Photo Credit: Apple
ఆపిల్ సంస్థ యొక్క ఇట్స్ గ్లోటైమ్ ఈవెంట్‌లో Apple AirPods 4ని లాంచ్ చేసింది. మెరుగైన ఆడియో బేస్ అనుభూతిని పొందేందుకు ఈ ఎయిర్‌పాడ్‌లలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్‌ను అందించింది. అంతేకాదు, మెషిన్ లెర్నింగ్, కదలికల నియంత్రణను ప్రభావితం చేసే ఫీచర్‌లకు కూడా ఇవి సపోర్ట్ చేస్తాయి. Apple AirPods 4 సిరి ఫీచర్‌తోపాటు టైప్ సీ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయని కంపెనీ తెలిపింది. అలాగే, వీటి కేస్‌లకు కూడా స్పీకర్‌లను అమర్చారు. అంతేకాదు, Apple వాచ్ ఛార్జర్‌లతో పాటు ఇతర వైర్‌లెస్ ఛార్జర్లను వీటికి వినియోగించుకోవచ్చు. దీని సూపర్ పవర్ బ్యాటరీతో 30 గంటల వరకూ ఈ ఎయిర్‌ప్యాడ్స్ బ్యాకప్‌ను అందిస్తాయని కంపెనీ వెల్లడించింది.
ఆకట్టుకునే డిజైన్‌లో వచ్చిన AirPods 4.. ANCతోను మరియు ANC లేకుండా రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి. AirPods 4 ధర (ANC లేకుండా) దేశీయ మార్కెట్‌లో రూ. 12,900కాగా, యాక్టివ్ నాయిస్ రద్దుతో కూడిన AirPods 4 ధర రూ. 17,900గా నిర్ణయించారు. అలాగే, Apple యొక్క ఈ సరికొత్త ఆడియో ప్రొడక్ట్ ఇప్పటికే ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంచారు. వీటి విక్రయాలు సెప్టెంబర్ 20 నుండి ప్రారంభం కానున్నాయని కంపెనీ ప్రకటించింది.
AirPods 4 ఇప్పుడు సౌకర్యవంతమైన ఆకృతితోపాటు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)తో వస్తుంది. గతంలో వచ్చిన AirPods ప్రో (సెకెండ్ జనరేషన్), AirPods Maxకి కూడా ఈ ఫీచర్స్ అందించబడ్డాయి. ఈ సరికొత్త ఎయిర్‌ప్యాడ్స్ Apple H2 చిప్ ద్వారా శక్తిని పొందుతాయి. అంతేకాదు, సౌండ్ క్వాలిటీని మెరుగుపరిచేందుకు న్యూ అకౌస్టిక్ ఆర్కిటెక్చర్‌ను కలిగి ఉంటాయి. AirPods ప్రో (సెకెండ్ జనరేషన్)ని కొత్త ఫీచర్స్‌తో అప్‌డేట్ చేసింది. దీని ద్వారా హియరింగ్ ఎయిడ్ ఫీచర్‌ను పొందడంతోపాటు ఇయర్‌బడ్‌లనుంచి వచ్చే మ్యూజిక్‌ను మరింత స్పష్టంగా మారుస్తాయి. అలాగే, చుట్టూ ఉన్న పరిసరాల్లోని శబ్దాలను స్పష్టంగా వినే వినికినిడి సామర్థ్యాన్ని కూడా ఎంతగానో మెరుగుపరుస్తుంది.
Apple యొక్క ఈ తాజా TWS ఇయర్‌ఫోన్‌లు కూడా మెషిన్ లెర్నింగ్‌తో వస్తున్నాయి. కాల్ చేసేందుకు శరీర కదలికల ద్వారా చేసే సంజ్ఞలను ఆధారంగా చేసుకునే ఫీచర్‌ను అందించారు. అంతే.. తలను అవును లేదా కాదు అని కదిలించడం ద్వారా కాల్ యాక్టివిటీని నియంత్రించవచ్చు. వినియోగదారులకు ఫ్లాగ్‌షిప్ ఎయిర్‌పాడ్స్ ప్రో (సెకెండ్ జనరేషన్) మాదిరిగానే వాయిస్ ఐసోలేషన్, ఫోర్స్ సెన్సార్‌లను కూడా కల్పించారు. కంపెనీ కొత్త USB టైప్-C ఛార్జింగ్ కేసును ప్రవేశపెట్టింది. ఇది మొత్తం 30 గంటల ప్లేటైమ్‌ను అందించడంతోపాటు అదనంగా AirPods 4 వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. AirPods 4తో పాటు, Apple AirPods Max కోసం కొత్త రంగులను కూడా ప్రవేశపెట్టింది. ప్రస్తుతం బ్లూ, మిడ్‌నైట్, స్టార్‌లైట్ కలర్‌వేస్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన