Photo Credit: Flipkart
ఇండియన్ మార్కెట్‌లోకి Huawei Band 9 వచ్చేందుకు సన్నద్దమైంది. ఇది జూలై 2024లో విడుదలైన Huawei Band 8కి కొనసాగింపుగా ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా అడుగుపెట్టేందుకు నిశ్శబ్దంగా సిద్ధమైంది. ఈ స్మార్ట్ వేరబుల్ ఆల్వేస్-ఆన్-డిస్‌ప్లే (AOD) ఫీచర్‌కు సపోర్ట్ చేస్తూ, 2.5D AMOLED స్క్రీన్‌తో వస్తోంది. హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్, నిద్ర, ఒత్తిడి, రక్తంలో ఆక్సిజన్ స్థాయి, హార్ట్ బీట్ ట్రాకర్‌లను కలిగి ఉంటుంది. స్ట్రోక్స్, ల్యాప్స్, పెర్ఫార్మెన్స్ వంటి అనేక మెట్రిక్‌లను ట్రాక్ చేయడంతోపాటు స్విమ్మింగ్ మోడ్‌ను కూడా కలిగి ఉంది.
మన దేశంలో Huawei Band 9 ధర రూ. 3,999 నుండి ప్రారంభమవుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే, దీనిని ప్రత్యేక ధరగా లిస్టవుట్ చేసింది. దీని MRP రూ. 5,999గా చెబుతున్నారు. ఈ స్మార్ట్ బ్యాండ్ జనవరి 17 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో నలుపు, గులాబీ, తెలుపు, పసుపు నాలుగు రంగులలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అయితే, ఆప్ లైన్ అమ్మాకాలపై ఎలాంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు.
Huawei Band 9 వాచ్ 1.47-అంగుళాల దీర్ఘచతురస్రాకార టచ్-సపోర్ట్ AMOLED స్క్రీన్‌తో 194 x 368 పిక్సెల్‌లు, 282 ppi పిక్సెల్ డెన్సిటీ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. అలాగే, ఇది ఆండ్రాయిడ్, iOS డివైజ్‌లకు అనుకూలంగా ఉండడంతోపాటు బ్లూటూత్ 5.0ని వినియోగిస్తుంది. ఈ స్మార్ట్ బ్యాండ్ కేసు కుడి అంచున ఆర్ట్‌ఫిషియల్ బటన్‌ను కలిగి ఉంటుంది. దాని బెల్ట్ ఫ్లోరోఎలాస్టోమర్‌తో తయారు చేయబడింది. ఇది 50 మీటర్ల వరకు నీటి నియంత్రణను కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ బ్యాండ్ యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్ వంటి సెన్సార్లతో వస్తుంది. ఇది వినియోగదారుల హృదయ స్పందన రేటు, SpO2, శ్వాసకోశ రేటు, అసాధారణ శ్వాసను తనిఖీ చేయడానికి అనుకూలంగా పని చేస్తుంది. అలాగే, స్లీప్ సైకిల్ పర్యవేక్షించడానికి Huawei ప్రాపర్‌టీ TrueSleep టెక్నాలజీని ఉపయోగిస్తుంది. అదే సమయంలో, పల్స్ వేవ్ అరిథ్మియా విశ్లేషణ హార్ట్ బీట్‌లో ఎలాంటి మార్పులు వచ్చినా గుర్తించినా వెంటనే సమాచారాన్ని అందిస్తుంది. అలాగే, కొత్త మల్టీ-ఛానల్ మాడ్యూల్, స్మార్ట్ ఫ్యూజన్ అల్గోరిథం సహాయంతో మెరుగైన హార్ట్ బీట్ ట్రాకింగ్‌ను అందించగలదని Huawei స్పష్టం చేసింది.
Huawei Band 9 స్మార్ట్ వాచ్ 100కి పైగా వర్కౌట్ మోడ్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఇందులో స్విమ్మింగ్ మోడ్ కూడా ఉంది. ఇది ల్యాప్స్, పెర్ఫార్మెన్స్, స్ట్రోక్స్ వంటి మెట్రిక్‌లను ట్రాక్ చేయగలదు. కంపెనీ వెల్లడించిన దాని ప్రకారం.. ఇది ఒకే ఛార్జ్‌పై 14 రోజుల వరకు నడుస్తుంది. అలాగే, AODని స్టార్ట్ చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ మూడు రోజుల వరకూ తగ్గిపోతుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ వాచ్‌ను కేవలం 45 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది.
ప్రకటన
ప్రకటన