డీజిల్ అల్ట్రా హ్యూమన్ రింగ్.. అవాక్కయ్యే ధర.. ఫీచర్స్ ఇవే

డీజిల్ అల్ట్రా హ్యూమన్ రింగ్ మహిళల రుతుస్రావ సమయాన్ని కూడా ట్రాక్ చేస్తుంది. కెఫిన్ సేవించాలా? వద్దా?అన్న విషయాన్ని కూడా ట్రాక్ చేస్తుందని తెలుస్తోంది

డీజిల్ అల్ట్రా హ్యూమన్ రింగ్.. అవాక్కయ్యే ధర.. ఫీచర్స్ ఇవే

Photo Credit: Ultrahuman

டீசல் அல்ட்ராஹ்யூமன் ரிங் இந்தியாவில் வெளியீடு, நீண்ட பேட்டரி, ஆரோக்கிய அம்சங்கள் கிடைக்கும்

ముఖ్యాంశాలు
  • ఫ్యాషన్ బ్రాండ్ డీజిల్ నుంచి కొత్త ప్రొడక్ట్
  • డీజిల్ నుంచి అల్ట్రా హ్యూమన్ రింగ్
  • రింగ్తో కలిగి లాభాలివే
ప్రకటన

ఫ్యాషన్ బ్రాండ్ అయిన డీజిల్తో కలిసి అల్ట్రా హ్యూమన్ నుంచి స్మార్ట్ రింగ్ను మార్కెట్లోకి తీసుకు వచ్చింది. ఈ అల్ట్రా హ్యూమన్ రింగ్ స్మార్ట్ వాచ్ తరహాలో అన్నింటినీ మానిటర్ చేస్తుంది. మన నడక, స్లీప్ టైం, హార్ట్ బీట్ ఇలా అన్నింటినీ మెజర్ చేస్తుంది. ఇక ఇది చేతికి తొడుక్కునే రింగు మాదిరిగానే ఉంటుంది. ఈ రింగు మీద డీజిల్, అల్ట్రా హ్యూమన్ బ్రాండ్ నేమ్స్ కనిపిస్తుంటాయి. దీని ధర, ఇతర ఫీచర్స్ గురించి తెలిస్తే మాత్రం కళ్లు బైర్లు కమ్మాల్సింది.. అమ్మో అంటూ నోరెళ్లబెట్టాల్సిందే. ఈ రింగ్ రెండు రంగుల్లో లభ్యం కానుంది. ఈ కొత్త స్మార్ట్ రింగ్ డీజిల్ ఇండియా ఆన్లైన్ స్టోర్, అల్ట్రాహ్యూమన్ వెబ్సైట్, ఇ-కామర్స్ ప్లాట్ఫామ్, ఆఫ్లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా అమ్మకానికి వస్తుంది. స్మార్ట్ రింగ్ ధరించేవారికి అల్ట్రాహ్యూమన్ నుండి ఇతర ధరించగలిగే వస్తువులలో అందుబాటులో ఉన్న వివిధ ఆరోగ్య ట్రాకింగ్ ఫీచర్స్ను అందిస్తుంది.

భారతదేశంలో డీజిల్ అల్ట్రాహ్యూమన్ రింగ్ ధర, లభ్యత

భారతదేశంలో డీజిల్ అల్ట్రాహ్యూమన్ రింగ్ ధర రూ. 43,889గా ఉంటుంది. UK, EU, జపాన్, ఆస్ట్రేలియా, UAEలలో, కొత్త స్మార్ట్ రింగ్ ధర వరుసగా GBP 469 (సుమారు రూ. 56,000), EUR 559 (సుమారు రూ. 59,000), JPY 84,800 (సుమారు రూ. 49,000), AUD 879 (సుమారు రూ. 53,000), AED 1,929 (సుమారు రూ. 47,000)గా ఉంది.

కొత్త స్మార్ట్ రింగ్ భారతదేశంలో ఎంపిక చేసిన ఆఫ్లైన్ డీజిల్ రిటైల్ షాప్స్, డీజిల్ వెబ్సైట్, అల్ట్రాహ్యూమన్ వెబ్సైట్, అమెజాన్, ఇతర రిటైల్ షాపుల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. డీజిల్ అల్ట్రాహ్యూమన్ రింగ్ షైనీ సిల్వర్, డిస్ట్రెస్డ్ బ్లాక్ రంగులలో అందించబడుతుంది.

