మార్కెట్లోకి వచ్చిన Vivo Y500 ప్రో మోడల్.. బ్యాటరీ కెపాసిటీ ఎంతంటే?

Vivo Y500 Pro మోడల్ తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్‌ను అందించేందుకు మార్కెట్లోకి వచ్చింది. ఈ మోడల్ 160.23×74.51×7.81mm కొలతలతో వస్తోంది. ఈ హ్యాండ్ సెట్ మొత్తంగా 198 గ్రాముల బరువు ఉంటుంది.

మార్కెట్లోకి వచ్చిన Vivo Y500 ప్రో మోడల్.. బ్యాటరీ కెపాసిటీ ఎంతంటే?

Photo Credit: Vivo

వివో వై500 ప్రోలో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.

ముఖ్యాంశాలు
  • వివో నుంచి న్యూ మోడల్ లాంఛ్
  • Vivo Y500 ప్రో ధర, ఫీచర్స్ ఏంటంటే?
  • బ్యాటరీ కెపాసిటీ ఎంతంటే?
ప్రకటన

వివో నుంచి న్యూ మోడల్ మార్కెట్లోకి వచ్చింది. వివో Y500 ప్రో కొత్త మోడల్ సోమవారం (నవంబర్ 10) చైనాలో లాంఛ్ అయింది. కొత్త వివో వై సిరీస్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌పై నడుస్తుంది. 1.5 కె రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. వివో వై500 ప్రో 200-మెగాపిక్సెల్ శామ్‌సంగ్ HP5 సెన్సార్‌ను కలిగి ఉంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 7,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ డస్ట్ అండర్ వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68+IP69-రేటెడ్ బిల్డ్‌ను అందిస్తుంది.వివో వై500 ప్రో ధర ఎంతంటే?వివో వై500 ప్రో 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర CNY 1,799 (సుమారు రూ. 22,000). 8GB + 256GB, 12GB + 256GB, 12GB + 512GB RAM స్టోరేజ్ మోడళ్ల ధర వరుసగా CNY 1,999 (సుమారు రూ. 25,000), CNY 2,299 (సుమారు రూ. 28,000), CNY 2,599 (సుమారు రూ. 32,000)గా ఉంది. ఈ ఫోన్ ఆస్పిషియస్ క్లౌడ్, లైట్ గ్రీన్, సాఫ్ట్ పౌడర్, టైటానియం బ్లాక్ షేడ్స్‌లో లభ్యం కానుంది.

Vivo Y500 Pro స్పెసిఫికేషన్లు ఇవే

డ్యూయల్-సిమ్ Vivo Y500 Pro ఆండ్రాయిడ్ 16-ఆధారిత OriginOS 6పై నడుస్తుంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 1,600 nits పీక్ బ్రైట్‌నెస్, 94.10 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో 6.67-అంగుళాల 1.5K (1,260×2,800 పిక్సెల్స్) OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ 4nm MediaTek Dimensity 7400 చిప్‌సెట్‌తో పాటు 12GB వరకు LPDDR4X RAM, 512GB వరకు UFS2.2 స్టోరేజ్‌తో నడుస్తుంది.

ఆప్టిక్స్ విషయానికొస్తే Vivo Y500 Pro డ్యూయల్ రేర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో f/1.88 ఎపర్చర్‌తో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు f/2.4 ఎపర్చర్‌తో 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం, ఫోన్‌లో f/2.45 ఎపర్చర్‌తో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. హ్యాండ్‌సెట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68+IP69-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది.

Vivo Y500 Pro లోని కనెక్టివిటీ ఎంపికలలో 5G, బ్లూటూత్ 5.4, GPS, A-GPS, Beidou, GLONASS, Galileo, QZSS, OTG, Wi-Fi, NavIC మరియు USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్లలో e-కంపాస్, గైరోస్కోప్, గ్రావిటీ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్, ఫోటోసెన్సిటివ్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. హ్యాండ్‌సెట్‌లో బయోమెట్రిక్ ప్రామాణీకరణ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేషియల్ రికగ్నైజేషన్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Vivo Y500 Pro 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 7,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది 160.23×74.51×7.81mm కొలతలతో 198 గ్రా. బరువు ఉంటుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. గత మోడళ్లతో పోలిస్తే ఇవి కొద్దిగా ఎత్తుగా, వెడల్పుగా మరియు మందంగా ఉండనున్నట్లు సమాచారం..
  2. భారతి ఎయిర్‌టెల్ తాజాగా తన రూ. 189 వాయిస్-ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్‌ను సైలెంట్ గా నిలిపివేసింది.
  3. మార్కెట్లోకి వచ్చిన Vivo Y500 ప్రో మోడల్.. బ్యాటరీ కెపాసిటీ ఎంతంటే?
  4. సామ్ సంగ్ గెలాక్సీ యూజర్లకు షాక్.. ఈ స్పైవేర్ గురించి తెలుసుకున్నారా?
  5. భారత మార్కెట్‌లో లావా అగ్ని 4 ధర రూ. 30,000 లోపుగా ఉండే అవకాశం ఉంది.
  6. యాపిల్ ప్లాన్ చేసిన కొత్త శాటిలైట్ ఫీచర్లు మరింత త్వరగా వినియోగదారుల చేతుల్లోకి వచ్చే అవకాశం ఉంది.
  7. మొత్తం మీద, సామ్‌సంగ్ గెలాక్సీ S26 సిరీస్ జనవరి చివర్లో రంగప్రవేశం చేయనున్నది.
  8. రెండు మోడళ్లలోను ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది, ఇది 95.5% స్క్రీన్-టు-బాడీ రేషియోతో ఆకట్టుకుంటుంది.
  9. రియల్‌ మీ జీటీ 8 ప్రో ఆస్టన్ మార్టిన్ ఎఫ్1 ధర ఎంతంటే?.. ఇతర విశేషాలు తెలుసుకున్నారా?
  10. వన్ ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ఫోన్ అప్డేట్.. ఈ ఫీచర్స్ గురించి తెలుసుకోండి
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »