ఏకంగా 43 గంట‌ల వ‌ర‌కూ బ్యాట‌రీ లైఫ్‌తో చైనాలో లాంచ‌యిన Oppo Enco X3 ఇయర్‌ఫోన్స్‌

ఏకంగా 43 గంట‌ల వ‌ర‌కూ బ్యాట‌రీ లైఫ్‌తో చైనాలో లాంచ‌యిన Oppo Enco X3 ఇయర్‌ఫోన్స్‌

Photo Credit: Oppo

Oppo Enco X3 are offered in beige and black colourways

ముఖ్యాంశాలు
  • Oppo Enco X3 54ms తక్కువ లేటెన్సీ మోడ్‌ను కలిగి ఉంది
  • ఈ ఇయర్‌ఫోన్‌లు IP55 రేటింగ్‌తో వస్తాయి
  • ఇవి బ్లూటూత్ 5.4 కనెక్టివిటీకి మద్దతు ఇస్తాయి
ప్రకటన

చైనాలో Oppo Find X8 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు, Oppo ప్యాడ్ 3 ప్రోతో పాటు Oppo Enco X3 ఇయర్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. అయితే, భార‌త్ మార్కెట్‌లో ఆగస్టులో రిలీజ్ చేసిన‌ రీబ్రాండెడ్ వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3గా కనిపిస్తాయి. Dynaudio ద్వారా ట్యూన్ చేయబడిన తాజా Oppo TWS ఇయర్‌ఫోన్‌లు 11mm బాస్ డ్రైవర్స్‌, 6mm ట్వీటర్‌లతో వ‌స్తున్నాయి. ఆడియో క్వాలిటీని మ‌రింత మెరుగుపరచడంలో సహాయపడతాయని చెప్పబడే డ్యూయల్ DAC యూనిట్లను అమర్చబడి ఉన్నాయి. ఈ ఇయర్‌ఫోన్‌లు మొత్తం 43 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయని కంపెనీ ప్ర‌క‌టించింది. మ‌రెందుకు ఆల‌స్యం.. ఈ స‌రికొత్త Oppo Enco X3 ఇయర్‌ఫోన్‌లకు సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను చూసేద్దామా?!

చైనా ఈ-స్టోర్ ద్వారా ప్రీ-ఆర్డర్‌..

Oppo Enco X3 ధరను చైనాలో CNY 999 (దాదాపు రూ. 11,800)గా నిర్ణయించారు. ఇవి ప్రస్తుతం Oppo చైనా ఈ-స్టోర్ ద్వారా ప్రీ-ఆర్డర్‌లో CNY 949 (దాదాపు రూ. 11,200)కు ప్రత్యేక ప్రీ-సేల్ ధరలో అందుబాటులో ఉన్నాయి. కంపెనీ అక్టోబర్ 30న దేశంలో షిప్పింగ్‌ను ప్రారంభిస్తారు. ఈ స‌రికొత్త‌ ఇయర్‌ఫోన్‌లు నలుపు, ఆఫ్-వైట్ అనే రెండు రంగుల‌లో ల‌భించ‌నున్నాయి. ఇమేజ్‌ల‌ల‌లో చూస్తే మాత్రం.. ఈ క‌ల‌ర్స్‌లో ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్న‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

డ్యూయల్ DAC యూనిట్లతో..

Oppo Enco X3 సాంప్రదాయక ఇన్-ఇయర్ డిజైన్ మాదిరిగానే సిలికాన్ రౌండ్ స్ట‌మ్ డిజైన్‌ను కలిగి ఉంది. పించ్ యాక్ష‌న్‌, వాల్యూమ్ సర్దుబాటు కోసం స్లైడింగ్‌తో సహా కెపాసిటేటివ్ టచ్ కంట్రోల్‌కు స‌పోర్ట్ చేస్తాయి. అలాగే, డ్యూయల్ DAC యూనిట్లతో పాటు 11mm బాస్ డ్రైవర్స్‌, 6mm ట్వీటర్లతో వీటిని రూపొందించారు. VPU బోన్ కండిష‌న్‌తో AI-స‌పోర్ట్‌ గల ట్రిపుల్ మైక్ యూనిట్‌లను అందించారు.

డైనాడియో ద్వారా ట్యూన్..

