Infinix కంపెనీ మనదేశంలో Infinix InBook Y3 Max పేరులో ఓ సరికొత్త మోడల్ ల్యాప్‌టాప్ విడుదల చేసింది. Infinix నుండి వస్తోన్న కొత్త బడ్జెట్ ల్యాప్‌టాప్ 16-అంగుళాల డిస్‌ప్లేతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఇది Intel Core i7 ప్రాసెసర్‌లతో అందుబాటులోకి వస్తుంది. అలాగే, విండోస్ 11 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతూ.. 16GB RAM, 512GB వరకు స్టోరేజ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. Infinix InBook Y3 Max బాడీ అల్యూమినియం అల్లాయ్ బాడీతో కఠినమైన బ్రష్ మెటల్ ఫినిషింగ్‌తో ఉంటుంది. అలాగే, 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 70Wh బ్యాటరీని కలిగి ఉంది. చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోన్న ఈ కొత్త Infinix InBook Y3 Max ల్యాప్‌ట్యాప్ ధరతోపాటు.. లాంచింగ్ తేదీ, ఫీచర్స్‌ను చూసేద్దామా?!
సంప్రదాయ ల్యాప్‌టాప్‌లతో పోలిస్తే..
మనదేశంలో Infinix InBook Y3 మ్యాక్స్ ఇంటెల్ కోర్ i3 CPUతో బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 29,999గా నిర్ణయించారు. ఇది బ్లూ, గ్రే, సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆగస్టు 21 నుండి అందుబాటులోకి రానుంది. ఈ ల్యాప్‌టాప్ Windows 11లో నడుస్తుంది. అలాగే, 16-అంగుళాల పూర్తి-HD IPS డిస్‌ప్లే వస్తూ.. 16:10 యాస్పెక్ట్ రేషియో, 87 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 300నిట్స్ బ్రైట్‌నెస్, 60 శాతం NTSC వైడ్ కలర్ గామట్‌ను కలిగి ఉంటుది. మార్కెట్‌లో అందుబాటులో ఉంటోన్న 15.6-అంగుళాల సంప్రదాయ ల్యాప్‌టాప్‌లతో పోలిస్తే డిస్‌ప్లే 11 నుండి 12 శాతం ఎక్కువ డిస్‌ప్లే వీక్షణ సామర్థ్యాన్ని అందిస్తుందని కంపెనీ ప్రచారంలో చెబుతోంది. ఈ ఫీచర్స్‌ను చూస్తే.. కంపెనీ ప్రచారంలో వాస్తవం ఉన్నట్లు స్పష్టమవుతుంది.
1TB స్టోరేజీ సామర్థ్యాంతో..
కొత్త Infinix InBook Y3 Max ల్యాప్‌ట్యాప్ 12th generation ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌లతో Intel Core i3, Core i5, Core i7 ఎంపికలతో ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ గ్రాఫిక్స్‌తో రన్ అవుతుంది. CPU గరిష్టంగా 16GB వరకు LPDDR4X RAM అయితే 1TB స్టోరేజీ సామర్థ్యాన్ని కలగి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 1TB వరకు స్టోరేజీని విస్తరించుకోవడానికి ప్రత్యేకమైన సీరియల్ ATA (SATA) స్లాట్‌ను అందించారు. ఇన్‌పుట్‌ల కోసం, Y3 Max ల్యాప్‌ట్యాప్ బ్యాక్‌లిట్ కీబోర్డ్, 7.06-అంగుళాల ట్రాక్‌ప్యాడ్‌ను కలిగి ఉంటుంది. దీనికి రెండు USB 3.0 పోర్ట్‌లు, ఒక HDMI 1.4 పోర్ట్, రెండు USB టైప్-C పోర్ట్‌లు, 3.5mm ఆడియో జాక్, మైక్రో SD కార్డ్ స్లాట్‌ను అందించారు. ఈ ఫీచర్స్ ల్యాప్‌ట్యాప్‌కు అధనపు ఆకర్షణ అనే చెప్పాలి.
14.6 గంటల స్టాండ్‌బై సమయం..
ఈ ల్యాప్‌టాప్ హై-స్పీడ్ వైర్‌లెస్ కనెక్టివిటీ కోసం Wi-Fi 6కి సపోర్ట్ చేస్తుంది. ల్యాప్‌టాప్‌కు డ్యూయల్ మైక్రోఫోన్‌లతో కూడిన ఫుల్-HD (1080p) వెబ్‌క్యామ్‌ను అందించారు. ఇది థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం ఇన్ఫినిక్స్ యొక్క ఐస్ స్టార్మ్ కూలింగ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. అలాగే, USB టైప్-C పోర్ట్ ద్వారా 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 70Wh బ్యాటరీని రూపొందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే బ్యాటరీ గరిష్టంగా 14.6 గంటల స్టాండ్‌బై సమయం ఉంటుంది. అంతేకాదు, 8.5 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందించగలదని కంపెనీ ప్రకటించింది. దీని పరిమాణం విషయానికి వస్తే.. 357.3x248.8x17.9mm కొలతలతో కేవలం 1.78 కిలోగ్రాములు బరువు ఉంటుంది. తక్కువ ధరలో దేశీయ మార్కెట్‌లోకి రాబోతోన్నఈ Infinix InBook Y3 Max ల్యాప్‌ట్యాప్ ఇతర కంపెనీలకు గట్టీ పోటీ ఇవ్వబోతున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరి అది ఎంతవరకూ నిజమవుతుందో వేచి చూడాలి.