Photo Credit: Oppo
oppo K12s 5G ప్రిజం బ్లాక్, రోజ్ పర్పుల్ మరియు స్టార్ వైట్ (అనువాదం) షేడ్స్‌లో వస్తుంది.
చైనాలో వచ్చే వారం Oppo K12s 5G మొబైల్ లాంఛ్ కానుంది. దీంతో రానున్న హ్యాండ్‌సెట్ డిజైన్‌తోపాటు RAM, స్టోరేజీ ఆప్షన్‌లు బయటకు వచ్చాయి. ఈ Oppo స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన బ్యాటరీ, ఛార్జింగ్ వివరాలు సైతం కంపెనీ ధృవీకరించింది. రాబోయే కొత్త మోడల్ ఫోన్ మన దేశంలో 2024 ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో అడుగుపెట్టిన Oppo K12, K12 ప్లస్ వేరియంట్‌ల సరసన చేరబోతోంది. అలాగే, మార్కెట్ వర్గాలు అంచనా ప్రకారం.. ఏప్రిల్ 21న కొత్త Oppo K13 5G ఫోన్ ని ఇండియాలో లాంఛ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.Weibo పోస్ట్‌లో,కొత్త Oppo K12s 5G ఫోన్ ఏప్రిల్ 22న మధ్యాహ్నం చైనాలో విడుదల కానున్నట్లు Weibo పోస్ట్‌లో కంపెనీ స్పష్టం చేసింది. అలాగే, ఈ స్మార్ట్ ఫోన్ 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7000 mAh బ్యాటరీ సామర్థ్యంతో అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. వేరొక పోస్ట్ ద్వారా, Oppo K12s 5G ప్రిజం బ్లాక్, రోజ్ పర్పుల్, స్టార్ వైట్ కలర్ ఆప్షన్‌లలో అమ్మకానికి వస్తుందని కంపెనీ ప్రకటించింది. అంతేకాదు, అధికారిక ఈ-స్టోర్ లిస్టింగ్ బట్టీ ఈ ఫోన్ 8GB RAM తో 128GB, 256GB, 12GB RAM తో 256GB, 512GB స్టోరేజీ సామర్థ్యం కలిగిన కాన్షిగరేషన్‌లలో మార్కెట్‌లోకి రాబోతోంది.
ఈ Oppo K12s 5G వెనుక మాడ్యూల్ గుండ్రని అంచులతో కనిపిస్తోంది. అలాగే, రెండు కెమెరా సెన్సార్‌లు నిలువు పిల్- ఆకారపు స్లాట్‌లో అమర్చబడి ఉన్నాయి. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ కుడి వైపు అంచున కనిపిస్తున్నాయి. సైడ్ బెజెల్స్‌తోపాటు ఫ్లాట్ డిస్‌ప్లే, మందమైన చిన్, ముందు కెమెరా అమర్చేందుకు పైన హోల్- పంచ్ స్లాట్‌ను ఏర్పాటు చేసినట్లు అంచనా వేయవచ్చు.
డిజైన్‌తోపాటు పరిమాణం బట్టీ ఈ Oppo K12s 5G ఫోన్, Oppo K13 5G ఫోన్ రిబ్రాండెడ్ వెర్షన్ కావచ్చని మార్కెట్ వర్గాల అంచనా. అలాగే, చైనాలో K12s లాంఛ్‌కు ఒక రోజు ముందుగా మన దేశంలో Oppo K13 5G విడులద కానుంది. 6.66- అంగుళాల ఫుల్- HD+ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. అలాగే, IP65- రెటెడ్ బిల్డ్‌తో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్‌ను అందించారు.
చైనాకు చెందిన 3C, TENAA సర్టిఫికేషన్ సైట్‌లలో ఈ Oppo K12s 5G బహిర్గతం అయినట్లు సమాచారం. ఈ హ్యాండ్‌సెట్ 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియల్ కెమెరా యూనిట్, 16- మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్, ఇన్- డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిపై ColorOS స్కిన్‌తో ఆండ్రాయిడ్ 15 తో షిప్ చేయబడినట్లు నివేదిక ఆధారంగా తెలుస్తోంది. 5700 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ స్పీకర్‌లతో దీనిని రూపొందించినట్లు అంచనా.
ప్రకటన
ప్రకటన