంది. లాటరీ టైమ్లో ఉపయోగపడే లక్కీ కలర్ ఫ్లిప్ ఫంక్షన్ కూడా ఇందులో ఉంది. మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్, సన్నని బెజెల్స్, పెద్ద రౌండెడ్ కార్నర్స్తో ఫోన్ ప్రీమియమ్ లుక్ ఇస్తుంది. IP66, IP68, IP69 రేటింగ్లతో పూర్తి డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది.
డిస్ప్లే అనుభవం
Samsung Displayతో కలిసి ప్రత్యేకంగా రూపొందించిన 6.78 అంగుళాల 165Hz Samsung Sky Screen ఈ ఫోన్లో ఉంది. M14 ల్యూమినస్ మెటీరియల్తో తయారైన ఈ డిస్ప్లే 6500 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్నెస్, 3800 నిట్స్ సన్లైట్ విజిబిలిటీని అందిస్తుంది. 103% P3 కలర్ గామట్ సపోర్ట్ ఉండటం విశేషం. 165Hz రిఫ్రెష్ రేట్ వల్ల గేమింగ్లో స్మూత్ అనుభవం లభిస్తుంది. 3800Hz టచ్ సాంప్లింగ్ రేట్, ఐ ప్రొటెక్షన్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
Snapdragon 8 Gen 5 ప్రాసెసర్తో వచ్చిన realme Neo8, UFS 4.1 స్టోరేజ్, LPDDR5X ర్యామ్తో శక్తివంతమైన పనితీరును అందిస్తుంది. GT Performance Engine ద్వారా FPS గేమ్స్లో 165Hz స్టేబుల్ ఫ్రేమ్రేట్స్ సాధ్యమవుతాయి. ప్రత్యేకంగా PC Handheld Mode ఈ ఫోన్లో కొత్తగా పరిచయం చేశారు, దీని ద్వారా కొన్ని PC గేమ్స్ను ఫోన్లోనే ఆడే వీలుంది.
50MP Sony IMX896 మెయిన్ కెమెరా (OIS), 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రా వైడ్ కెమెరాతో ఫోటోగ్రఫీ విభాగంలో కూడా ఇది బలంగా ఉంది. ముందు వైపు 16MP సెల్ఫీ కెమెరా ఉంది. 8000mAh భారీ బ్యాటరీ, 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ లాంగ్ బ్యాటరీ లైఫ్ను హామీ ఇస్తోంది. realme Neo8 చైనాలో మాత్రమే ప్రస్తుతం అమ్మకానికి అందుబాటులో ఉంది. ప్రారంభ వారంలో 200 యువాన్ డిస్కౌంట్ కూడా ఉంది. ధరలను చూసుకుంటే, ఇది ప్రీమియమ్ గేమింగ్ ఫోన్ సెగ్మెంట్లో గట్టి పోటీ ఇవ్వగలదని చెప్పొచ్చు.
ces_story_below_text
ప్రకటన
ప్రకటన