Vivoకి మన దేశీయ మార్కెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీగా పేరుంది. అందుకు కారణం సామాన్యులకు సైతం అందుబాటు ధరలో అదిరిపోయే ఫీచర్లున్న స్మార్ట్ ఫోన్‌లను అందించడమే. అదీకాకుండా ఫోన్‌లోని కెమెరాపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో Vivo ఫోన్‌లకు డిమాండ్ పెరిగింది. ఇప్పటికే అలాంటి చాలా ఫోన్‌లను పరిచయం చసిన Vivo తాజాగా మన భారత దేశ మార్కెట్‌లోకి రెండు సరికొత్త మోడల్స్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Vivo ఈ కొత్త మోడల్స్‌ను మన దేశంలో రిలీజ్ చేస్తే ఇతర కంపెనీలకు మంచి ఇచ్చినట్లు అవుతుందని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరెందుకు ఆలస్యం Vivo కంపెనీ మన దేశీయ మార్కెట్‌కు పరిచయం చేయబోతోన్న ఈ సరికొత్త మోడల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందామా?!
Vivo కంపెనీ తాజాగా Vivo V40, V40 Pro పేరుతో కొత్త మోడల్ ఫోన్‌లను త్వరలో భారత మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. Vivo V30, Vivo V30 Pro మోడల్స్‌ను ఈ ఏడాది మార్చిలో మన దేశంలో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మోడల్ ఫోన్‌లకు ఇండియన్ మార్కెట్‌లో మంచి ఆదరణ లభించింది. దీంతో ఇప్పుడు వీటికి అప్‌గ్రేడ్ వెర్షన్లుగా ఈ హ్యాండ్‌సెట్‌లను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది ఈ కంపెనీ. అంతేకాదు, ఇప్పటికే Vivo V40 ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేయబడిన దేశాలలో లాంచ్ చేశారు. కొత్తగా వచ్చిన నివేదికను బట్టీ.. Vivo V40 సిరీస్‌లోని వనిల్లా, ప్రో వేరియంట్‌లు రెండూ త్వరలోనే భారతదేశంలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
మన దేశంలో రిలీజ్ ఎప్పుడంటే..
మన దేశంలో రిలీజ్ కాబోయే ఈ కొత్త వెర్షన్‌లో Zeiss-సపోర్టెడ్ కెమెరాలను అందించనున్నట్లు సమాచారం. అలాగే, భారతదేశంలో Vivo V40, Vivo V40 ప్రో లాంచ్ టైమ్‌లైన్ బయటకు వచ్చింది. MySmartPrice నివేదిక ఆధారంగా.. Vivo V40, Vivo V40 Pro ఈ ఏడాది ఆగస్టు నెలలో మనదేశంలో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు జీస్ ఆప్టిక్స్ కెమెరాలకు మద్దతిస్తాయని నివేదికలో వెల్లడించింది. ఈ ఫోన్‌లు మల్టీఫోకల్ పోర్ట్రెయిట్‌లకు కూడా మద్దతు ఇస్తాయని తెలిపింది. Vivo V40 ప్రత్యేకతలను చూస్తే.. Vivo V40 గ్లోబల్ మార్కెట్‌లో 6.78 అంగుళాల curved AMOLED స్క్రీన్‌తో విడుదలైంది. ఇది 2,800 x 1,260 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 nits పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో పనిచేస్తుంది. గతంలో వచ్చిన మోడల్స్‌తో పోల్చుకుంటే ఈ Vivo V40, Vivo V40 Pro ఔట్ లుక్ అధిరిపోయేలా ఉంటుంది. ధూళి, నీటి నుంచి రక్షణ పొందేలా..
ఈ మోడల్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 SoC ద్వారా ఆధారితం కాబడి, Adreno 720 GPUతో జత చేశారు. స్టోరేజ్ విషయానికి వస్తే 12GB వరకు LPDDR4X RAM + 512GB వరకు UFS 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజీ అందిస్తున్నారు. ఈ ఫోన్ Android 14-ఆధారిత FuntouchOS 14, Ziess ఆప్టిక్స్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో లాంచ్ కాబోతోంది. అలాగే, మొబైల్ వెనుకవైపు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో సెకండరీ 50-మెగాపిక్సెల్ కెమెరా వంటి అదనపు ఫీచర్చ్ కూడా అందించబడి, సిస్టమ్ ఆరా లైట్ యూనిట్‌తో ఉంటుంది. అలాగే, సెల్ఫీ కోసం ఫోన్‌లో ఫ్రంట్ ఫేసింగ్ 50 మెగాపిక్సెల్ కెమెరాను అందిస్తున్నారు. 80W వైర్డ్ ఫ్లాష్‌ఛార్జ్‌కు మద్దతుతో 5,500mAh బ్యాటరీని రూపొందిస్తున్నారు. ధూళి, నీటి నుంచి రక్షణ పొందేలా IP68-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంటుంది.