ఆగ‌స్టు 27 నుంచి Poco Pad 5G సేల్‌.. ఈ డిస్కౌంట్ ఆఫ‌ర్‌లు మీకోస‌మే

ఆగ‌స్టు 27 నుంచి Poco Pad 5G సేల్‌.. ఈ డిస్కౌంట్ ఆఫ‌ర్‌లు మీకోస‌మే
ముఖ్యాంశాలు
  • Poco Pad 5G Snapdragon 7s Gen 2 ప్రాసెస‌ర్‌ ద్వారా ప‌నిచేస్తోంది
  • కొత్తగా ప్రారంభించిన ఈ ట్యాబ్‌లో 8-మెగాపిక్సెల్ మెయిన్‌ కెమెరా ఉంది
  • Poco Pad 5G 33W ఛార్జింగ్‌తో 10,000mAh బ్యాటరీని అందిస్తున్నారు
ప్రకటన

Poco కంపెనీ దేశీయ మార్కెట్‌లోకి Poco Pad 5Gను లాంచ్ చేసింది. ఈ ట్యాబ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 ప్రాసెస‌ర్ ద్వారా ప‌ని చేస్తుంది. అలాగే, ఆండ్రాయిడ్ 14-ఆధారిత హైపర్ OSతో ర‌న్ అవుతుంద‌ని కంపెనీ తెలిపింది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతోపాటు క్వాడ్-స్పీకర్ సిస్టమ్‌తో రూపొందించ‌బ‌డింది. దీంతోపాటు 12.1-అంగుళాల LCD స్క్రీన్‌తో ఈ ట్యాబ్‌ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో వస్తుంది. Poco Pad 5G ట్యాబ్‌ 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 10,000mAh భారీ బ్యాటరీ సామ‌ర్థ్యాన్ని కలిగి ఉంది. IP52-రేటెడ్ ట్యాబ్‌ Poco స్మార్ట్ పెన్, Poco కీబోర్డ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంద‌ని Poco స్ప‌ష్టం చేసింది.

విద్యార్థుల‌కు స్పెష‌ల్ ఆఫ‌ర్‌

ఇక ధ‌ర విష‌యానికి వ‌స్తే.. మ‌న‌దేశంలో Poco Pad 5G 8GB + 128GB వేరియంట్ ప్రారంభ ధ‌ర రూ. 23,999గా కంపెనీ నిర్ణ‌యింది. అలాగే, 8GB + 256GB వేరియంట్ ధర రూ. 25,999గా ఉంది. ఈ ట్యాబ్ కోబాల్ట్ బ్లూ, పిస్తా గ్రీన్ రంగుల ఎంపిక‌లో అందుబాటు ఉంటుంది. Poco Pad 5G మొదటి సేల్ ప్ర‌ముఖ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆగస్ట్ 27న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే, SBI, HDFC, ICICI బ్యాంక్ కార్డ్ వినియోగ‌దారుల‌కు రూ. 3,000 వ‌ర‌కూ డిస్కౌంట్ ఆఫ‌ర్‌ను అందిస్తోంది. అంతేకాదు Poco కంపెనీ విద్యార్థుల కోసం ఓ స్పెష‌ల్ ఆఫ‌ర్‌ను కూడా ప్ర‌క‌టించింది. విద్యార్థులు అదనంగా రూ. 1,000 వ‌ర‌కూ డిస్కౌంట్‌ను పొందొచ్చు. అయితే, ఈ ఆఫర్‌లు సేల్ ప్రారంభమైన మొదటి రోజు మాత్ర‌మే ఉంటుంది.

మైక్రో SDతో స్టోరేజీ 1.5TB వరకు

ఈ Poco Pad 5G మోడ‌ల్‌ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 12.1-అంగుళాల 2K (2,560 x 1,600 పిక్సెల్‌లు) LCD స్క్రీన్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుందన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇది 16:10 యాస్పెక్ట్ రేషియోతోపాటు 600 నిట్స్ గరిష్ట బ్ర‌యిట్‌నెస్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే TÜV రైన్‌ల్యాండ్ ట్రిపుల్ సర్టిఫికేషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో రూపొందించ‌బ‌డింది.ఈ ట్యాబ్ 8GB LPDDR4X RAM, UFS 2.2 ఆన్‌బోర్డ్ 256GB వరకు స్టోరేజ్‌తో Snapdragon 7s Gen 2 ప్రాసెస‌ర్ జత చేయబడింది. Poco Pad 5Gలో మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 1.5TB వరకు పెంచుకునే అవ‌కాశం ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 14-ఆధారిత హైపర్‌ఓఎస్‌తో ర‌న్‌ చేయబడుతుంది.
ప్ర‌త్యేక‌మైన కెమెరా యూనిట్‌...

