సెక్యూరిటీ పరంగా కూడా vivo ఈ సిరీస్‌లో మంచి మార్పులు చేసింది. సెకండ్ జనరేషన్ 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌ను ధర పరిధిలోనే మొదటిసారి స్టాండర్డ్‌గానే అందిస్తోంది. S50 Pro miniలో 6.31 అంగుళాలు, S50లో 6.59 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లేలు ఉంటాయి.
Photo Credit: Vivo
టీజర్ల తర్వాత, డిసెంబర్ 15న చైనాలో S50 మరియు S50 ప్రో మినీ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనున్నట్లు వివో ధృవీకరించింది
చైనాలో డిసెంబర్ 15న vivo తన కొత్త S50 మరియు S50 Pro mini స్మార్ట్‌ఫోన్‌లను అధికారికంగా విడుదల చేయబోతోంది. ఎన్నో టీజర్ల తర్వాత కంపెనీ ఈ లాంచ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే వెల్లడైన వివరాల ప్రకారం, vivo S50 Pro miniలో Snapdragon 8 Gen 5 చిప్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ప్రాసెసర్ AnTuTu బెంచ్‌మార్క్‌లో 30 లక్షల పాయింట్లు సాధించి, గత మిడ్-రేంజ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ల కంటే దాదాపు 10 లక్షల పాయింట్లు ఎక్కువగా స్కోర్ చేసింది. LPDDR5X RAM, UFS 4.1 స్టోరేజ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంటాయి. మరోవైపు, స్టాండర్డ్ vivo S50లో Snapdragon 8s Gen 3 చిప్ ఉండబోతోందని ముందున్న రిపోర్టులు సూచిస్తున్నాయి. ఇది పూర్వ మోడల్ S30లో ఉన్న Snapdragon 7 Gen 4 నుండి వచ్చిన పెద్ద అప్‌గ్రేడ్‌గా చెప్పచ్చు.
సెక్యూరిటీ పరంగా కూడా vivo ఈ సిరీస్‌లో మంచి మార్పులు చేసింది. సెకండ్ జనరేషన్ 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌ను ధర పరిధిలోనే మొదటిసారి స్టాండర్డ్‌గానే అందిస్తోంది. S50 Pro miniలో 6.31 అంగుళాలు, S50లో 6.59 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లేలు ఉంటాయి.
కెమెరా విభాగంలో కూడా vivo పెద్ద మోస్తరు అప్‌గ్రేడ్‌లు చేసింది. మొత్తం S50 సిరీస్‌లో Sony IMX882 1/1.95” సెన్సర్‌తో కూడిన పెరిస్కోప్ కెమెరా అందించబడుతోంది. S50 Pro mini ప్రత్యేకంగా VCS అల్ట్రా-సెన్సిటివ్ బయోనిక్ లార్జ్ సెన్సర్ మెయిన్ కెమెరాతో వస్తోంది. ముందు కెమెరా విషయంలో 50MP యాంటీ-డిస్టోర్షన్ సాఫ్ట్-లైట్ సెల్ఫీ లెన్స్‌ను ఉపయోగించారు. ఫ్లాగ్‌షిప్ మోడళ్లలో ఉపయోగించే ఫుల్-ఫోకల్-లెంగ్త్ జూమ్ ఫ్లాష్ కూడా ఇక్కడ లభిస్తుంది. అలాగే, మొత్తం సిరీస్‌లో ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో కనిపించే నేచురల్ పోర్ట్రెట్ అల్గారిథమ్‌ను అందించడంతో ముఖ లక్షణాలు అత్యంత సహజంగా, అనవసర AI ప్రాసెసింగ్ లేకుండా కనిపిస్తాయి.
డిజైన్ విషయానికి వస్తే, S50 Pro mini హారిజాంటల్ కెమెరా మాడ్యూల్‌తో వస్తుండగా, స్టాండర్డ్ S50లో రెక్టాంగ్యులర్ కెమెరా డిజైన్‌ను ఉపయోగించారు. అన్ని మోడళ్లలోనూ ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ ఉపయోగించారు. కొత్త సాటిన్ లిథోగ్రఫీ ఫినిష్ వీటి లుక్స్‌కి మరింత మెరుగైన ప్రీమియం టచ్‌ను ఇస్తుంది. కలర్ ఆప్షన్‌ల విషయంలో S50 మోడల్ గ్రే, వైట్, పర్పుల్ రంగుల్లో వస్తోంది. ఇక S50 Pro miniలో వీటితో పాటు ప్రత్యేకంగా బ్లూ వేరియంట్ కూడా అందుబాటులో ఉంటుంది.
ప్రకటన
ప్రకటన
Elon Musk Says Grok 4.20 AI Model Could Be Released in a Month
Xiaomi 17 Global Variant Listed on Geekbench, Tipped to Launch in India by February 2026
James Gunn's Superman to Release on JioHotstar on December 11: What You Need to Know
The Boys Season 5 OTT Release Date: When and Where to Watch the Final Season Online?