అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025లో ఎస్‌బీఐ కార్డ్ హోల్డర్లకు ప్రత్యేక ఆఫర్లు కూడా ఉంటాయి. ప్రైమ్ సభ్యులకు సేల్ సెప్టెంబర్ 22 నుంచే ప్రారంభం అవుతుంది. మిగతా కస్టమర్లకు మాత్రం సెప్టెంబర్ 23 నుంచి అందుబాటులో ఉంటుంది.
Photo Credit: Amazon
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 ఈ నెల సెప్టెంబర్ 23న ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, పీసీలు, హోమ్ అప్లయన్సెస్, ఫ్యాషన్ ఉత్పత్తులు తదితర వందలాది వస్తువులు భారీ తగ్గింపులతో అందుబాటులో ఉండనున్నాయి. ముఖ్యంగా మొబైల్ యాక్సెసరీలపై 80 శాతం వరకు డిస్కౌంట్‌లు లభించనున్నాయి. సేల్ ప్రారంభానికి ముందు నుంచే అమెజాన్ కొన్ని ఎర్లీ డీల్స్‌ను ప్రారంభించింది. ప్రత్యేకంగా ట్రూలీ వైర్‌లెస్ స్టీరియో (TWS) హెడ్‌సెట్స్‌ను తక్కువ ధరలకు కొనుగోలు చేసే అవకాశం అందిస్తోంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025లో ఎస్‌బీఐ కార్డ్ హోల్డర్లకు ప్రత్యేక ఆఫర్లు కూడా ఉంటాయి. ప్రైమ్ సభ్యులకు సేల్ సెప్టెంబర్ 22 నుంచే ప్రారంభం అవుతుంది. మిగతా కస్టమర్లకు మాత్రం సెప్టెంబర్ 23 నుంచి అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే బోట్, నాయిస్, సోనీ వంటి ప్రముఖ కంపెనీల తాజా మరియు ఫ్లాగ్‌షిప్ మోడల్స్‌పై తగ్గింపులు లైవ్‌లో ఉన్నాయి. ఉదాహరణకు, బోట్ తన నిర్వాణ లాన్ హెడ్‌ఫోన్లను రూ. 1,649కే అందిస్తోంది. దీని అసలు ధర రూ. 7,999. సోనీ WF-C710NSA మోడల్‌ను రూ. 6,999కే కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ. 12,999. అలాగే JBL Live 770nc, Truke Mega 9, Noise Buds N1 వంటి మోడల్స్ కూడా తగ్గింపు ధరలతో అందుబాటులో ఉన్నాయి.
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ లేదా EMI లావాదేవీలపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఎంచుకున్న ఉత్పత్తులపై నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఐసిఐసిఐ అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ ఆఫర్లు, కూపన్ డిస్కౌంట్లు కూడా వినియోగదారులకు అందించబడతాయి.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో వైర్‌లెస్ హెడ్‌సెట్స్‌పై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. బోట్ నిర్వాణ లాన్ హెడ్‌ఫోన్లు రూ. 7,999 నుంచి నేరుగా రూ. 1,649కు లభిస్తున్నాయి. పీట్రాన్ బాస్‌బడ్స్ ఆస్ట్రా అసలు ధర రూ. 2,899 కాగా, ఇప్పుడు కేవలం రూ. 599కే అందుబాటులో ఉన్నాయి. సోనీ WF-C710NSA మోడల్ రూ. 12,999 నుంచి తగ్గించి రూ. 6,999కే అమ్మకంలో ఉంది. మివి సూపర్‌పాడ్స్ ఇమర్షియో అసలు ధర రూ. 6,499 అయినా, ఇప్పుడు రూ. 1,799కు కొనుగోలు చేయవచ్చు. జేబీఎల్ లైవ్ 770nc హెడ్‌సెట్స్ రూ. 14,999 నుండి రూ. 7,999కు లభిస్తున్నాయి. ట్రూక్ మెగా 9 రూ. 3,999 నుండి రూ. 999కు తగ్గించబడింది. అలాగే నాయిస్ బడ్స్ N1 అసలు ధర రూ. 3,499 ఉండగా, ఇప్పుడు కేవలం రూ. 799కే అందుబాటులో ఉన్నాయి. మంచి మంచి
హెడ్‌సెట్స్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి అమెజాన్ సేల్ మంచి ఆఫర్స్ ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన