ఈ సేల్‌లో హోమ్ అప్లయన్సెస్‌పై గరిష్టంగా 65 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది అమెజాన్. అదొక్కటే కాకుండా, ఎస్‌బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో కొనుగోలు చేసే వారికి అదనంగా 10 శాతం తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
Photo Credit: Samsung
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 బహుళ బ్రాండ్ల నుండి గృహోపకరణ పరికరాలపై డీల్‌లను అందిస్తుంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 సెప్టెంబర్ 23 నుంచి అన్ని యూజర్ల కోసం ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం జరిగే ఈ సేల్, భారతదేశంలో పండుగల సీజన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చాలా కుటుంబాల కోసం ఇది పాత హోమ్ అప్లయన్సెస్‌ను కొత్త, ఆధునిక సౌకర్యాలతో ఉన్న మోడళ్లతో అప్‌గ్రేడ్ చేసుకునే సమయంగా మారుతుంది. ఈ సేల్‌లో వాషింగ్ మెషీన్లు, డిష్‌వాషర్లు, ఫ్రిజ్‌లు, మైక్రోవేవ్ ఓవెన్లు, ఎయిర్ కండీషనర్లు, చిమ్నీలు వంటి పరికరాలపై భారీ రాయితీలు లభిస్తున్నాయి. శాంసంగ్, ఎల్‌జీ, గోద్రేజ్, హైయర్, హిటాచీ, బోష్ వంటి ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులను ఇప్పుడు ఎక్కువ ఖర్చు లేకుండా సొంతం చేసుకోవచ్చు.
ఈ సేల్‌లో హోమ్ అప్లయన్సెస్‌పై గరిష్టంగా 65 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది అమెజాన్. అదొక్కటే కాకుండా, ఎస్‌బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో కొనుగోలు చేసే వారికి అదనంగా 10 శాతం తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా, ఖర్చును ఒకేసారి చేయకుండా సులభంగా చెల్లించాలనుకునే కస్టమర్ల కోసం 24 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
ఈ సేల్‌లో హోమ్ అప్లయన్సెస్‌పై అందుబాటులో ఉన్న ఉత్తమ ఆఫర్లను మేము మీ కోసం ఎంపిక చేసాం. అదేవిధంగా, 2-ఇన్-1 ల్యాప్‌టాప్‌లు కొనాలనుకునేవారికి ప్రత్యేక ఆఫర్ల వివరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. గేమింగ్ యూజర్లు తక్కువ ఖర్చుతో గేమింగ్ యాక్సెసరీస్ కొనుగోలు చేయడానికి మా ప్రత్యేక గైడ్‌ను కూడా చూడవచ్చు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025లో హోమ్ అప్లయన్సెస్‌పై అద్భుతమైన ఆఫర్లు లభిస్తున్నాయి. సామ్‌సంగ్ ఫ్రంట్‌లోడింగ్ వాషింగ్ మెషిన్ (9kg) సాధారణంగా రూ.50,990గా ఉండగా, ఇప్పుడు కేవలం రూ.28,240కే అందుబాటులో ఉంది. ఎల్‌జీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ (655 లీటర్లు) అసలు ధర రూ.1,22,899 అయినప్పటికీ, సేల్‌లో రూ.58,240కే దొరుకుతోంది. అదే విధంగా ఎల్‌జీ ఫ్రంట్‌లోడింగ్ వాషింగ్ మెషిన్ (9kg) రూ.52,990 నుండి రూ.27,740కి తగ్గింది.
సామ్‌సంగ్ AI స్మార్ట్ రిఫ్రిజిరేటర్ (653 లీటర్లు) ధర రూ.1,21,000 కాగా, ఇప్పుడు రూ.60,240కే లభిస్తోంది. గోద్రేజ్ టాప్‌లోడింగ్ వాషింగ్ మెషిన్ (8kg) రూ.34,000 స్థానంలో కేవలం రూ.14,240కే దొరుకుతోంది. హైయర్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ (596 లీటర్లు) రూ.1,21,890 నుండి రూ.50,240కి తగ్గింది.
హిటాచీ స్ప్లిట్ AC (1.5 టన్) అసలు ధర రూ.63,850 అయినప్పటికీ, సేల్ ఆఫర్‌లో రూ.25,950కే లభిస్తోంది. బోష్ డిష్‌వాషర్ రూ.52,990 నుండి రూ.35,500కి తగ్గింది. ఎల్‌జీ కన్వెక్షన్ ఓవెన్ (28 లీటర్లు) ధర రూ.16,990 కాగా, సేల్‌లో రూ.12,730కే దొరుకుతోంది. ఎలికా ఫిల్టర్‌లెస్ చిమ్నీ (60సెం.మీ) రూ.28,990 నుండి రూ.12,490కి తగ్గి వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
ఈ విధంగా, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లు, ACలు, డిష్‌వాషర్లు, ఓవెన్లు, చిమ్నీలు వంటి అనేక అవసరమైన పరికరాలను భారీ డిస్కౌంట్‌తో సొంతం చేసుకునే మంచి అవకాశం ఈ ఫెస్టివల్ సేల్ అందిస్తోంది. ఈ సెల్ లో మీ ఇంటికి కావలసిన ఎటువంటి వస్తువులు అయినా సరే తక్కువ ధరలకు పొందేందుకు ఇది మంచి అవకాశం.
ప్రకటన
ప్రకటన