ప్రస్తుతం ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌లో రూ.199 ప్లాన్ కొత్త కనిష్ట రీచార్జ్ ఆప్షన్‌గా చూపిస్తోంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు అందులో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు, అలాగే 2GB డేటా లభిస్తుంది. డేటా లిమిట్ పూర్తయిన తర్వాత, వినియోగదారులు 50 పైసలు/MB రేటుతో చార్జ్ చేయబడతారు.
Photo Credit: Reuters
రూ. 199 కొత్త బేస్ ప్లాన్ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది.
భారతి ఎయిర్‌టెల్ తాజాగా తన రూ. 189 వాయిస్-ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్‌ను సైలెంట్ గా నిలిపివేసింది. దీంతో కంపెనీ కనిష్ట రీచార్జ్ ధరను రూ.199కు పెంచింది. ఈ నిర్ణయం ఎయిర్‌టెల్ డేటా ఆధారిత ప్లాన్‌ల వైపు దృష్టిని మళ్లిస్తున్నదనే సంకేతంగా భావిస్తున్నారు. భారత్ టెలికాం రంగంలో ప్రస్తుతం డేటా ఆధారిత సేవలకు డిమాండ్ పెరుగుతుండటంతో, కంపెనీలు వాయిస్-మాత్రమే ఉన్న ప్లాన్‌లను క్రమంగా తగ్గిస్తున్నాయి. ఈ రూ.189 ప్లాన్ ప్రధానంగా వాయిస్ కాల్స్‌కే ఉపయోగించే వినియోగదారులలో, ముఖ్యంగా వృద్ధులు మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కస్టమర్లలో, చాలా ప్రాచుర్యం పొందింది. వీరికి ఎక్కువగా డేటా అవసరం లేకపోవడంతో ఈ తక్కువ ధర ప్లాన్ వారికి సరైన ఎంపికగా ఉండేది. అయితే ఇప్పుడు ఈ ప్లాన్ రద్దుతో, కేవలం కాలింగ్ సేవలు అవసరమైన వినియోగదారులు కూడా అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది.
ప్రస్తుతం ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌లో రూ.199 ప్లాన్ కొత్త కనిష్ట రీచార్జ్ ఆప్షన్‌గా చూపిస్తోంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు అందులో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు, అలాగే 2GB డేటా లభిస్తుంది. డేటా లిమిట్ పూర్తయిన తర్వాత, వినియోగదారులు 50 పైసలు/MB రేటుతో చార్జ్ చేయబడతారు. అదనంగా, ఈ ప్లాన్‌లో ఉచిత హెల్లో ట్యూన్ సేవ మరియు 12 నెలల పాటు Perplexity Pro AI టూల్ సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తోంది. అయితే, కేవలం కాలింగ్ అవసరాల కోసం ఫోన్ ఉపయోగించే వినియోగదారులకు ఈ అదనపు ఫీచర్లు అంతగా ఉపయోగపడవు.
కంపెనీ ఈ మార్పు గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ Digit రిపోర్ట్ ప్రకారం, ఇది టెలికాం రంగంలో జరుగుతున్న పెద్ద మార్పులో భాగమని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు ఎక్కువ మంది స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగిస్తూ ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడపడంతో, ఆపరేటర్లు తమ ప్లాన్‌లను వినియోగదారుల కొత్త అలవాట్లకు సరిపడేలా మార్చుకుంటున్నారు. అయితే, ఈ మార్పు గ్రామీణ ప్రాంతాలు మరియు తక్కువ ఆదాయ వర్గాల వినియోగదారులకు భారంగా మారింది, ఎందుకంటే వారికి ఇప్పుడు తక్కువ ఖర్చుతో ఉండే వాయిస్ కాల్ ప్లాన్‌లు దొరకడం కష్టమవుతోంది.
సులభంగా చెప్పాలంటే ఎయిర్‌టెల్ కొత్త మార్పు డేటా ఆధారిత యుగానికి అడుగుపెట్టడమే అయినా, సాధారణ వినియోగదారులకు ఇది ఖర్చు పెరుగుదలతో కూడిన నిర్ణయంగా కనిపిస్తోంది. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎయిర్‌టెల్ తమ వినియోగదారులను కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇలా మొబైల్ నెట్వర్క్ ఉన్నట్టు ఉండి రీఛార్జ్ ప్లాన్లు చేంజ్ చేయడం కూడా మంచి పరిణామం కాదు. TRAI దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రకటన
ప్రకటన
Oppo Pad 5 Will Launch in India Alongside Oppo Reno 15 Series; Flipkart Availability Confirmed