Infinix XE27 పేరుతో ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) హెడ్‌సెట్‌ను దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ లాంచ్ Infinix కంపెనీ యొక్క ఏడేళ్ల వార్షికోత్సవ వేడుకలో భాగంగా చెప్పొచ్చు.
Infinix కంపెనీ తాజా అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. ఈ కంపెనీ Infinix XE27 పేరుతో ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) హెడ్‌సెట్‌ను దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ లాంచ్ Infinix కంపెనీ యొక్క ఏడేళ్ల వార్షికోత్సవ వేడుకలో భాగంగా చెప్పొచ్చు. ఇక XE27 విషయానికి వస్తే.. ఇది 10mm డ్రైవర్లతో రూపొందించడంతోపాటు 25dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్(ANC)ను కలిగి ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. Infinix XE27 ఇయర్‌ఫోన్‌లు ఛార్జింగ్ కేస్‌తో సహా గరిష్టంగా 28 గంటల బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుందని పేర్కొన్నారు. దీంతోపాటు కంపెనీ Infinix Buds Neo వైర్‌లెస్ హెడ్‌సెట్‌ను కూడా ఆవిష్కరించింది. ఈ రెండు TWS ఇయర్‌ఫోన్‌లు దుమ్ము, స్ప్లాష్ నిరోధించేందుకు IPX4 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోన్న ఈ మోడల్ హెడ్‌సెట్స్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకుందాం!
ఇక మనదేశంలో Infinix XE27 ధర రూ. 1,699గా కంపెనీ నిర్ణయించింది. అలాగే ఈ తాజా వైర్‌లెస్ హెడ్‌సెట్ ఆగస్టు 26 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా బ్లూ, వైట్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు దేశీయ మార్కెట్‌లో ఇన్ఫినిక్స్ బడ్స్ నియో ధర రూ. 1,399గా కంపెనీ వెల్లడించింది. ఇది కూడా ఆగస్ట్ 26న ఫ్లిప్‌కార్ట్ ద్వారా బ్లాక్ ఫ్లేమ్, వైట్ పెర్ల్ రంగులలో అందుబాటులోకి రానుంది. అయితే, వీటి స్పెసిఫికేషన్‌లను తెలుసుకున్న తర్వాత ఆగస్టు 26 వరకూ ఆగడమంటే కష్టమే అనుంటున్నారు Infinix వినియోగదారులు. కంపెనీ అందిస్తున్న మోడ్రన్ ఫీచర్స్ ఎవ్వరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయని కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫీచర్స్ ఏంటో చూద్దాం..
Infinix XE27 స్పెసిఫికేషన్‌లు
ఒక్కో ఇయర్‌బడ్ 10mm డైనమిక్ డ్రైవర్‌తో అమర్చబడి ఉంటాయి. అలాగే, Infinix XE27 అనేది TWS హెడ్‌సెట్. ఇది 25dB వరకు ANCకు సపోర్ట్ చేస్తుంది. ఇది ఇన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. ఇయర్‌ఫోన్‌లోనూ రెండు బీమ్‌ఫార్మింగ్ మైక్రోఫోన్‌లను ఉపయోగించడం వల్ల చుట్టుపక్కల శబ్దాలను తొలగించి, ఫోన్ కాల్ సమయంలో క్వాలిటీ వాయిస్‌ను అందించేలా రూపొందించబడ్డాయి. Infinix XE27 టచ్ కంట్రోల్‌లను అందిస్తుంది. మోడ్రన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలోని Google ఫాస్ట్ పెయిర్‌కు సపోర్టు చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ వైర్‌లెస్ హెడ్‌సెట్ ANC డిసేబుల్ చేయడం ద్వారా ఒకే ఛార్జ్‌పై ఐదు గంటల ప్లేబ్యాక్, ఛార్జింగ్ కేస్‌తో సహా 28 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని స్పష్టం చేసింది. అలాగే, పది నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా 60 నిమిషాల ప్లేటైంను పొందవచ్చు.
Infinix Buds Neo స్పెసిఫికేషన్స్
Infinix కొత్తగా లాంచ్ చేసిన Infinix Buds Neoలో 13mm డ్రైవర్లను అందించారు. అయితే, ఇవి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్(ANC)కి సపోర్ట్ చేయవని కంపెనీ తెలిపింది. ఇది Infinix XE27 మోడల్‌లో అందుబాటులో ఉన్న ENC ఫీచర్‌కు అనుగుణంగా అదే సంఖ్యలో మైక్రోఫోన్‌లను అమర్చబడింది. అంతేకాదు, ఇది టచ్ కంట్రోల్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. Infinix Buds Neo వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు ఒకే ఛార్జ్‌పై 6 గంటల బ్యాటరీ సామర్థ్యాన్ని, ఛార్జింగ్ కేసుతో సహా 22 గంటల వరకు లైఫ్‌ను కలిగి ఉంటాయని కంపెనీ అధికారికంగా తెలిపింది. ఇది తక్కువ లేటెన్సీ మోడ్, టచ్ కంట్రోల్స్‌ను కూడా కలిగి ఉన్నాయి. ఈ Infinix Buds Neo TWS ఇయర్‌ఫోన్‌లు దుమ్ము, స్ప్లాష్ నిరోధించేందుకు IPX4 రేటింగ్‌ను కలిగి ఉన్నాయని కంపెనీ తెలిపింది. మరి ఇన్ని సరికొత్త ఫీచర్స్ ఉన్న ఈ మోడల్స్‌ను సొంతం చేసుకోవాలంటే మాత్రం ఆగస్టు 26 వరకూ వేచి ఉండాల్సిందే!
ప్రకటన
ప్రకటన
Honor Power 2 Chipset, Display Specifications Tipped; Could Launch With 10,080mAh Battery
Hollow Knight: Silksong's First Major Expansion, Sea of Sorrow, Announced; Launch Set for 2026