మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ SoC, 6,500mAh బ్యాటరీతో Vivo X200 FE లాంచ్: ధర, స్పెసిఫికేషన్లు

ఈ ఫోన్ ఫీచర్లను ఒక్కసారి గమనిస్తే లేటెస్ట్ జనరేషన్ తగ్గట్టు అన్ని స్పెసిఫికేషన్స్ లో ఇందులో ఇన్క్లూడ్ చేశారు. డ్యూయల్ సిమ్ స్లాట్స్ తో వస్తున్న ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 15 బేస్డ్ ఫన్ టచ్ OS 15 తో పనిచేయనుంది.

మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ SoC, 6,500mAh బ్యాటరీతో Vivo X200 FE లాంచ్: ధర, స్పెసిఫికేషన్లు

Photo Credit: Vivo

Vivo X200 FE (చిత్రంలో) ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది

ముఖ్యాంశాలు
  • ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ తో వస్తున వివో X200 FE
  • నాలుగు డిఫరెంట్ కలర్స్ లో అందుబాటులో ఉండనుంది
  • IP68, IP69 రేటింగ్ తో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్
ప్రకటన

ప్రముఖ చైనా మొబైల్ బ్రాండ్ వివో బెస్ట్ బడ్జెట్ ఫోన్స్ అందించడంలో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రతి సంవత్సరం తమ బ్రాండ్ నుండి లేటెస్ట్ టెక్నాలజీతో మంచి మంచి ఫోన్లో లాంచ్ చేస్తూ ఉంటుంది. తాజాగా తమ కొత్త స్మార్ట్ ఫోన్ వివో X200 FE ను ఈ సోమవారం తైవాన్ లో రివీల్ చేసింది. ప్రస్తుతానికి ఇది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. కాబోయే వారంలో గ్లోబల్ మార్కెట్లోకి ఇది ప్రవేశించనున్నట్లు వివో కంపెనీ ప్రకటించింది. ఈ మొబైల్ గత నెలలో చైనాలో రిలీజ్ అయిన వివో S30 ప్రో మినీకి దగ్గర పోలికలతో ఉంటుంది.ఈ ఫోన్ ఫీచర్లను ఒక్కసారి గమనిస్తే లేటెస్ట్ జనరేషన్ తగ్గట్టు అన్ని స్పెసిఫికేషన్స్ లో ఇందులో ఇన్క్లూడ్ చేశారు. డ్యూయల్ సిమ్ స్లాట్స్ తో వస్తున్న ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 15 బేస్డ్ ఫన్ టచ్ OS 15 తో పనిచేయనుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే అక్టా కోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 9300+ SoC చిప్సెట్ తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ తో, 460ppi పిక్సెల్ డెన్సిటీతో6.31ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఇస్తున్నారు.

బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6500mAh బ్యాటరీ ఇస్తున్నారు. ఇది ఎక్కువ సేపు ఫోన్ యూస్ చేసుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది. తక్కువ సమయంలోనే ఫుల్ ఛార్జ్ కూడా చేయవచ్చు. ఈ ఫోన్150.83x71.76x7.99mm మెజర్మెంట్స్ తో 186g బరువు ఉంటుంది.

వివో మొబైల్స్ కి స్పెషల్ ఎట్రాక్షన్ ఏదైనా ఉందంటే అది కెమెరా యూనిట్ అనే చెప్పాలి. ఈ వివో X200 FEలో కూడా Zeiss త్రిబుల్ కెమెరా రేర్ కెమెరా యూనిట్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సల్ Zeiss IMX921 మెయిన్ కెమెరా, 50 మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఒక సెల్ఫీలు, వీడియో చాటింగ్ చేసుకునే వారికి ప్రత్యేకంగా 50 మెగాపిక్సల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరా యూనిట్ కూడా ఇచ్చారు.

ఈ మొబైల్ పొరపాటున వాటర్ లో పడిన, డస్ట్ లో పడిన ఎటువంటి భయం లేకుండా IP68, IP69 రేటింగ్స్ తో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా బాగానే ఇచ్చారు. బ్లూటూత్ 5.4, జిపిఎస్, వైఫై, ఓటిజి, యూఎస్బీ టైప్ C పోర్ట్, Beidou, Glonass, Galileo,Qzss నావిగేషన్ సిస్టమ్స్ ఇన్బుల్ట్ గా వస్తున్నాయి. ఇక సెన్సార్ల విషయానికొస్తే... కలర్ టెంపరేచర్ సెన్సార్, ఈ కంపాస్, డిస్టెన్స్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్, లైట్ సెన్సార్, గైరోస్కోప్, ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్, ఫ్లిక్ సెన్సార్లు ప్రొవైడ్ చేస్తున్నారు.

స్టోరేజ్ ఆప్షన్స్ కూడా మంచిగానే ఇచ్చారు.12GB LPDDR5X RAM, 512GB UFS 3.1 స్టోరేజ్ ను ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వివో X200 FE మొబైల్ ఫ్యాషన్ పింక్, ఎల్లో, మినిమలిస్ట్ బ్లాక్, మోడ్రన్ బ్లూ కలర్స్ లో వస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ అయితే మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు. అయితే ఈ ఫోన్ ఒకసారి గ్లోబల్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రైస్ రేంజ్ తో పాటు ఇతర డీటెయిల్స్ అన్ని పూర్తిగా తెలుస్తాయి.

Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. దయచేసి మీ ఫోన్లను రీస్టార్ట్‌ చేయండి అని ఎయిర్‌టెల్ వినియోగదారులకు సూచించింది
  2. లీకైన ఒప్పో ఎఫ్ 31 సిరీస్.. అదిరే లుక్స్‌తో రానున్న న్యూ మోడల్స్
  3. హానర్ మ్యాజిక్ వి ఫ్లిప్ 2 న్యూ మోడల్.. సేల్ ఎప్పటి నుంచంటే
  4. ఇప్పుడు బెంగళూరులోని హెబ్బాళ్ స్టోర్ ఈ అనుభవాన్ని మరింత విస్తృతం చేయనుంది
  5. రత మార్కెట్‌లోకి గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లు, అద్బుతమైన ఫీచర్లు, ఎక్కడ కొనుగోలు చేయవచ్చంటే?
  6. జెమినీ కెమెరా కోచ్, ఫేస్ అన్‌బ్లర్, మ్యాజిక్ ఈరేసర్ ఫీచర్లు ఫోటోలు అందంగా చేస్తాయి
  7. రూ. 249 ప్లాన్‌ను నిలిపి వేసిన ఎయిర్ టెల్
  8. ఇక కెమెరా విషయానికి వస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను సెట్ చేశారు
  9. అదిరే ఫీచర్స్, ధరతో హానర్ X7c 5G కొత్త మోడల్
  10. Apple IDని లింక్ చేయడం ద్వారా ఆపిల్ మ్యూజిక్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »