AI నాయిస్ క్యాన్సిలేష‌న్‌తో OnePlus Bullets Wireless Z3.. ధ‌ర కేవ‌లం రూ. 1699

OnePlus Bullets Wireless Z3 దుమ్ము, నీటి నియంత్ర‌ణ‌కు ఇవి ఐపీ55 రేటింగ్‌ను క‌లిగి ఉన్నాయి. గూగుల్ ఫాస్ట్ పెయిరింగ్ స‌పోర్ట్‌తో కేవ‌లం రూ. 1699ల‌కే అందుబాటులోకి వ‌స్తున్నాయి.

AI నాయిస్ క్యాన్సిలేష‌న్‌తో OnePlus Bullets Wireless Z3.. ధ‌ర కేవ‌లం రూ. 1699

Photo Credit: OnePlus

వన్‌ప్లస్ బుల్లెట్స్ వైర్‌లెస్ Z3 మాంబో మిడ్‌నైట్ మరియు సాంబా సన్‌సెట్ రంగులలో వస్తుంది

ముఖ్యాంశాలు
  • Wireless Z3 కి 12.4mm డైన‌మిక్ బేస్ డ్రైవ‌ర్స్‌ను అందించారు
  • ఒక్క ఛార్జ్‌తో 36 గంట‌ల సుధీర్ఘ బ్యాట‌రీ లైఫ్‌ను అందిస్తుంది
  • యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ స‌పోర్ట్‌తో కేవ‌లం ప‌ది నిమిషాల్లో ఫుల్ ఛార్జ్
ప్రకటన

సుధీర్ఘ కాలం త‌ర్వాత OnePlus నుంచి నెక్‌బ్యాండ్ స్టైల్ ఇయ‌ర్ ఫోన్స్ ఇండియాలో లాంఛ్ అవుతున్నాయి. 2022 మార్చి నెలలో వ‌చ్చిన‌ OnePlus Bullets Wireless Z2 మోడ‌ల్ లాంఛ్‌ తర్వాత కంపెనీ OnePlus Bullets Wireless Z3ని మ‌న దేశీయ మార్కెట్‌కు ప‌రిచ‌యం చేస్తోంది. AI నాయిస్ క్యాన్సిలేష‌న్‌తో వ‌స్తోన్న ఇవి సుధీర్ఘ బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను క‌లిగి ఉంటాయని కంపెనీ స్ప‌ష్టం చేసింది. అలాగే, వీటిని స్కిన్ సిలాకాన్ ఫ్రెండ్లీ మెటీరియ‌ల్‌తో త‌యారు చేసిన‌ట్లు కంపెనీ వెల్ల‌డించింది. దుమ్ము, నీటి నియంత్ర‌ణ‌కు ఇవి ఐపీ55 రేటింగ్‌ను క‌లిగి ఉన్నాయి. గూగుల్ ఫాస్ట్ పెయిరింగ్ స‌పోర్ట్‌తో కేవ‌లం రూ. 1699ల‌కే అందుబాటులోకి వ‌స్తున్నాయి.రెండు క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో,కొత్త OnePlus Bullets Wireless Z3 ఇయ‌ర్‌ఫోన్స్ ఒక్క ఛార్జ్‌తో 36 గంట‌ల సుధీర్ఘ బ్యాట‌రీ లైఫ్‌ను అందిస్తుంద‌ని కంపెనీ చెబుతోంది. దీనిలో మాగ్నిటిక్ ఇయ‌ర్ బ‌డ్స్‌, ఫిజిక‌ల్ ఫంక్ష‌న్ బ‌ట‌న్స్ ను కూడా అందించారు. సాంబా స‌న్‌సెట్‌, మాంబూ మిడ్ నైట్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో ల‌భించ‌నుంది. 3D స్పెషియ‌ల్ ఆడియో అనుభాన్న అందించే ఈ Wireless Z3 కి 12.4mm డైన‌మిక్ బేస్ డ్రైవ‌ర్స్‌ను అందించారు. ఇవి మార్కెట్‌లో అమ్మ‌కాల‌పై మంచి ప్ర‌భావాన్ని చూపే అవ‌కాశాలు ఉన్న‌ట్లు కంపెనీ భావిస్తోంది.

