Vivo X300 స్మార్ట్ ఫోన్ మంగళవారం భారతదేశంలో ప్రారంభించబడింది. Vivo X300 6.31-అంగుళాల 1.5K (1216×2640 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లేను 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 300Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్, HDR సపోర్ట్‌ని కలిగి ఉంది
Photo Credit: Vivo
వివో ఎక్స్ 300 ఎలైట్ బ్లాక్, మిస్ట్ బ్లూ మరియు సమ్మిట్ రెడ్ షేడ్స్‌లో వస్తుంది.
సరికొత్త Vivo X300 స్మార్ట్ ఫోన్ మంగళవారం భారతదేశంలో ప్రారంభించబడింది. Vivo X300 సిరీస్ చైనాలో ఆవిష్కరించబడింది. కొన్ని వారాల తర్వాత ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలోకి వచ్చింది. Vivo X300 వేరియంట్ MediaTek Dimensity 9500 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా కంపెనీ OriginOS 6 స్కిన్‌ను కలిగి ఉంది. ఇది 200 మెగాపిక్సెల్ సెన్సార్ నేతృత్వంలోని Zeiss-ట్యూన్ చేయబడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో అమర్చబడి ఉంది. భారతదేశంలో Vivo X300 ధర 12GB + 256GB బేస్ ఆప్షన్ ధర రూ. 75,999ల నుంచి ప్రారంభమవుతుంది. 12GB + 512GB, 16GB + 512GB RAM స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ల ధర వరుసగా రూ. 81,999, రూ. 85,999లు. ఈ ఫోన్ ఎలైట్ బ్లాక్, మిస్ట్ బ్లూ, సమ్మిట్ రెడ్ కలర్ ఆప్షన్‌లలో సేల్స్‌కి ఉంది. Vivo X300 సిరీస్ కోసం ప్రీ-బుకింగ్ ప్రస్తుతం దేశంలో Vivo ఇండియా వెబ్‌సైట్ ద్వారా చేసుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌లు డిసెంబర్ 10 నుంచి అమ్మకానికి వస్తాయి.
వివో జీస్ 2.35x టెలిఫోటో ఎక్స్‌టెండర్ కిట్ ధర రూ. 18,999లు. Vivo అనేక ప్రధాన ప్రయోజనాలను అందిస్తోంది, వీటిలో బండిల్ ఆఫర్ ద్వారా ఫ్లాట్ రూ. 4,000 తగ్గింపు, SBI కార్డ్, HDFC బ్యాంక్ కస్టమర్లకు తక్షణ 10 శాతం క్యాష్‌బ్యాక్ ఉన్నాయి. ఆన్‌లైన్ ఆఫర్‌లలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా చేసిన కొనుగోళ్లపై 24 నెలల నో-కాస్ట్ EMI ఆప్షన్లు, ఫ్లాట్ రూ. 4,000 తగ్గింపు ఉన్నాయి.
Vivo X300 6.31-అంగుళాల 1.5K (1216×2640 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లేను 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 300Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్, HDR సపోర్ట్‌ని కలిగి ఉంది. ఇది 3nm MediaTek Dimensity 9500 SoC ద్వారా పవర్‌ని పొందుతుంది. ఇది Pro Imaging VS1 చిప్, V3+ ఇమేజింగ్ చిప్‌తో జత చేయబడింది. హ్యాండ్‌సెట్ 16GB, LPDDR5x అల్ట్రా RAM, 512GB వరకు UFS 4.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌కి సపోర్ట్ ఇస్తుంది. ఇది Android 16 ఆధారిత OriginOS 6తో వస్తుంది.
ఆప్టిక్స్ విషయానికొస్తే Vivo X300లో Zeiss-బ్యాక్డ్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ఇందులో 200-మెగాపిక్సెల్ 1/1.14-అంగుళాల HPB సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో, 50-మెగాపిక్సెల్ 1/2.76-అంగుళాల JN1 వైడ్-యాంగిల్ లెన్స్ , 50-మెగాపిక్సెల్ సోనీ IMX885 LYT-602 టెలి ఫోటో షూటర్, OIS, 3x ఆప్టికల్ జూమ్ ఉన్నాయి. ముందు భాగంలో హ్యాండ్‌సెట్ సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 50 మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది. అన్ని కెమెరాలు 4K వీడియో రికార్డింగ్‌కు మద్దతునిస్తాయి.
Vivo X300 90W వైర్డు, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 6,040mAh లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. భద్రత కోసం ఇది ఇన్-డిస్ ప్లే 3D అల్ట్రాసోనిక్ సింగిల్-పాయింట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో అమర్చబడి ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G, Wi-Fi, బ్లూటూత్ 6, GPS, NFC, OTG, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఇది దుమ్ము, నీటి నిరోధకత కోసం IP68 మరియు IP69 రేటింగ్‌లను కలిగి ఉంది. అంతేకాకుండా హ్యాండ్‌సెట్ 150.57×71.92×7.95mm పరిమాణంలో, 190 గ్రాముల బరువు ఉంటుంది.
ప్రకటన
ప్రకటన