అలాగే, Poco Pad 5G మోడ‌ల్‌లో ప్ర‌త్యేకంగా కెమెరా విభాగం గురించి చెప్పుకోవాలి. కొత్తగా ప్రారంభించిన Poco Pad 5G 8-మెగాపిక్సెల్ వెనుక కెమెరా యూనిట్‌తో పాటు LED ఫ్లాష్ యూనిట్‌ను కలిగి ఉంటుంది. ముందు కెమెరా, కుడి వైపున అర్చ‌డంతోపాటు మరొక 8-మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. Poco Pad 5G దుమ్ము, స్ప్లాష్ నిరోధకత కోసం IP52-రేటెడ్ బిల్డ్‌తో వస్తుంది. ఇది క్వాడ్-స్పీకర్ సిస్టమ్, రెండు మైక్రోఫోన్‌లు, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ట్యాబ్‌ డాల్బీ విజన్ సపోర్ట్‌తో కూడా వస్తుండ‌డం ఇక్క‌డ ప్ర‌త్యేక‌త‌. ఈ ట్యాబ్‌లో 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 10,000mAh బ్యాటరీని అందించారు. డ్యూయల్ 5G, Wi-Fi 6, GPS, బ్లూటూత్ 5.2తో పాటు USB టైప్-C పోర్ట్ అందుబాటులో ఉంటుంది. Poco Pad 5G పరిమాణం విష‌యానికి వ‌స్తే.. 280.0 x 181.85 x 7.52mmతో 568 గ్రాముల బ‌రువు ఉంటుంది. మ‌రి.. ఆగ‌స్టు 27న సిద్ధంగా ఉండండి.

Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. స్విమ్మింగ్ మోడ్‌తో మ‌న దేశంలో అడుగుపెడుతోన్న Huawei Band 9 ధర, స్పెసిఫికేషన్స్ ఇవే
  2. Geekbenchలో ప్ర‌త్య‌క్ష‌మైన‌ iQOO Z10 టర్బో, iQOO Z10 టర్బో ప్రో హ్యాండ్‌సెట్‌లు.. కీల‌క అంశాలు బ‌హిర్గ‌తం
  3. జియోఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ సబ్‌స్క్రైబర్‌లకు గుడ్‌న్యూస్‌.. రెండేళ్ల యూట్యూబ్ ప్రీమియం యాక్సెస్
  4. Samsung Galaxy S25, Galaxy S25+, Galaxy S25 అల్ట్రా డిజైన్‌తోపాటు స్పెసిఫికేషన్‌లు లాంచ్‌కు ముందే లీక్‌
  5. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెస‌ర్‌తో భార‌త్‌లో అడుగుపెట్టిన‌ Oppo Reno 13 5G, Reno 13 Pro 5G
  6. Poco X7 5G, Poco X7 Pro 5G వ‌రుస‌గా ఫిబ్రవరి 14, 17 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకాలు.. ధ‌ర ఎంతంటే
  7. సాలెపురుగులు కాళ్ల వెంట్రుకల ద్వారా వాసనలు గుర్తిస్తాయట‌.. కొత్త అధ్యయనంలో వెల్ల‌డి..
  8. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 తేదీలు వ‌చ్చేశాయి.. ఈ స్మార్ట్ ఫోన్‌లపై డిస్కౌంట్లు
  9. భార‌త్‌తోపాటు గ్లోబ‌ల్ మార్కెట్‌లో అడుగుపెట్టిన OnePlus 13, OnePlus 13R.. ధ‌ర ఎంతంటే
  10. ఇండియాలోకి Tecno Pop 9 5G కొత్త 8GB RAM వేరియంట్‌.. ధ‌ర కేవ‌లం రూ. 9,499
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »