ఈ ఫెస్టివల్ సేల్‌ను ఉపయోగించుకుని, కొత్త సాంకేతికతతో కూడిన డిస్ప్లేలు, మెరుగైన ప్రాసెసర్లు, మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్లతో ఉన్న టీవీలను తక్కువ ధరలకు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
Photo Credit: Amazon
అమెజాన్ సేల్ 2025: మీరు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో అదనపు తగ్గింపులను కూడా పొందవచ్చు
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 ప్రస్తుతం ప్రైమ్ సభ్యులకు ప్రత్యేకంగా ప్రారంభమైంది. మంగళవారం అర్ధరాత్రి నుండి అన్ని కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. ఈ వార్షిక సేల్‌లో దసరా, దీపావళి పండుగల సందర్భంగా శాంసంగ్, ఎల్జీ వంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. సాధారణ ధరల తగ్గింపులతో పాటు, బ్యాంక్ ఆఫర్లు, కూపన్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ EMI అవకాశాలు కూడా వినియోగదారులకు లభిస్తున్నాయి. అంతేకాకుండా, పాత టీవీలను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా అదనపు తగ్గింపులు పొందే అవకాశమూ ఉంది.
ఈ ఫెస్టివల్ సేల్‌ను ఉపయోగించుకుని, కొత్త సాంకేతికతతో కూడిన డిస్ప్లేలు, మెరుగైన ప్రాసెసర్లు, మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్లతో ఉన్న టీవీలను తక్కువ ధరలకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉదాహరణకు, షావోమి 55 అంగుళాల X సిరీస్ 4K LED స్మార్ట్ గూగుల్ టీవీ అసలు ధర రూ.48,999 కాగా, ప్రస్తుతం రూ.34,399కి లభిస్తోంది. హైసెన్స్ 65 అంగుళాల E7Q PRO సిరీస్ 4K అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ QLED టీవీ అసలు ధర రూ.98,999 కాగా, ఇప్పుడు కేవలం రూ.49,999కే అందుబాటులో ఉంది.
ఇకపోతే, ఎస్‌బిఐ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ వినియోగదారులు 10 శాతం అదనపు తగ్గింపును పొందవచ్చు. అమెజాన్ పే యూపీఐ ద్వారా చెల్లింపులు చేసిన వారికి ప్రత్యేక డిస్కౌంట్లు లభిస్తాయి. అదనంగా, ఎంపిక చేసిన ఉత్పత్తులపై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్‌కి 5 శాతం వరకు అదనపు తగ్గింపు లభించే అవకాశం ఉంది.
అందువల్ల, రూ.50,000 లోపు బడ్జెట్‌లో అత్యుత్తమ స్మార్ట్ టీవీ మోడళ్లను కొనుగోలు చేయడానికి ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 మంచి అవకాశం. షావోమి 55 అంగుళాల X సిరీస్ 4K LED గూగుల్ టీవీ (L55MA-AIN) అసలు ధర రూ.48,999 కాగా, ప్రస్తుతం రూ.34,399కు లభిస్తోంది. హైసెన్స్ 65 అంగుళాల E7Q ప్రో సిరీస్ 4K అల్ట్రా హెచ్‌డీ QLED టీవీ (65E7Q Pro) అసలు ధర రూ.98,9999 ఉండగా, ఇప్పుడు రూ.49,999కే అందిస్తున్నారు.
టీసీఎల్ 55 అంగుళాల 4K UHD స్మార్ట్ QD-మినీ LED గూగుల్ టీవీ (55Q6C) అసలు ధర రూ.1,19,990 ఉండగా, ఆఫర్ ధరగా రూ.43,990కి అందుబాటులో ఉంది. శాంసంగ్ 55 అంగుళాల Vision AI 4K అల్ట్రా హెచ్‌డీ QLED టీవీ (QA55QEF1AULXL) ధర రూ.75,500 నుండి రూ.43,990కి తగ్గింది.అసర్‌ప్యూర్ 55 అంగుళాల స్విఫ్ట్ సిరీస్ UHD LED స్మార్ట్ గూగుల్ టీవీ (AP55UG51ASFTD) అసలు ధర రూ.64,490 ఉండగా, ఇప్పుడు కేవలం రూ.27,999కి లభిస్తోంది. ఎల్జీ 43 అంగుళాల UA82 సిరీస్ 4K అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ webOS LED టీవీ (43UA82006LA) ధర రూ.48,690 నుండి రూ.26,490కి తగ్గింది.
సోనీ 43 అంగుళాల బ్రావియా 2M2 సిరీస్ 4K అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ LED గూగుల్ టీవీ (K-43S22BM2-2) కూడా ఆకర్షణీయమైన ఆఫర్‌లో ఉంది. అసలు ధర రూ.59,900 ఉండగా, ఇప్పుడు రూ.36,990కే లభిస్తోంది. మంచి మంచి టీవీలు కొనుగోలు చేయాలని చూసే వారికి ఈ సేల్ గొప్ప అవకాశం అని చెప్పవచ్చు.
ప్రకటన
ప్రకటన