గత సంవత్సరం, కంపెనీ Dor టీవీ OSతో Dorను పరిచయం చేసింది. ఇది సబ్‌స్క్రిప్షన్ ఆధారిత టెలివిజన్ సేవలను అందిస్తుంది.
Photo Credit: Google Play
డోర్ ప్లే యాప్ ప్రత్యేకంగా స్మార్ట్‌ఫోన్‌లలో మద్దతు ఇస్తుంది
భారత్‌లోని ఆండ్రాయిడ్, iOS వినియోగదారుల కోసం స్ట్రీమ్‌బాక్స్ మీడియా Dor Play అనే యాప్‌ను లాంఛ్ చేసింది. ఈ యాప్ 20 కంటే ఎక్కువ OTT ప్లాట్‌ఫారమ్‌లతో పాటు 300 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌ల యాక్సెస్‌ను అందిస్తుంది. వినియోగదారులు ప్రతి స్ట్రీమింగ్ సర్వీస్ లేదా ఛానెల్‌కు వ్యక్తిగతంగా సైన్ అప్ చేసేందుకు బదులుగా కొత్తగా వచ్చిన ఈ యాప్ సబ్‌స్క్రిప్షన్ చేసుకుంటే సరిపోతుంది. గత సంవత్సరం, కంపెనీ Dor టీవీ OSతో Dorను పరిచయం చేసింది. ఇది సబ్‌స్క్రిప్షన్ ఆధారిత టెలివిజన్ సేవను అందిస్తుంది. స్ట్రీమ్‌బాక్స్ మీడియా నవంబర్ 2024లో దాని Dor QLED స్మార్ట్ టీవీల రేంజ్‌ని ఆవిష్కరించింది.
మన దేశంలో Dor Play సబ్‌స్క్రిప్షన్ మూడు నెలల ప్లాన్ ధర కేవలం రూ. 399గా నిర్ణయించారు. ఇది స్మార్ట్ ఫోన్‌లలో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. అలాగే, iOS, Android వినియోగదారులకు వరుసగా యాప్ స్టోర్, ప్లే స్టోర్‌లో లభిస్తుందని కంపెనీ వెల్లడించింది.
యాప్‌పై ఆసక్తిగల ఉన్న కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ ద్వారా సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయవచ్చు. వీరిలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కూపన్ కోడ్ అందుతుంది. సబ్‌స్క్రిప్షన్‌ను యాక్టివేట్ చేయడానికి వినియోగదారులు తమ హ్యాండ్‌సెట్‌లలో Dor Play యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లతో పాటు ప్రత్యేకమైన కూపన్ కోడ్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది.
ఫ్లిప్‌కార్ట్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ లిస్ట్ ప్రకారం.. Dor Play యాప్ 20కి పైగా OTT ప్లాట్‌ఫారమ్‌లు, 300 టీవీ ఛానెల్‌ల నుండి కంటెంట్‌ను ఒకే ప్లాట్‌ఫారమ్‌లో అందిస్తుంది. అంతేకాదు, ఇది లైవ్ స్పోర్ట్స్, సినిమాలు, రియాలిటీ టీవీ ప్రోగ్రామ్‌లు, ఫిక్సన్ టీవీ సిరీస్‌లతో సహా చాలా రకాల ఎంటర్‌టైన్‌మెంట్‌ను చేరువ చేస్తుంది. వినియోగదారులు పలు యాప్‌లను ఉపయోగించాల్సిన అవసరం లేకుండా వివిధ ప్లాట్‌ఫారమ్‌ల నుండి కంటెంట్‌ను ఒకే చోట ఆస్వాదించవచ్చు.
మరీ ముఖ్యంగా, Dor Play యాప్ యూనివర్సల్ సెర్చ్‌ను అందిస్తుంది. ఇది కంటెంట్‌ను కనుగొనడం మరింత సులభతరం చేస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే, ఈ ఫీచర్ వినియోగదారులు ఒకే చోట అనేక ప్లాట్‌ఫారమ్‌లలో సర్చ్ చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. ట్రెండింగ్ & అప్ కమింగ్ సెక్షన్‌లను, తాజాగా అత్యంత ప్రజాదరణ పొందిన కంటెంట్ గురించి అప్‌డేట్‌లను వినియోగదారులకు చేరవేస్తుంది.
Dor Play యాప్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా స్మార్ట్ ఫిల్టర్‌లను కూడా అందిస్తుంది. ఇది వినియోగదారులు సంతోషంగా, నోస్టాల్జిక్‌గా, సాహసోపేతంగా.. ఇలా పలు విధాలుగా వారి మానసిక స్థితి ఆధారంగా కంటెంట్‌ను చేరువ చేయడంలో సహాయపడుతుంది. మూడ్-ఆధారిత ఫిల్టర్‌లతో, యాప్ వినియోగదారులు ఇష్టపడే మానసిక స్థితికి సరిపోయే కంటెంట్‌ను సిఫార్సు చేయగలదు. వారి ప్రాధాన్యతలకు మరింత సరిపోలడానికి, శైలి లేదా వారికి ఇష్టమైన నటుల వారీగా కంటెంట్‌ను ఫిల్టర్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999