డీజిల్ అల్ట్రాహ్యూమన్ రింగ్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

డీజిల్ అల్ట్రాహ్యూమన్ రింగ్ అనేది డీజిల్ డిజైన్తో పాటు అనేక హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లను కలిగి ఉన్న స్మార్ట్ రింగ్గా అందరినీ ఆకట్టుకోనుంది. దీనికి స్లీప్ క్వాలిటీ ట్రాకింగ్, హార్ట్ బీట్ పర్యవేక్షణ, నడకను లెక్కించడానికి పెడోమీటర్, కేలరీల ట్రాకింగ్ వంటివి ఉన్నాయి. ఇంకా డీజిల్ అల్ట్రాహ్యూమన్ రింగ్ రికవరీ రేటు, ఒత్తిడి స్థాయిలను రియల్ టైంలో ట్రాక్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం ఇది బ్లూటూత్ లో ఎనర్జీ 5 కి సపోర్ట్ ఇస్తుంది. ఇది iOS 15 లేదా ఆ తర్వాతి వెర్షన్లను అమలు చేసే ఐఫోన్ మోడల్లు, ఆండ్రాయిడ్ 6 లేదా కొత్త వెర్షన్లను అమలు చేసే ఆండ్రాయిడ్ ఫోన్లకు అనుకూలంగా పని చేస్తుంది.

"కట్-ఆఫ్ టైం" లేదా వినియోగదారు ఎప్పుడు కెఫిన్ తీసుకోవడం ఆపాలి? అని సూచించడానికి స్మార్ట్ రింగ్ ధరించిన వారి బ్లడ్ కెఫిన్ స్థాయిలను కూడా పర్యవేక్షిస్తుందని కంపెనీ చెబుతోంది. అంతే కాకుండా మహిళా వినియోగదారుల రుతుస్రావ సమయాన్ని కూడా ట్రాక్ చేయగలదు. ఆన్బోర్డ్ సెన్సార్ల జాబితాలో ఇన్ఫ్రారెడ్ ఫోటోప్లెథిస్మోగ్రఫీ (PPG) సెన్సార్, నాన్-కాంటాక్ట్ మెడికల్-గ్రేడ్ స్కిన్ టెంపరేచర్ సెన్సార్, సిక్స్-యాక్సిస్ మోషన్ సెన్సార్లు, హార్ట్ రేట్ మానిటరింగ్, ఆక్సిజన్ సంతృప్తత కోసం రెడ్ LEDలు, హార్ట్ రేట్ మానిటరింగ్ కోసం గ్రీన్, ఇన్ఫ్రారెడ్ LEDలు ఉన్నాయి.

పత్రికా ప్రకటన ప్రకారం అల్ట్రాహ్యూమన్ తన కొత్త స్మార్ట్ రింగ్ నాలుగు నుండి ఆరు రోజుల బ్యాటరీ జీవితాన్ని అందిస్తుందని పేర్కొంది. ఇది 24mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది 180 నిమిషాల్లో 0 నుండి 100 శాతం వరకు ఛార్జ్ కాగలదు. డీజిల్ అల్ట్రాహ్యూమన్ రింగ్ ధరించిన వారిని సబ్స్క్రిప్షన్ ప్లాన్ను కొనుగోలు చేయమని అడగకుండానే డేటా గోప్యతా రక్షణతో పాటు ఆటోమేటిక్ డేటా సింకింగ్ను కూడా అందిస్తుంది. కంపెనీ రింగ్తో బేస్ ఛార్జర్ను కూడా కలిగి ఉంది, దీనిని USB టైప్-C కేబుల్ ద్వారా పవర్ సోర్స్కు కనెక్ట్ చేయవచ్చు. స్మార్ట్ రింగ్ 8.2mm వెడల్పు, 4.2mm వరకు మందం కలిగి ఉంటుంది. అయితే 4.1g వరకు బరువు ఉంటుంది

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ఒప్పో రెనో 15సి ఫీచర్స్ ఇవే.. ఎన్నో ప్రత్యేకతలతో రానున్న న్యూ మోడల్
  2. శక్తివంతమైన Snapdragon చిప్తో, పెరిస్కోప్ కెమెరాతో రాబోతున్న Realme 16 Pro+ 5G...!
  3. ఒప్పో రెనో 15సి ఫీచర్స్ ఇవే.. ఎన్నో ప్రత్యేకతలతో రానున్న న్యూ మోడల్
  4. డిస్ప్లే విషయానికి వస్తే, రెండు ఫోన్లలోనూ హోల్-పంచ్ స్టైల్ ఫ్రంట్ కెమెరా డిజైన్ కొనసాగించబడింది
  5. డీజిల్ అల్ట్రా హ్యూమన్ రింగ్.. అవాక్కయ్యే ధర.. ఫీచర్స్ ఇవే
  6. ప్రాంతీయ కంటెంట్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకునే ప్లాన్.. టాటా ప్లే బింగ్‌లో కొత్త ఆప్షన్స్ ఇవే
  7. Poco X8 Pro ధర భారత్‌లో రూ.30,000 కంటే ఎక్కువగా ఉండొచ్చని లీకులు సూచిస్తున్నాయి
  8. రలోనే లాంఛ్ కానున్న సామ్ సంగ్ గెలాక్సీ మోడల్స్.. వీటి గురించి తెలుసుకున్నారా?
  9. ఇక V70తో పాటు మరో మోడల్ గురించి కూడా సమాచారం బయటకు రావడం జరిగింది
  10. మోడల్ కామోల్లియా పింక్, మాస్టర్ గోల్డ్, మాస్టర్ గ్రే కలర్‌లలో లభించనున్నట్లు లీక్‌లు సూచిస్తున్నాయి
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »