భారత్ మార్కెట్‌లో Samsung కంపెనీ తన బ్లాక్ ఫ్రైడే సేల్‌ను ప్రకటించింది. మన దేశంలోని సరికొత్త Galaxy వేరబుల్స్ లైనప్‌పై ఈ సేల్ మంచి డిస్కౌంట్‌లను అందిస్తుంది. Galaxy వాచ్ అల్ట్రా, Galaxy వాచ్ 7 లాంటి Samsung ప్రీమియం స్మార్ట్‌వాచ్‌లను బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో డిస్కౌంట్‌లతో సొంతం చేసుకోవచ్చు. అలాగే, Galaxy Buds 3, Galaxy Buds 3 Pro, Galaxy Buds FEని కొనుగోలు చేయాలనుకునేవారికి క్యాష్‌బ్యాక్ లేదా అప్‌గ్రేడ్ బోనస్ రూ. 5,000 ఉంటుంది. అంతేకాదు, Galaxy wearablesను నో-కాస్ట్ EMI ఎంపికలతో కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
ఈ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా Samsung రూ. 12,000 క్యాష్‌బ్యాక్ లేదా అప్‌గ్రేడ్ బోనస్ రూ. 10,000 వరకూ Galaxy Watch Ultra కోసం ఆఫర్ ఇస్తుంది. దీని మార్కెట్ ధర మన దేశంలో రూ. 59,999గా ఉంది. అలాగే, Galaxy Watch 7 కొనుగోలుదారుల కోసం రూ. 8000 క్యాష్‌బ్యాక్ లేదా అప్‌గ్రేడ్ బోనస్ పొందొచ్చు. దీని అసలు ధర ఇండియాలో బ్లూటూత్ వేరియంట్ అయితే రూ. 29,999, సెల్యులార్ వెర్షన్ రూ. 33,999గా ఉంది.
అలాగే, రూ.19,999 ధరతో ఉన్న Galaxy Buds 3 Pro కొనుగోలుపై ఏకంగా రూ. 5,000 క్యాష్‌బ్యాక్ లేదా సేల్‌లో అప్‌గ్రేడ్ బోనస్ పొందొచ్చు. ఇది కొనుగోలుదారులను ఆకర్షించే ధరగా రూ. 14,999లకే లభిస్తుంది. అలాగే, Galaxy Buds 3పై రూ. 4,000 క్యాష్‌బ్యాక్ లేదా అప్‌గ్రేడ్ బోనస్‌ను సొంతం చేసుకోవచ్చు. మార్కెట్‌లో ఈ మోడల్ అసలు ధర రూ. 14,999గా ఉంది.
Samsung నుంచి సరసమైన ధరలకే వస్తోన్న Galaxy Buds FE ధర మన దేశంలో రూ.9,999గా ఉండగా.. ఈ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో రూ. 4,000 క్యాష్‌బ్యాక్ లేదా అప్‌గ్రేడ్ బోనస్‌ను పొంది, సొంతం చేసుకోవచ్చు. Galaxy Watch Ultra, Galaxy Watch 7, Galaxy Buds 3 Pro, Galaxy Buds 3 వంటి మోడల్స్ కొనుగోలు చేయాలనుకుంటోన్న వినియోగదారులు రెండేళ్లపాటు అంటే 24 నెలల వరకు నో-కాస్ట్ EMIని పొందే అవకాశాన్ని కల్పించారు.
ప్రకటన
ప్రకటన