Oppo యొక్క Enco X3 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌కు 50dB వరకు స‌పోర్ట్ ఇస్తుంది. అంటే, ANC పర్యావరణంలోని సందర్భానుసారంగా నాయిస్‌ను సర్దుబాటు చేస్తుంది. అవి స్పిరిట‌ల్‌ ఆడియోకు మద్దతిస్తాయి. అలాగే, ఈ ఇయర్‌ఫోన్‌లు డానిష్ లౌడ్‌స్పీకర్ తయారీదారైన‌ డైనాడియో ద్వారా ట్యూన్ చేయబడ్డాయి. అలాగే, దుమ్ము, ధూళి, నీటి నిరోధ‌క‌త‌ కోసం IP55 రేటింగ్‌తో వ‌స్తున్నాయి. గ‌తంలో లాంచ్ అయిన మోడ‌ల్స్‌తో పోల్చితే ఈ స్పెసిఫికేష‌న్స్ వాటికి గ‌ట్టిపోటీ ఇచ్చేలా క‌నిపిస్తున్నాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

లేటెన్సీ గేమింగ్ మోడ్‌తో..

Oppo చెబుతున్న‌దాని ప్ర‌కారం.. Enco X3 ఇయర్‌ఫోన్‌లు ఛార్జింగ్ కేస్‌తో మొత్తం 43 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందించగలవు. అంతేకాదు, ఈ ఇయర్‌ఫోన్‌లు ఒక్కసారి ఛార్జ్‌పై 10 గంటల వరకు ప‌ని చేస్తాయి. LHDC 5.0 ఆడియో కోడెక్‌కు మద్దతుతో పాటుగా బ్లూటూత్ 5.4 కనెక్టివిటీని క‌లిగి ఉన్నాయి. ఇయర్‌ఫోన్‌లు 54 ఎంఎస్ తక్కువ లేటెన్సీ గేమింగ్ మోడ్‌ను కూడా కలిగి ఉన్నాయి. అదిరిపోయే డిజైన్‌లో వ‌స్తోన్న ఈ ఒక్కో ఇయర్‌బడ్ బరువు 5.3గ్రాములుగా ఉంది.

Comments
మరింత చదవడం: Oppo Enco X3, Oppo Enco X3 Launch, Oppo Enco X3 Price
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. స్విమ్మింగ్ మోడ్‌తో మ‌న దేశంలో అడుగుపెడుతోన్న Huawei Band 9 ధర, స్పెసిఫికేషన్స్ ఇవే
  2. Geekbenchలో ప్ర‌త్య‌క్ష‌మైన‌ iQOO Z10 టర్బో, iQOO Z10 టర్బో ప్రో హ్యాండ్‌సెట్‌లు.. కీల‌క అంశాలు బ‌హిర్గ‌తం
  3. జియోఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ సబ్‌స్క్రైబర్‌లకు గుడ్‌న్యూస్‌.. రెండేళ్ల యూట్యూబ్ ప్రీమియం యాక్సెస్
  4. Samsung Galaxy S25, Galaxy S25+, Galaxy S25 అల్ట్రా డిజైన్‌తోపాటు స్పెసిఫికేషన్‌లు లాంచ్‌కు ముందే లీక్‌
  5. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెస‌ర్‌తో భార‌త్‌లో అడుగుపెట్టిన‌ Oppo Reno 13 5G, Reno 13 Pro 5G
  6. Poco X7 5G, Poco X7 Pro 5G వ‌రుస‌గా ఫిబ్రవరి 14, 17 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకాలు.. ధ‌ర ఎంతంటే
  7. సాలెపురుగులు కాళ్ల వెంట్రుకల ద్వారా వాసనలు గుర్తిస్తాయట‌.. కొత్త అధ్యయనంలో వెల్ల‌డి..
  8. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 తేదీలు వ‌చ్చేశాయి.. ఈ స్మార్ట్ ఫోన్‌లపై డిస్కౌంట్లు
  9. భార‌త్‌తోపాటు గ్లోబ‌ల్ మార్కెట్‌లో అడుగుపెట్టిన OnePlus 13, OnePlus 13R.. ధ‌ర ఎంతంటే
  10. ఇండియాలోకి Tecno Pop 9 5G కొత్త 8GB RAM వేరియంట్‌.. ధ‌ర కేవ‌లం రూ. 9,499
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »