ఐఫోన్ 17 సిరీస్‌లో అత్యంత చౌకైన మోడల్ ఐఫోన్ 17e లాంచ్ అయింది. మార్చి 11న సేల్‌కి వస్తుంది.
Photo Credit: apple
యాపిల్ ఇండియాలో ఐఫోన్ 17eని గ్రాండ్‌గా లాంచ్ చేసింది. మార్చి 11న ఈ ఫోన్ సేల్‌కి వస్తుంది. బేస్ 256GB వేరియంట్ ధర రూ. 64,900.
యాపిల్ కంపెనీ తన ఐఫోన్ 17 సిరీస్‌లో అత్యంత చౌకైన మోడల్ 'ఐఫోన్ 17e'ని మార్కెట్లోకి గ్రాండ్‌గా లాంచ్ చేసింది. గతేడాది వచ్చిన ఐఫోన్ 16eకి సక్సెసర్‌గా వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్, యూత్ ,బడ్జెట్ కాన్షియస్ ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తూ అదిరిపోయే అప్‌గ్రేడ్లతో కనిపిస్తోంది. ముఖ్యంగా ఇందులో లేటెస్ట్ A19 చిప్‌సెట్ వాడటం విశేషం. ఈ మోడల్‌లో మనకి మ్యాగ్‌సేఫ్ సపోర్ట్ కూడా ఉండటంతో వైర్‌లెస్ ఛార్జింగ్ వాడుకోవడం ఇప్పుడు మరింత ఈజీ కానుంది. ఐఫోన్ 17e లో స్టోరేజ్ విషయంలో యాపిల్ డబుల్ ధమాకా ఇచ్చింది, బేస్ మోడల్ ఏకంగా 256GB నుండి ప్రారంభం కావడం వల్ల ఫోటోలు, వీడియోలకి అస్సలు లోటు ఉండదు.
ధర విషయానికొస్తే ఇండియాలో 256GB వేరియంట్ ధర రూ. 64,900 కాగా, 512GB వేరియంట్ రూ. 84,900 కి అందుబాటులో ఉంది. బ్లాక్, సాఫ్ట్ పింక్, వైట్ వంటి ట్రెండీ కలర్లలో వస్తున్న ఈ ఫోన్‌ని ఇప్పుడే ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు, మార్చి 11 నుండి ఇది అమ్మకానికి వస్తుంది. ఐఫోన్ 17 సిరీస్‌లో తక్కువ ధరకే ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ఇందులో లేటెస్ట్ iOS 26 సాఫ్ట్‌వేర్ కూడా ఉండటం వల్ల సాఫ్ట్‌వేర్ పరంగా చాలా అప్‌డేటెడ్‌గా ఉంటుంది.
డిస్‌ప్లే పరంగా 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR స్క్రీన్‌ని యాపిల్ కొనసాగించింది. అయితే ఈసారి సిరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్‌ని వాడటం వల్ల పాత మోడల్ కన్నా స్క్రీన్ 3 రెట్లు ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉంటుందని కంపెనీ చెబుతోంది. నోచ్ డిజైన్‌తో వస్తున్న ఈ స్క్రీన్ 800 నిట్స్ బ్రైట్‌నెస్‌ని ఇస్తుంది. ఐఫోన్ 17e ని కేవలం లుక్ కోసమే కాకుండా పెర్ఫార్మెన్స్ కోసం కూడా డిజైన్ చేశారు. ఇందులో ఉన్న 8GB ర్యామ్, పవర్‌ఫుల్ న్యూరల్ ఇంజిన్ వల్ల మల్టీటాస్కింగ్ చాలా స్మూత్‌గా సాగుతుంది, అంతేకాకుండా యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
కెమెరా విషయానికి వస్తే వెనుకవైపు 48 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా సెటప్ ఉన్నప్పటికీ అది ఇచ్చే అవుట్‌పుట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇన్-సెన్సార్ క్రాప్ టెక్నాలజీతో 2x ఆప్టికల్ క్వాలిటీ జూమ్ ఫోటోలను మనం క్లిక్ చేయవచ్చు. సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్ ట్రూడెప్త్ కెమెరాని అమర్చారు. యాక్షన్ మోడ్ వంటి కొన్ని హై-ఎండ్ ఫీచర్లు మిస్ అయినప్పటికీ, రెగ్యులర్ యూజర్లు మెచ్చే విధంగా ఫోటో క్వాలిటీ ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫోన్‌లో వచ్చిన యాక్షన్ బటన్ ద్వారా మీకు కావాల్సిన షార్ట్‌కట్‌లను సెట్ చేసుకోవడం ఒక ప్లస్ పాయింట్.
బ్యాటరీ లైఫ్ విషయంలో కూడా యాపిల్ ఎక్కడా తగ్గలేదు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 26 గంటల పాటు వీడియో ప్లేబ్యాక్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. 20W వైర్డ్ ఛార్జింగ్, 15W మ్యాగ్‌సేఫ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల యూజర్లకు చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. 5G నెట్‌వర్క్, వై-ఫై 6 మరియు నైవిక్ వంటి లేటెస్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ చాలా లైట్ వెయిట్‌గా ఉండటం వల్ల పట్టుకోవడానికి కూడా చాలా స్టైలిష్‌గా, కాంపాక్ట్‌గా అనిపిస్తుంది.
ఓవరాల్‌గా ఐఫోన్ 17e అనేది బడ్జెట్‌లో ఐఫోన్ క్రేజ్‌ని ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఒక పక్కా ప్యాకేజీ. ఐఫోన్ 16e తో పోలిస్తే ఇందులో జరిగిన మార్పులు కచ్చితంగా యూజర్లను ఆకట్టుకుంటాయి. మంచి ప్రాసెసర్, ఎక్కువ స్టోరేజ్, మరియు కొత్త రకం ప్రొటెక్షన్ ఈ ఫోన్‌ని మార్కెట్లో హాట్ కేక్‌లా మార్చే అవకాశం ఉంది. మీరు ప్రస్తుతం ఏదైనా పాత ఐఫోన్ వాడుతుంటే లేదా కొత్తగా ఐఫోన్ ఎకో సిస్టమ్‌లోకి రావాలనుకుంటే ఈ సరికొత్త ఐఫోన్ 17e ని కచ్చితంగా పరిశీలించవచ్చు.
ప్రకటన
ప్రకటన
Vivo Y21 5G With Dimensity 6300 Chip Listed on Cellular Operator’s Website Ahead of Launch