జూన్ 24 మ‌ధ్యాహ్నం

కొత్త OnePlus Bullets Wireless Z3 మ‌న దేశంలో జూన్ 24 మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి OnePlus అధికారిక వెబ్‌సైట్‌తోపాటు OnePlus ఎక్స్‌పీరియ‌న్స్ స్టోర్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, Myntra వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంల‌లో ల‌భిస్తుంది. అలాగే, క్రోమా, రిలయ‌న్స్‌, విజ‌యా సేల్ లాంటి ఎంకిక చేసిన రిటైల్ స్టోర్‌ల‌లో కూడా అమ్మ‌కాల‌కు వ‌స్తుంద‌ని కంపెనీ ప్ర‌క‌టించింది. రాబోయే Bullets Wireless Z3 ధ‌ర‌ను రూ. 1,699గా కంపెనీ నిర్ణ‌యించింది.

నాలుగు ప్రీసెట్ ఈక్యూ మోడ్‌ల‌తో

OnePlus Bullets Wireless Z3 లో అందించిన AI నాయిస్ క్యాన్సిలేష‌న్‌తో వ‌ల్ల కాల్ మాట్లాడేట‌ప్పుడు చుట్టు ప‌క్క‌ల నుంచి వ‌చ్చే నాయిస్‌ను కంట్రోల్ చేయ‌డం ద్వారా మ‌ని అనుభ‌వాన్ని అందిస్తుంది. అలాగే, బ్యాలెన్స్‌డ్‌, సెరినెట్‌, బాస్‌, బోల్డ్ అనే నాలుగు ప్రీసెట్ ఈక్యూ మోడ్‌ల‌తో వ‌స్తుంది. వినియోగ‌దారులు హే మెలోడీ యాప్‌తో బాస్ లెవెల్‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌చ్చు. అంతేకాదు, దీనికి అందించిన యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ స‌పోర్ట్‌తో కేవ‌లం ప‌ది నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయ‌వ‌చ్చ‌ని కంపెనీ స్ప‌ష్టం చేసింది.

Bullets Wireless Z3 క‌నెక్టివిటీ ఆప్ష‌న్స్‌

ఈ ఇయ‌ర్‌ఫోన్ 220mAh బ్యాట‌రీ సామ‌ర్థ్యంతో వ‌స్తున్నాయి. అలాగే, వీటి క‌నెక్టివిటీ విష‌యానికి వ‌స్తే, గూగుల్ ఫాస్ట్ పెయిరింగ్‌, బ్లూటూత్ 5.4, ఏఏసీ, ఎస్‌బీసీ ఆడియో కోడెక్‌ల‌కు మ‌ద్ద‌తు ఇస్తాయి. దీని బ‌ట‌న్‌ వినియోగంలో ఉన్న‌ప్పుడు వాల్యూమ్‌ను పెంచ‌డం లేదా త‌గ్గించ‌డం చేసేందుకు, కాల్ రిసీవ్ చేసుకునేందుకు, ఫోన్‌కు అటాచ్ చేసిన వాయిస్ అసిస్టెంట్‌ను ఒక్క క్లిక్‌తో యాక్సెస్ చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. మార్కెట్లోకి షావోమీ నుంచి కొత్త ఫోన్స్.. Xiaomi 17, Xiaomi 17 Ultra ధర, ఫీచర్స్ ఇవే
  2. Lava Bold N2, గత సంవత్సరం మే నెలలో విడుదలైన Lava Bold N1కు కంటిన్యూషన్ గా వస్తోంది.
  3. Geekbench సమాచారం ప్రకారం పరీక్షించబడిన ప్రోటోటైప్‌లో 12GB RAM ఉంది
  4. Realme P4 Lite లాంచ్ డేట్ ఇదే.. అదిరే ఫీచర్స్‌తో రానున్న రియల్ మీ ఫోన్
  5. అదే సమయంలో iPhone 17e కూడా ఈ వేదికపై ఆవిష్కృతం కావచ్చని భావిస్తున్నారు.
  6. 90W ఛార్జర్‌తో కనిపించిన వివో ఎక్స్ 300 ఎఫ్ఇ మోడల్.. ఇతర విశేషాలివే
  7. WF-1000XM6లో ANC సామర్థ్యం మధ్య నుండి హై ఫ్రీక్వెన్సీ రేంజ్‌లో గణనీయంగా మెరుగుపడింది.
  8. ప్రస్తుతం ఈ రకమైన వైడ్-ఫార్మాట్ ఫోల్డబుల్ ప్రయోగాల్లో బహిరంగంగా ముందంజలో ఉన్న ప్రధాన బ్రాండ్ Huawei మాత్రమే.
  9. ఫిబ్రవరి 19న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
  10. J700 అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తున్న ఈ మాక్‌బుక్ నిర్మాణ నాణ్యతలో మాత్రం ఎలాంటి రాజీ ఉండదని చెబుతున్నారు.
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »