మొత్తం థిక్నెస్ 8.9mm, బరువు చూస్తే 35 grams మాత్రమే ఉంది

OnePlus Watch Liteను పూర్తిగా స్లిమ్, లైట్‌వెయిట్ బాడీతో డిజైన్ చేశారు. ఈ వాచ్‌లో ఉండే 60 సెకండ్ వెల్నెస్ ఓవర్ వ్యూ ఒకేసారి రోజువారీ యాక్టివిటీ, హార్ట్ రేట్, స్లీప్ డేటా, SpO2, అలాగే మైండ్ మరియు బాడీ సమాచారాన్ని చూపిస్తుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 10 రోజులు బ్యాటరీ పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.

మొత్తం థిక్నెస్ 8.9mm, బరువు చూస్తే 35 grams మాత్రమే ఉంది
ముఖ్యాంశాలు
  • Watch Liteలో 10-రోజుల బ్యాటరీ, 1.46" AMOLED
  • OnePlus 15Rలో 7,400mAh బ్యాటరీ, SD 8 Gen 5
  • 15Rలో 4K 120fps వీడియో సపోర్ట్
ప్రకటన

OnePlus డిసెంబర్ 17న మూడు కొత్త ప్రొడక్ట్‌లను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ ఈవెంట్‌లో OnePlus 15R స్మార్ట్‌ఫోన్, OnePlus Pad Go 2 టాబ్లెట్‌ను భారతదేశం, యూరప్ మార్కెట్లలో లాంచ్ చేయనున్నారు. అదే రోజు యూరప్‌లో OnePlus Watch Lite కూడా అందుబాటులోకి రానుంది. లాంచ్‌కు ముందు Watch Lite గురించి కీలక వివరాలను ఒన్‌ప్లస్ అధికారికంగా వెల్లడించగా, 15R పై రిపోర్టులు ఇప్పటికే ఆసక్తికరమైన విషయాలను బయటపెడుతున్నాయి. OnePlus Watch Liteను పూర్తిగా స్లిమ్, లైట్‌వెయిట్ బాడీతో డిజైన్ చేశారు. ఈ వాచ్‌లో ఉండే 60 సెకండ్ వెల్నెస్ ఓవర్ వ్యూ ఒకేసారి రోజువారీ యాక్టివిటీ, హార్ట్ రేట్, స్లీప్ డేటా, SpO2, అలాగే మైండ్ మరియు బాడీ సమాచారాన్ని చూపిస్తుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 10 రోజులు బ్యాటరీ పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.

ఈ వాచ్ WearOS మీద కాకుండా వేరే ప్లాట్‌ఫారమ్‌పై రన్ అవుతుందని రూమర్లు సూచిస్తున్నాయి, ఎందుకంటే WearOS వాచ్‌లు ఇంత బ్యాటరీ బ్యాకప్ ఇవ్వడం అరుదు. Android, iOS రెండు ఫోన్లనించి ఒకేసారి నోటిఫికేషన్‌లు అందుకునే ఫీచర్ కూడా ఇందులో ఉంది. NFC సపోర్ట్‌తో కాంటాక్ట్‌లెస్ ఫీచర్లు పనిచేస్తాయి. అదనంగా డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS వుంది కాబట్టి లొకేషన్ ట్రాకింగ్ మరింత ఖచ్చితంగా ఉంటుంది. కలర్ ఆప్షన్లుగా బ్లాక్ మరియు సిల్వర్ అందుబాటులోకి రానున్నాయి.

రిపోర్ట్స్ ప్రకారం, వాచ్‌లో 1.46-inch AMOLED display ఉండనుంది. స్పోర్ట్స్ మోడ్ లో స్క్రీన్ 3,000 nits వరకు బ్రైట్ అవుతుందని, రెగ్యులర్ యూజ్‌లో 600 nits ఉంటుందని తెలుస్తోంది. మొత్తం థిక్నెస్ 8.9mm, బరువు చూస్తే 35 grams మాత్రమే ఉంది. దీనితోపాటుగా, OnePlus 15Rను OnePlus 15 సిరీస్‌లో value-focused మోడల్‌గా తీసుకువస్తున్నారు. ఈ ఫోన్ అసలుగా చైనాలో ఇటీవల లాంచ్ అయిన OnePlus Ace 6T ఆధారంగా తయారవుతుందని సమాచారం. ఇందులో తాజా Snapdragon 8 Gen 5 చిప్‌సెట్‌ను ఉపయోగిస్తారు.

డిజైన్‌ విషయానికి వస్తే, ఇది ఫ్లాట్ ఫ్రేమ్‌తో రాగా, కెమెరా మాడ్యూల్‌ను టాప్ లెఫ్ట్ కార్నర్‌లో 45° యాంగిల్‌లో ప్లేస్ చేశారు. ఈ ఫోన్‌కు IP66, IP68, IP69, IP69K వంటి హై-లెవెల్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్స్ ఉన్నాయి. కలర్ ఆప్షన్లుగా చార్కోల్ బ్లాక్, మింట్ బ్రీజ్ లను కన్ఫర్మ్ చేశారు. బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్‌లో భారీగా 7,400mAh కెపాసిటీతో పాటు 80W fast charging సపోర్ట్ ఉంది.

డిస్ప్లే భాగంలో 6.83-inch 1.5K OLED ప్యానెల్ 165Hz రిఫ్రెష్ రేట్, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండనున్నాయి. కళ్లకు హానికరం కాకుండా TÜV Rheinland Intelligent Eye Care 5.0 సర్టిఫికేషన్ కూడా ఉంది. కెమెరాల విషయానికి వస్తే, 50MP మెయిన్ సెన్సార్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, అలాగే 32MP ఫ్రంట్ కెమెరా ఉండొచ్చు. వీడియో షూటింగ్‌లో అయితే కంపెనీ 4K 120fps రికార్డింగ్ సపోర్ట్‌ను ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. భారతదేశం ధరలు ఖరారు కాలేదని స్టార్‌లింక్ ప్రకటన
  2. కొత్త ఫీచర్‌ను జోడించిన ఇన్‌స్టాగ్రామ్, ఇకపై పబ్లిక్ స్టోరీల షేరింగ్‌‌ మరింత సులభం
  3. మొత్తం థిక్నెస్ 8.9mm, బరువు చూస్తే 35 grams మాత్రమే ఉంది
  4. భారత్‌లో Fitness+ నెలసరి సబ్‌స్క్రిప్షన్ ధర రూ.149, వార్షిక ధర రూ.999
  5. లీకైన లిస్టింగ్స్ ప్రకారం, Narzo 90 రెండు రంగుల్లో రాబోతోంది...కార్బన్ బ్లాక్ మరియు విక్టరీ గోల్డ్
  6. తక్కువ ధరకే ఐ ఫోన్‌ 16ను పొందే ఛాన్స్, పూర్తి వివరాలు
  7. ఈ పోస్టుకు లక్షలాదిగా వ్యూస్ రావడంతో OpenAI స్పందించాల్సి వచ్చింది
  8. ముందు కెమెరా విషయంలో 50MP యాంటీ-డిస్టోర్షన్ సాఫ్ట్-లైట్ సెల్ఫీ లెన్స్‌ను ఉపయోగించారు
  9. Nothing OS 4.0 రోలౌట్‌ను “తక్షణ సరి చేయాల్సిన సమస్య” కారణంగా నిలిపివేశామని స్పష్టంగా ఉంది
  10. రియల్ మీ నుంచి మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు, త్వరలో భారత మార్కెట్‌లో విడుదల
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »