ఇన్‌స్టాలో కొత్త అప్‌డేట్.. మల్టీ ఆడియో ట్రాక్‌ ఫీచర్‌తో ఏం చేయొచ్చంటే!

ఇన్‌స్టాలో కొత్త అప్‌డేట్.. మల్టీ ఆడియో ట్రాక్‌ ఫీచర్‌తో ఏం చేయొచ్చంటే!
ముఖ్యాంశాలు
  • ఇన్‌స్టా కొత్త అప్‌డేట్‌, మ‌ల్టీ ఆడియో ట్రాక్ ఫీచ‌ర్‌, ఇన్‌స్టా రీల్స్‌,
  • ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు 20 ఆడియో ట్రాక్‌లను జోడించడానికి మిమ్మల్ని అనుమత
  • ఇది వర్తించే సృజనాత్మక మార్గాల శ్రేణి ఉంది మరియు ఇది యాప్‌లోని అన్ని కొత
ప్రకటన
మీరు ఎక్కువ‌గా ఇన్‌స్టాగ్రామ్ వినియోగిస్తున్నారా? అయితే, మీలాంటి ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ల కోసమే ఇన్‌స్టా ఇప్పుడు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచ‌ర్‌తో ఇన్‌స్టా రీల్స్ చేసేటప్పుడు ఒక‌టి కంటే ఎక్కువ‌ సంఖ్యలో పాట‌ల‌ను యాడ్ చేసుకోవ‌చ్చు. గ‌తంలో ఇన్‌స్టా రీల్స్ చేసేట‌ప్పుడు ఒకటి కన్నా ఎక్కువ పాటలను యాడ్ చేసేందుకు అవ‌కాశం ఉండేది కాదు. దీంతో యూజ‌ర్ల ఇబ్బందుల‌ను గుర్తించిన ఇన్‌స్టా ఈ కొత్త మల్టీ ఆడియో ట్రాక్‌ ఫీచర్‌ను ప‌రిచ‌యం చేసింది. ఈ తాజా అప్‌డేట్‌తో యూజ‌ర్లు ఒకే రీల్‌కు ఏకంగా 20 ఆడియో ట్రాక్‌లను యాడ్ చేసుకోవ‌చ్చు. ఇందుకోసం యూజ‌ర్లు త‌మ యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి. ఆ తర్వాత యాప్‌లోని వీడియో ఎడిటర్‌లో ‘Add to mix' అనే ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. త‌ర్వాత కావాల్సిన‌ ఆడియో ట్రాక్స్‌ను సెలక్ట్ చేసుకుంటే స‌రిపోతుంది. అంతేకాదు, ఇలా యూజ‌ర్‌ క్రియేట్ చేసిన ట్రాక్‌లను ఇతరులు కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ కొత్త

మల్టీ ఆడియో ట్రాక్‌ ఫీచర్‌కు సంబంధించిన మరిన్ని వివ‌రాలు మీకోసం


ఇన్‌స్టాగ్రామ్ ప‌రిచ‌యం చేస్తోన్న‌ ఈ కొత్త మల్టీ ఆడియో ట్రాక్‌ ఫీచర్‌తో యూజర్లు రీల్స్‌కు మల్టీ ఆడియో ట్రాక్‌లను యాడ్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించింది. అంతేకాదు, ఎడిటింగ్ ప్రక్రియలో టెక్ట్స్ కంటేంట్‌, స్టిక్కర్స్‌, వీడియో క్లిప్‌లతో ఈ ట్రాక్‌లను వ్యూ మాదిరిగా చేసుకోవ‌చ్చు. యూజ‌ర్లు ట్రాక్‌లను సరైన క్లిప్‌లతో యాడ్ చేసేందుకు అవ‌కాశం ఉంది. దీంతో కంటెంట్‌ను మునిప‌టి కంటే మరింత ఆకర్షణీయంగా కస్టమైజ్ చేసుకోవ‌చ్చ‌న్న‌మాట‌! ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరీ ఈ విషయాన్ని తాజాగా షేర్ వెల్ల‌డించారు. త‌మ యూజ‌ర్లు త‌మ‌ కంటెంట్‌తో మరింత క్రియేటివిటీని జోడించ‌వ‌చ్చు అనే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. 

