గతనెలలో గ్లోబల్ మార్కెట్‌లో Infinix కంపెనీ XPadని విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మోడల్‌ను దేశీయ మార్కెట్‌లో సెప్టెంబర్ 13వ తేదీన లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ కంపెనీ నుంచి భారతదేశంలో విడుదలవుతోన్న మొట్టమొదటి ట్యాబ్ ఇది. దేశీయ మార్కెట్‌లో ఫ్రాస్ట్ బ్లూ, టైటాన్ గోల్డ్, స్టెల్లార్ గ్రే రంగులలో అందుబాటులోకి రానుంది. ఈ ట్యాబ్ మెటల్ యూనిబాడీ డిజైన్‌ను కలిగి ఉంటుందని Infinix స్పష్టం చేసింది. అలాగే ఇందులో 11 అంగుళాల (1920 x 1200 పిక్సెల్‌లు) ఫుల్ HD+ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్, 83 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, క్వాడ్ స్పీకర్లు, 4G LTE సపోర్ట్‌తో రూపొందించారు. ChatGPT ఆధారితమైన వాయిస్ అసిస్టెంట్‌ని కంపెనీ పెద్ద స్థాయిలో ప్రచారం చేస్తోంది.
Infinix XPad ట్యాబ్‌ను అధికారికంగా ప్రారంభించినప్పుడు మరిన్ని వివరాలను వెల్లడిస్తామని కంపెనీ చెబుతోంది. అయితే, Xpad MediaTek Helio G99 ప్రాసెసర్, 8MP ఫ్రంట్, రియర్ కెమెరాలతో 18W వైర్డ్ ఛార్జింగ్‌తో 7,000 mAh బ్యాటరీతో వస్తుందని ఇప్పటికే మార్కెట్ వర్గాలకు తెలుసు. ట్యాబ్ లాంచ్ అయినప్పుడు మాత్రమే దీని ఖచ్చితమైన ధర తెలిసేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో విడుదల కావడంతో ఈ ట్యాబ్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ బహిర్గతం అయ్యాయి. ఇండియాలో లాంచ్ అవుతున్న సందర్భంగా దీనికి సంబంధించిన ఫీచర్స్‌ను చూద్దాం.
Infinix XPad ట్యాబ్‌కు 11 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేను అమర్చారు. అలాగే, 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది 2.2 జీహెచ్‌జెడ్ ఆక్టా కోర్ సీపీయూతో కూడిన Helio G99 ప్రాసెసర్‌తో సమర్థవంతంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. ఇప్పటికే విడుదల అయిన ట్యాబ్‌లను బట్టీ ఇది రెండు వేరియంట్స్‌లో రాబోతోందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అందులో మొదటి వేరియంట్ 4 GB RAM, 128 GB స్టోరేజీ సామర్థ్యంతో, రెండోది 8 GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కెమెరా విషయానివస్తే.. ట్యాబ్‌లో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాతోపాటు వీడియో కాల్స్ మరియు సెల్ఫీల కోసం 9 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరాను అందించవచ్చు.
గ్లోబల్ మార్కెట్‌లో లాంచయిన దానిని బట్టీ.. సొంత ఫోలాక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను Infinix XPad ట్యాబ్ కలిగి ఉంది. అలాగే, ట్యాబ్ చాట్‌జీపీటీ ఆధారిత వాయిస్ అసిస్టెంట్‌కు సపోర్ట్ చేయడం హైలేట్‌గా కంపెనీ చెబుతోంది. ట్యాబ్ బ్యాటరీ 7000 ఎమ్‌ఏహెచ్ సామర్థ్యంతో అందుబాటులోకి రానుంది. అలాగే, 18 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తూ.. 40 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జింగ్ అవుతుంది. అలాగే, దేశీయ మార్కెట్‌లో ధరను కూడా అంచనా వేయలేమని అంటున్నాయి. దీని లాంచ్ సెప్టెంబర్ 13 కావడంతో ధరపై మరింత ఆసక్తి నెలకొంది.
ప్రకటన
ప్రకటన