క్రియేటర్స్ కోసం AI యానిమేషన్‌తోపాటు మరిన్ని ఫీచర్లతో ఎడిట్స్ యాప్‌ను పరిచయం చేసిన ఇన్‌స్టాగ్రామ్
ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అందిస్తోన్న ఫీచర్స్‌తోపాటుగా క్రియేటర్స్‌కు దానికంటే ఎక్కువ సృజనాత్మకతను జోడించి, వీడియోలను ఎడిట్ చేసుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్ ఓ సరికొత్త యాప్‌ను పరిచయం చేసింది. ఎడిట్స్ అని పిలువబడే ఇది మొబైల్ వీడియో ఎడిటింగ్ సొల్యూషన్‌గా పని చేస్తుంది. ఇందులో హై క్వాలటీ గల వీడియో క్యాప్చర్, డ్రాఫ్ట్‌లు, వీడియోల కోసం ప్రత్యేక ట్యాబ్, రిజల్యూషన్, ఫ్రేమ్ రేట్, డైనమిక్ రేంజ్ కోసం కెమెరా సెట్టింగ్‌లు వంటి క్రియేటీవ్ టూల్ సూట్ ఉంటుంది. ఎడిట్స్ వినియోగదారులు కూడా ఆర్ట్‌ఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఇది యానిమేషన్‌లను అందించేందుకు సహాయపడుతుంది.