Realme Watch 5 16 రోజుల వరకు సాధారణ ఉపయోగం, లైట్ స్మార్ట్ మోడ్‌లో 20 రోజుల వరకు, 720 నిమిషాల వరకు బ్లూటూత్ కాలింగ్‌ను అందిస్తుంది.
రియల్‌మీ భారతదేశంలో రియల్‌మీ వాచ్ 5 ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
రియల్‌మీ భారతదేశంలో Realme Watch 5 ని లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ ఇటీవల ఫ్లిప్‌కార్ట్‌లో దాని అవైలబిలిటీని ధృవీకరించింది. కానీ లాంఛ్ తేదీని మాత్రం ఇంకా కన్ఫామ్ చేయలేదు. ఇప్పుడు ఈ బ్రాండ్ స్మార్ట్‌వాచ్ కోసం కీలక ఫీచర్ల పూర్తి జాబితాను వెల్లడించింది. రియల్‌మీ వాచ్ 5 లో 1.97-అంగుళాల AMOLED డిస్‌ప్లే 390×450 పిక్సెల్ రిజల్యూషన్, 600 నిట్స్ బ్రైట్‌నెస్, 60Hz రిఫ్రెష్ రేట్, 79 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో ఉన్నాయి. ఇందులో అల్యూమినియం అల్లాయ్ క్రౌన్, హనీకాంబ్ స్పీకర్ హోల్ ఉన్నాయి. స్క్రీన్ ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లేకు మద్దతు ఇస్తుంది. ఇది పగలు, రాత్రికి అనుగుణంగా ఉండగలదని రియల్‌మీ చెబుతోంది. ఈ వాచ్ 460mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 16 రోజుల వరకు సాధారణ ఉపయోగం, లైట్ స్మార్ట్ మోడ్‌లో 20 రోజుల వరకు, 720 నిమిషాల వరకు బ్లూటూత్ కాలింగ్‌ను అందిస్తుంది.
ఫిట్‌నెస్ ట్రాకింగ్ కోసం వాచ్ 5 108 స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుంది. ఇది ఖచ్చితమైన అవుట్‌డోర్ ట్రాకింగ్ కోసం 5 GNSS సిస్టమ్‌లతో స్పోర్ట్స్ ఇండిపెండెంట్ GPSని కూడా కలిగి ఉంది. వినియోగదారులు రోజువారీ కార్యాచరణ డేటాను ఒకే ట్యాప్‌తో తనిఖీ చేయవచ్చు. స్పోర్ట్స్ డేటాను కూడా వీక్షించవచ్చు. ఆరోగ్య లక్షణాలలో స్లీప్ మానిటరింగ్, బ్రీతింగ్ ట్రైనింగ్, మెన్స్ట్రుయేషన్ మేనేజ్‌మెంట్, హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2 మ్యాక్స్ మానిటరింగ్, స్ట్రెస్ మానిటరింగ్ వంటివి కూడా ఉన్నాయి.
రియల్‌మీ వాచ్ 5లో IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, కంపాస్, NFC కార్డ్ సపోర్ట్, HD బ్లూటూత్ కాలింగ్, ఇండిపెండెంట్ బ్లూటూత్ ఇంటర్‌కామ్ ఉన్నాయి. వాచ్ 300 కంటే ఎక్కువ వాచ్ ఫేస్ థీమ్‌లను అందిస్తుంది. వీటిలో కష్టమైజబుల్, మల్టీ-ఫంక్షనల్, యానిమేషన్, ఆల్బమ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది కీలకమైన పోస్ట్-స్పోర్ట్స్ ఇండికేటర్‌లు, గేమ్ గార్డియన్ మోడ్‌ను కూడా అందిస్తుంది. వాచ్ ప్రీసెట్ గోల్స్, పేసింగ్ మెట్రోనొమ్, స్మార్ట్ రన్నింగ్ పార్టనర్, రన్నింగ్ కోర్సులతో ఆన్-రిస్ట్ కోచ్‌గా పనిచేస్తుంది.
స్మార్ట్‌వాచ్ చర్మానికి సురక్షితమైన పదార్థాలతో తయారు చేయబడిన 3D-వేవ్ స్ట్రాప్‌తో వస్తుంది. ఇది శుభ్రం చేయడం సులభం, అంతే కాకుండా చీకటిలో కనిపిస్తుంది. Realme ఇప్పటికే ప్రపంచ మార్కెట్లలో వాచ్ 5 ను విడుదల చేసింది, భారతదేశంలో లాంచ్ తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy S26 Ultra Wallpaper Leak Hints at Possible Colour Options