పనితీరులోకి వస్తే, Dimensity 9500 చిప్‌సెట్‌కి తోడు 16GB LPDDR5X RAM మరియు 512GB UFS 4.1 స్టోరేజ్‌ను వివో అందించింది. ఫోన్ మిడ్-ఫ్రేం అల్యూమినియం అలాయ్‌తో, ముందు గ్లాస్ మరియు వెనుక గ్లాస్ ఫైబర్ మెటీరియల్‌తో రూపొందించబడింది.
Photo Credit: Vivo
వివో ఎక్స్ 300 ప్రో డ్యూన్ గోల్డ్ మరియు ఎలైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ప్రారంభించబడింది.
VIVO కంపెనీ తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Vivo X300 Pro ను మంగళవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. స్టాండర్డ్ Vivo X300తో కలిసి వచ్చిన ఈ ప్రీమియం మోడల్ రెండు రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. ఇది అక్టోబర్‌లో చైనా మరియు కొన్ని గ్లోబల్ మార్కెట్లలో కూడా విడుదలైంది. Vivo X300 Pro ఒక్కటే కాన్ఫిగరేషన్‌లో వచ్చింది... 16GB + 512GB మోడల్ ధర రూ.1,09,999. ఈ ఫోన్ డ్యూన్ గోల్డ్, ఎలైట్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. ప్రీ-బుకింగ్స్ ఈరోజు నుంచి ప్రారంభం కానుండగా, అమ్మకాలు డిసెంబర్ 10 నుంచి Vivo ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ మరియు ఇతర రిటైల్ స్టోర్లలో మొదలవుతాయి. కంపెనీ ప్రత్యేకంగా అందిస్తున్న Telephoto Extender Kit ధర రూ. 18,999.
డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వచ్చే ఈ ఫోన్ Android 16 ఆధారంగా రూపొందించిన OriginOS 6 పై నడుస్తుంది. 6.78 అంగుళాల 1.5K LTPO AMOLED డిస్‌ప్లే (1260×2800 పిక్సెల్స్)తో, 120Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ సాంప్లింగ్ రేట్, HDR10+ సపోర్ట్ వంటి ఫీచర్లు అందించబడాయి. స్క్రీన్ టు బాడీ రేషియో 94.85% ఉండటం వల్ల ఫోన్ చూడటానికి ప్రీమియమ్ లుక్ ఇస్తుంది. కంటి అలసటను తగ్గించడానికి SGS Low Blue Light మరియు TUV Rheinland Flicker-Free సర్టిఫికేషన్లు కూడా ఉన్నాయి.
పనితీరులోకి వస్తే, Dimensity 9500 చిప్‌సెట్‌కి తోడు 16GB LPDDR5X RAM మరియు 512GB UFS 4.1 స్టోరేజ్‌ను వివో అందించింది. ఫోన్ మిడ్-ఫ్రేం అల్యూమినియం అలాయ్‌తో, ముందు గ్లాస్ మరియు వెనుక గ్లాస్ ఫైబర్ మెటీరియల్‌తో రూపొందించబడింది.
ఇక ఇందులో కెమెరా సెటప్ విషయానికి వస్తే ఫోటోగ్రఫీలో Vivo X300 Pro తన క్లాస్‌లో ఒక హెవీవెయిట్. 50MP Sony LYT-828 ప్రధాన కెమెరా (CIPA 5.5 స్టెబిలిటీ రేటింగ్‌తో), 200MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్, 3.5x ఆప్టికల్ జూమ్, 50MP వైడ్-యాంగిల్ JN1 సెన్సార్, సెల్ఫీల కోసం ముందువైపు 50MP కెమెరా ఇవ్వబడింది. ప్రత్యేకంగా Zeissతో కలిసి రూపొందించిన Telephoto Extender Kit 2.35X సపోర్ట్ ఈ మోడల్‌కి ప్రత్యేకతను తెచ్చిపెడుతుంది. దీన్ని కిట్ ద్వారా ఫోన్‌కు కనెక్ట్ చేస్తే, టెలిఫోటో లెన్స్ మరింత శక్తివంతమైన ఆప్టికల్ జూమ్ లెన్స్‌గా మారుతుంది.
కనెక్టివిటీ పరంగా 5G, Wi-Fi, Bluetooth 6, NFC, GPS, NavIC, USB Type-C పోర్ట్ వంటి అన్ని ప్రధాన కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. ఫింగర్‌ప్రింట్ సెన్సార్ సహా అవసరమైన అన్ని సెన్సార్లు అందించబడ్డాయి. ఈ ఫోన్‌లో 6,510mAh బ్యాటరీ ఉండి 90W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. చైనా వేరియంట్ కూడా ఇదే బ్యాటరీతో వస్తుండగా, గ్లోబల్ వేరియంట్‌లో మాత్రం కొంచెం తక్కువగా 5,440mAh బ్యాటరీ ఇచ్చారు. IP68 మరియు IP69 రేటింగ్స్ వల్ల నీరు, దుమ్ము వంటి పరిస్థితుల్లో కూడా ఫోన్ సురక్షితంగా పనిచేస్తుంది. సుమారు 226 గ్రాముల బరువుతో, 161×75.5×7.99mm పరిమాణాలతో ఈ ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు ప్రీమియమ్ ఫీల్ ఇస్తుంది.
ప్రకటన
ప్రకటన