సమస్య ఎక్కువగా ఉన్న ఏరియాల్లో గమనిస్తే... సుమారు 50 శాతం వినియోగదారులు సిగ్నల్ పూర్తిగా లేకపోవడంపై, మరో 32 శాతం వినియోగదారులు మొబైల్ ఇంటర్నెట్ పనిచేయకపోవడంపై ఫిర్యాదు చేశారు. అదనంగా, 18 శాతం వినియోగదారులు టోటల్ బ్లాక్ అవుట్ పరిస్థితిని ఎదుర్కొన్నారు
Photo Credit: Reuters
ఎయిర్‌టెల్ తాజా అంతరాయం కొన్ని గంటల్లోనే పరిష్కరించబడింది
దేశంలోని ప్రముఖ టెలకాం సంస్థ ఎయిర్‌టెల్ మరోసారి తన వినియోగదారులను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్ సహా అనేక మహానగరాల్లో ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ పూర్తిగా డౌన్ అయింది. కాల్స్ చేయడం, మెసేజ్‌లు పంపడం, ఇంటర్నెట్ వినియోగించడం వంటి సేవల్లో సమస్యలు తలెత్తడంతో వినియోగదారుల ఫిర్యాదులు ఒక్కసారిగా పెరిగాయి. డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్‌లో కేవలం రెండు గంటల్లోనే 6,800 కంటే ఎక్కువ మంది ఈ సమస్యపై కంప్లైంట్లు నమోదు చేశారు.సమస్య ఎక్కువగా ఉన్న ఏరియాల్లో గమనిస్తే... సుమారు 50 శాతం వినియోగదారులు సిగ్నల్ పూర్తిగా లేకపోవడంపై, మరో 32 శాతం వినియోగదారులు మొబైల్ ఇంటర్నెట్ పనిచేయకపోవడంపై ఫిర్యాదు చేశారు. అదనంగా, 18 శాతం వినియోగదారులు టోటల్ బ్లాక్ అవుట్ పరిస్థితిని ఎదుర్కొన్నారు.
సోషల్ మీడియాలో అనేక మంది వినియోగదారులు తమ ఇబ్బందులను పంచుకున్నారు. ముఖ్యంగా బెంగళూరులో సేవలు పూర్తిగా నిలిచిపోయాయని అనేక పోస్టులు వెలువడ్డాయి. సమస్య ఒక్క నగరానికి పరిమితం కాలేదు. చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్ వంటి ఇతర మహానగరాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.అయితే ఈ సమస్య తమ ఒక్కరి మొబైల్ లోనే ఉందా, లేదా ఇతర మొబైల్ లో కూడా వచ్చిందా అని తెలుసుకోలేక చాలామంది కస్టమర్లు ఇబ్బంది పడ్డారు. అయితే సోషల్ మీడియాలో ఎయిర్‌టెల్ సిగ్నల్ డ్రాప్ అయింది అని ట్రెండ్ అవ్వడంతో సమస్య గురించి అవగాహన వచ్చింది. అయితే ఎయిర్‌టెల్ పలువురు కస్టమర్లకు మొబైలకు సైతం ఈ సిగ్నల్ డ్రాప్ అవుట్ గురించి మెసేజ్ పంపించింది.
ఎక్స్‌లో కస్టమర్ల ప్రశ్నలకు సమాధానమిస్తూ ఎయిర్‌టెల్ ఈ సమస్యను తాత్కాలిక కనెక్టివిటీ అంతరాయంగా పేర్కొంది. ఒక గంటలో సమస్య పరిష్కారమవుతుంది, దయచేసి మీ ఫోన్లను రీస్టార్ట్ చేయండి అని వినియోగదారులకు సూచించింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కంప్లైంట్లు గణనీయంగా తగ్గినట్లు డౌన్‌డిటెక్టర్ వెబ్‌సైట్ గణాంకాలు చూపించాయి.
ఇది గత వారం జరిగిన అవుటేజ్ తరువాత మరోసారి ఈ సమస్య తలెత్తింది. ఆగస్టు 18న కూడా దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు కాల్స్ చేయలేకపోయారు, మెసేజ్‌లు పంపలేకపోయారు. అప్పట్లో కూడాసోషల్ మీడియాలో అనేక వినియోగదారులు OTPలు రాకపోవడం వల్ల యాప్స్, వెబ్ సర్వీసుల్లో లాగిన్ కాలేకపోయామని ఫిర్యాదు చేశారు. దేశంలో రెండో అతిపెద్ద టెలికాం సంస్థగా ఉన్న ఎయిర్‌టెల్ సేవలు వరుసగా రెండోసారి నిలిచిపోవడం వినియోగదారుల్లో ఆందోళన రేపుతోంది.
భవిష్యత్తులో ఇలాగే ఇబ్బందులు తలచితే చాలామంది కస్టమర్లు ఎయిర్‌టెల్‌ను విడిచి ఇతర నెట్వర్క్ లకు పోర్ట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికైనా ఎయిర్‌టెల్ ఈ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించి రానున్న రోజుల్లో మళ్ళీ తలెత్తకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఇలాంటి బ్లాక్ అవుట్ వస్తే ఎలా అంటూ పలువురు కస్టమర్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే మరి కొందరు టెక్నికల్గా ఇటువంటి సమస్యలు సాధారణమంటూ ఎయిర్‌టెల్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.
ఏది ఏమైనా ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లోనూ సెల్ ఫోన్ కామన్ అయిపోయింది. పేమెంట్లకైనా, ఇతడు ఎటువంటి పనులుకైనా సెల్ఫోన్ కీలకంగా మారింది. అటువంటి సందర్భంలో నెట్వర్క్ ఇబ్బంది తలెత్తితే, సమస్య చిన్నదైనా కూడా అది పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. దేశంలో ఉన్న టాప్ నెట్వర్క్ల మధ్య వినియోగదారుల కోసం పోటీ నెలకొన్న సందర్భాల్లో, ఇటువంటి సమస్యలు తలెత్తితే ఎయిర్‌టెల్ లాంటి పెద్ద నెట్వర్క్ లకు నష్టమనే చెప్పాలి. ఈ లోపాన్ని ఇతర నెట్వర్క్ లో క్యాష్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
ces_story_below_text
ప్రకటన
ప్రకటన
Rockstar Games Said to Have Granted a Terminally Ill Fan's Wish to Play GTA 6
Oppo K15 Turbo Series Tipped to Feature Built-in Cooling Fans; Oppo K15 Pro Model Said to Get MediaTek Chipset