ప్రస్తుత టెక్నాలజీ యుగంలో స్మార్ట్ ఫోన్ వినియోగించనివారు ఎవరుంటారు చెప్పండి. ఈ స్మార్ట్ ఫోన్ వినియోగం రోజు రోజుకూ పెరుగున్న నేపథ్యంలో మొబైల్ తయారీ కంపెనీలు కొత్త కొత్త వర్షన్స్‌తో అధిరిపోయే ఫీచర్స్ ఉన్న ఫోన్‌లను మొబైల్ మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. అన్ని ఫీచర్లూ ఉన్న ఫోన్‌లు బడ్జెట్ ధరల్లోనే అందుబాటులో ఉంటున్నాయి. అలాంటి చవకైన స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రఖ్యాత చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ Vivo భారత్ మార్కెట్‌లో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ Vivo Y18iను పరిచయం చేసింది. Vivo Y18i జెమ్ గ్రీన్, స్పేస్ బ్లాక్ రెండు కలర్ ఆప్షన్లలో మార్కెట్‌లోకి వస్తోంది. 6.56 అంగుళాల HD+ డిస్‌ప్లేతో యూనిసోక్ T612 ప్రాసెసర్, 4GB RAM మరియు 64GB స్టోరేజీ సామర్థ్యంతో వస్తోంది. తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లతో పరిచయం అవుతోన్న ఈ మోడల్ మార్కెటింగ్‌పై అందిరి దృష్టీ పడింది.
అందుబాటు ధరలోనే
సామాన్యులకు అందుబాటు ధరలో మంచి ఫీచర్స్‌తో ఓ మొబైల్ మార్కెట్‌లో లాంచ్ అయింది అంటే దానికి మంచి ఆదరణ ఉంటుంది. తాజాగా Vivo కంపెనీ లాంచ్ చేసిన Vivo Y18i కూడా ఈ కోవకు చెందిందే. 13-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరాతోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌ను అందిస్తున్నారు. అలాగే, 5000 mAh కెపాసిటీ గల బ్యాటరీతో రూ.7,999లకు లభిస్తోంది. ప్రస్తుతం ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది. త్వరలో ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా అందుబాటులోకి రావచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డ్యూయల్ సిమ్ (నానో)తో Vivo Y18i ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్ OS 14 వర్షన్ మీద పని చేస్తోంది. 90Hz రీఫ్రెష్ రేటుతోపాటు 6.56 అంగుళాలHD+ (1,612 × 720 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆన్ బోర్డు స్టోరేజీతో 8GB RAMకు పెంచుకునే అవకాశం కల్పించారు. రేర్ ఫ్లాష్ యూనిట్‌తో Vivo Y18i ఫోన్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటది. అలాగే, 13-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాను, 0.08 మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాను అందిస్తున్నారు. కేవలం 185 గ్రాముల బరువుతో
Vivo Y18iలోని కనెక్టివిటీ ఆప్షన్స్‌ను పరిశీలిస్తే.. Wi-Fi, బ్లూటూత్ 5.1, GPS, BeiDou, GLONASS, గెలీలియో, QZSS, OTG, FM రేడియో, USB 2.0 పోర్ట్ కలిగి ఉన్నాయి. ఇక మోబైల్‌లోని సెన్సార్‌ల గురించి మాట్లాడితే.. బోర్డ్‌లోని సెన్సార్‌లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్ మరియు ప్రాక్సిమిటీ సెన్సార్‌లను అందించారు. MicroSD card సాయంతో ఆన్ బోర్డు స్టోరేజీ కెపాసిటీ 64GB వరకూ పెంచుకునే వెసులుబాటు కల్పించారు. ఇది దుమ్ము మరియు స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP54-రేట్ బిల్డ్‌ను కలిగి ఉంది. 5,000mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తోన్న ఈ Vivo Y18i పరిమాణం చూస్తే.. 163.05×75.58×8.39mmతో 185 గ్రాముల బరువు ఉంటుంది. ఇప్పటికే Vivo కంపెనీ స్మార్ట్ ఫోన్‌లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. Vivo Y18i మోడల్‌లోనూ అదిరిపోయే ఫీచర్లు ఉండడంతోపాటు ధర కూడా తక్కువగా ఉండడంతో దేశీయ మొబైల్ మార్కెట్‌లో వీటి అమ్మకాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. మీరు కూడా తక్కువ ధరలో మంచి ఫీచర్స్‌తో ఉన్న మొబైల్ కోసం చూస్తున్నట్లయితే Vivo Y18i మోడల్‌ను ట్రై చేయండి మరి!