ఏకంగా 43 గంటల వరకూ బ్యాటరీ లైఫ్‌తో చైనాలో లాంచయిన Oppo Enco X3 ఇయర్‌ఫోన్స్
చైనాలో Oppo Find X8 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు, Oppo ప్యాడ్ 3 ప్రోతో పాటు Oppo Enco X3 ఇయర్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. అయితే, భారత్ మార్కెట్‌లో ఆగస్టులో రిలీజ్ చేసిన రీబ్రాండెడ్ వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3గా కనిపిస్తాయి. Dynaudio ద్వారా ట్యూన్ చేయబడిన తాజా Oppo TWS ఇయర్‌ఫోన్‌లు 11mm బాస్ డ్రైవర్స్, 6mm ట్వీటర్‌లతో వస్తున్నాయి. ఆడియో క్వాలిటీని మరింత మెరుగుపరచడంలో సహాయపడతాయని చెప్పబడే డ్యూయల్ DAC యూనిట్లను అమర్చబడి ఉన్నాయి. ఈ ఇయర్‌ఫోన్‌లు మొత్తం 43 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయని కంపెనీ ప్రకటించింది