Photo Credit: Meta Platform
వినియోగదారులు WhatsApp స్థితిని ఇతర మెటా ప్లాట్‌ఫారమ్‌ల యాప్‌లకు షేర్ చేయగలరు
వినియోగదారులకు సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేయడంలో ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పుడూ ముందుంటుంది. వాట్సాప్ త్వరలో మెటా అకౌంట్స్ సెంటర్‌తో ఆప్షనల్ అటాచ్‌మెంట్ ద్వారా మరింత ప్రయోజనం పొందనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీని ద్వారా వినియోగదారులు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ఇతర మెటా ప్లాట్‌ఫామ్‌ల యాప్‌లలో తమ వాట్సాప్ స్టేటస్‌లను ఆటోమెటిక్‌గా షేర్ చేసుకోగలుగుతారు. ఒకే సైన్-ఆన్‌తో పలు మెటా యాప్‌లకు లాగిన్ అవ్వడాన్ని సులభతరంతోపాటు వేగవంతం చేస్తుందని కంపెనీ వెల్లడించింది. అదనంగా, కంపెనీ తన సోషల్ మీడియా యాప్‌లలో మరిన్ని యూనివర్సల్ ఫీచర్‌లను ప్రవేశపెడుతుందని, రోల్ అవుట్ తర్వాత మార్పుల గురించి వినియోగదారులకు తెలియజేస్తుందని ప్రకటించింది.
ఈ మెటా ప్లాట్‌ఫారమ్‌లు ఓ న్యూస్‌రూమ్ పోస్ట్‌లో రాబోయే కొన్ని నెలల్లో తన అకౌంట్స్ సెంటర్‌కు వాట్సాప్‌ను జోడించడం గురించి వివరించింది. కంపెనీ వెల్లడించిన వివరాలు ప్రకారం.. ఈ ప్రక్రియ పూర్తిగా ఆప్షనల్. వినియోగదారులు తమ వాట్సాప్ ఖాతాలను అకౌంట్స్ సెంటర్‌కు అటాచ్ చేసుకోకుండా ఎంపిక చేసుకోవచ్చు. ఈ కొత్త ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవడం వల్ల యాప్‌లలో ఫీచర్‌లకు మరింత సజావుగా యాక్సెస్ లభిస్తోంది. వినియోగదారులు తమ వాట్సాప్ స్టేటస్ నుండి ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలకు నేరుగా అప్‌డేట్‌లను తిరిగి షేర్ చేసుకోవచ్చు. వివిధ యాప్‌లలో చాలాసార్లు పోస్ట్ చేయవలసిన అవసరాన్ని లేకుండా చేస్తుంది.
ఇటీవలే, వాట్సాప్ మ్యూజిక్ ఆఫ్ స్టేటస్ అప్డేట్స్ పేరుతో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇది పేరుకు తగ్గట్టుగానే దీని ద్వారా వినియోగదారులు తమ ఫేవరెట్ మ్యూజిక్ను వాట్సాప్ స్టేటస్కి అటాచ్ చేసుకొవచ్చు. ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మనకు ఇష్టమైన మ్యూజిక్ను మన స్టేటస్తో అటాచ్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు తాజాగా రాబోయే కొత్త ఆప్షన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కానీ, దీని పూర్తిస్థాయి లాంచ్ దశలవారీగా జరగొచ్చు.
అందుబాటులోకి వచ్చినప్పుడు వినియోగదారులు వాట్సాప్ సెట్టింగ్‌లలో ఈ ఆప్షన్ కనిస్తుంది. లేదా ఇతర మెటా ప్లాట్‌ఫారమ్‌ల యాప్‌లకు స్టేటస్‌ను తిరిగి షేర్ చేయడంలాంటి చేసేందుకు ప్రయత్నించేటప్పుడు ఇది కనిపించే అవకాశం ఉంది. ఈ ఫీచర్ అకౌంట్స్ సెంటర్ ఇంటిగ్రేషన్ మూడు యాప్‌లకు ఒకే సైన్-ఆన్‌ను తీసుకువస్తుంది. వినియోగదారులు తక్కువ స్టెప్‌లలో వాటిలోకి తిరిగి లాగిన్ అవ్వడానికి వీలు కల్పిస్తుంది. అవతార్, మెటా AI స్టిక్కర్స్, ఇమాజిన్ మీ క్రియేషన్‌లను అన్ని యాప్‌లలో ఒకే చోట నిర్వహించగలగడం లాంటి కొత్త ఫీచర్స్‌ను కూడా పరిచయం చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
అయితే, మెటా ప్లాట్‌ఫారమ్‌ల ప్రైవసీ ఎప్పటికీ తమ ప్రాధాన్యతలో ముఖ్యమని గుర్తు చేసింది. వాట్సాప్ ఖాతాలు మెటా ప్లాట్‌ఫారమ్‌ల అకౌంట్స్ సెంటర్‌కు కనెక్ట్ చేయబడినప్పటికీ, వ్యక్తిగత సందేశాలు, కాల్‌లు ఇప్పటికీ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా రక్షించబడుతున్నాయని, కంపెనీ కూడా వాటిని చదవలేదని స్పష్టం చేసింది.
ప్రకటన
ప్రకటన