Photo Credit: Huawei
Huawei కంపెనీ బార్సిలోనాలో జరిగిన మేట్‌ప్యాడ్ సిరీస్ ట్యాబ్ లాంచ్ ఈవెంట్‌లో Huawei Watch GT 5 Proని ఆవిష్కరించింది. తాజాగా విడుదలైన ఈ వాచ్ టైటానియం అల్లాయ్‌తో సిరామిక్ బాడీని కలిగి ఉంటుంది. అలాగే, 46mm, 42mm సైజుల్లో రెండు వేరియంట్‌లలో వాచ్ అందుబాటులో ఉంటుంది. Huawei Watch GT 5 Pro IP69K సర్టిఫికేషన్‌ను కలిగి ఉందని కంపెనీ తెలిపింది. ఇది AMOLED స్క్రీన్‌తో 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లను అందిస్తుంది. సాధారణ వినియోగంలో గరిష్టంగా 14 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. మరెందుకు ఆలస్యం.. ఈ స్మార్ట్‌వాచ్‌ల ధరతోపాటు స్పెసిఫికేషన్స్‌ను తెలుసుకుందాం రండి!
Huawei Watch GT 5 Pro ధర EUR 330 (దాదాపు రూ. 34,000) నుండి ప్రారంభమవుతుంది. 46mm వెర్షన్ నలుపు, టైటానియం ఫినిషింగ్‌తో వస్తుంది. అయితే, 42mm వేరియంట్ సిరామిక్ వైట్, వైట్ షేడ్స్‌లో ఆకర్షణీయంగా రూపొందించబడింది. అలాగే, 466 x 466 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో AMOLED డిస్‌ప్లేతో రెండు వేరియంట్‌లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. చిన్న వెర్షన్‌లో సిరామిక్ బాడీ ఉండగా, పెద్ద వేరియంట్‌లో టైటానియం అల్లాయ్ బాడీ ఉంది. డిస్‌ప్లేకు నీలి గ్లాస్ కోటింగ్ కూడా ఉంది. 5 ATM-రేటెడ్ వాటర్ రెసిస్టెన్స్‌తోపాటు అధిక ఉష్ణోగ్రతలు, ఒత్తిడిని తట్టుకునేలా IP69K సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఇమేజ్‌లలో చూస్తుంటేనే ఈ వాచ్‌ల ట్రెండీ లుక్ ఎంతో ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి.
Huawei Watch GT 5 Pro నిత్యం యూజర్స్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది. దీనిలో వినియోగదారుల ఆరోగ్యం, ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఆప్షన్ ద్వారా హృదయ స్పందన రేటు, స్లీప్ ట్రాకింగ్, ECG విశ్లేషణ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బేరోమీటర్, డెప్త్ సెన్సార్, ECG సెన్సార్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, టెంపరేచర్ సెన్సార్ ఇలా చాలా ఉన్నాయి. అంతేకాదు, ఇది 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లను అందించడంతోపాటు గోల్ఫ్ కోర్సుల మ్యాప్‌ను కలిగి ఉంటుంది.
Huawei Watch GT 5 Pro వివిధ కార్యకలాపాల సమయంలో మెరుగైన ట్రాకింగ్ కోసం సరికొత్త సన్‌ఫ్లవర్ పొజిషనింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ సాధారణ వినియోగంలో గరిష్టంగా 14 రోజుల బ్యాటరీ లైప్‌ను అందిస్తుంది. అలాగే, ఆల్‌టైం ఆన్ డిస్‌ప్లే ఎనేబుల్‌తో ఐదు రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. ఈ GT 5 Pro వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. Huawei హెల్త్ యాప్‌తో లింక్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. 46mm వేరియంట్ బరువు 53 గ్రాములు కాగా, 42mm వెర్షన్ 44 గ్రాముల బరువుతో కాస్త తేలికగా ఉంటుంది. మరి ఇన్ని ఫీచర్స్ ఉన్న స్మార్ట్ వాచ్‌ను ఎవరు మాత్రం ఇష్టపడరు చెప్పండి!
ప్రకటన
ప్రకటన