యూజ‌ర్‌ పేరు మీదే లేబుల్


తాజా ఫీచ‌ర్‌తో ఆడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఎడిట్ చేసే సమయంలో టెక్స్ట్, స్టిక్కర్లు క్లిప్‌లతో అలైన్ కూడా చేసుకోవ‌చ్చు. యూజ‌ర్లు ఇలా చేసినప్పుడు ప్ర‌త్యేకించి సొంతంగా ఆడియో మిక్స్‌ను కూడా క్రియేట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.  అయితే, ఈ కొత్త మల్టీ ట్రాక్‌ రీల్స్‌ ఫీచర్‌ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ మ‌న‌దేశంలో మాత్రం ఇంకా కొంతమందికి కనిపించడం లేదని తెలుస్తోంది. ‘‘ఇక నుంచి ఒక్క రీల్‌లో 20 వరకు ఆడియో ట్రాక్‌లను జత చేసుకోవ‌చ్చు. దీని వ‌ల్ల‌ మీ కంటెంట్‌ను మరింత సృజనాత్మకంగా మార్చుకునేందుకు అవకాశం దొరుకుతుంది. మీ ఆడియోను టెక్ట్స్‌, స్టిక్కర్‌, క్లిప్స్‌కు అనుగుణంగా ఎంపిక చేసుకోవ‌చ్చు. ఫలితంగా మీరు ఓ ప్రత్యేకమైన ఆడియో ట్రాక్‌ను త‌యారు చేసుకుంటారు. అంతేకాదు, నచ్చినవారు దాన్ని సేవ్‌ చేసుకొని వాడుకునే వీలుంది'' అని ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్‌ మొస్సేరీ చెప్పుకొచ్చారు. ఇలా క్రియేటీవ్‌గా సృష్టించిన ప్రత్యేకమైన ఆడియో ట్రాక్‌లను యూజ‌ర్‌ పేరు మీదే లేబుల్ చేయ‌డంతోపాటు వారికి క్రెడిట్ ఇవ్వ‌నున్నారు. 

వీడియో ఎడిటింగ్‌కి కొత్తవారు కూడా..


అలాగే, యాప్‌లోనే టెక్ట్స్‌, స్టిక్కర్‌లు, క్లిప్‌లతో ఆడియోను కూడా పంపించుకోవ‌చ్చు. అంతేకాదు, వీడియోలను ఎడిట్ చేయడానికి అదనపు టూల్స్‌తో ప‌నిలేదు. ఈ అప్‌డేట్ కోసం లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్‌లోడ్ త‌ర్వాత‌ యాప్‌లోని వీడియో ఎడిటర్‌ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. త‌ర్వాత‌ యాడ్‌ టు మిక్స్‌పై ట్యాప్ చేసుకొని, కావాల్సిన ట్రాక్‌లను ఎంచుకోవ‌చ్చు. అలా ఒక ఆడియోలో కావాల్సిన భాగాన్ని కూడా సెల‌క్ట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ ప్ర‌క్రియ పూర్తయిన తర్వాత ఆటోమిటిక్‌గా రీల్‌ లైవ్‌లోకి వ‌స్తుంది. వీడియో ఎడిటింగ్‌కి కొత్తవారు కూడా ఈ ఫీచర్ ద్వారా సులభంగా డిజైన్ చేసుకునే అవ‌కాశం ఉంది. ఇన్‌స్టాగ్రామ్ కొత్త మల్టీ-ఆడియో ట్రాక్‌ల ఫీచర్ రీల్స్‌ను సరదాగా, క్రియేటివిటీగా చేస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.
Comments
మరింత చదవడం:
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి
 
 

ప్రకటన

ప్రకటన

© Copyright Red Pixels Ventures Limited 2024. All rights reserved.
Trending Products »
Latest Tech News »