100 అంగుళాల వరకు స్క్రీన్ ప్రొజెక్షన్… ఆకర్షిస్తున్న పోర్ట్రోనిక్స్ బీమ్ 540 ఫీచర్లు

పోర్ట్రోనిక్స్ బీమ్ 540 ప్రొజెక్టర్ సరికొత్త ఫీచర్లను కలిగి ఉంది. ఇది ఆటో-ఫోకస్, స్మార్ట్ వర్టికల్ ఆటో కీస్టోన్ కరెక్షన్‌కు మద్దతు ఇస్తుంది. ఈ డివైస్ 720p రిజల్యూషన్‌తో 4K రిజల్యూషన్‌లో కంటెంట్ ప్లేబ్యాక్‌కు సపోర్ట్ చేస్తుంది

100 అంగుళాల వరకు స్క్రీన్ ప్రొజెక్షన్…  ఆకర్షిస్తున్న  పోర్ట్రోనిక్స్ బీమ్ 540 ఫీచర్లు

Photo Credit: Portronics

ముఖ్యాంశాలు
  • పోర్ట్రోనిక్స్ బీమ్ 100-అంగుళాల ప్రొజెక్షన్ వరకు సపోర్ట్
  • 720 పిక్సెల్ రిజల్యూషన్‌తో 4,000 ల్యూమెన్ బ్రైట్‌నెస్‌
  • 30,000 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌
ప్రకటన

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల దిగ్గజం పోర్ట్రోనిక్స్ భారత్‌లో సరికొత్త ప్రొడక్ట్‌ను లాంచ్ చేసింది. పోర్ట్రోనిక్స్ బీమ్ 540 పేరుతో LED ప్రొజెక్టర్‌ను ఇండియన్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది కేవలం ప్రొజెక్టర్‌గా మాత్రమే కాకుండా పలు రకాలుగా ఉపయోగపడనుంది. ఇందులో ఇన్‌బిల్ట్‌గా ఓటీటీ యాప్స్‌ రానున్నాయి. అంతేకాదు ఈ డివైస్ ఆండ్రాయిడ్ 13పై పనిచేయనుంది. ఈ ప్రొజెక్టర్ 720 పిక్సెల్ రిజల్యూషన్‌తో 4,000 ల్యూమెన్ బ్రైట్‌నెస్‌ను అందించును. తద్వారా స్క్రీన్‌పై పిక్చర్ క్వాలిటీగా కనిపిస్తుంది. ఇందులో ఉన్న ఆటో ఫోకస్ ఫీచర్ వల్ల చిత్రాలు చాలా షార్ప్‌గా కనిపిస్తాయి. అంతేకాకుండా, ఏదైన యాంగిల్‌ వల్ల కలిగే డిస్ట్రాక్షన్‌ను ఇందులోని స్మార్ట్ వర్టికల్ ఆటో కీస్టోన్ కరెక్షన్ పరిష్కరిస్తుందని పోర్ట్రోనిక్స్ పేర్కొంది. ఇది ఇన్‌బిల్ట్‌గా స్పీకర్, టెలిస్కోపిక్ స్టాండ్, USB, AUX పోర్ట్‌లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ డివైస్ "ఇంటెలిజెంట్" కూలింగ్ సిస్టమ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

భారతదేశంలో పోర్ట్రోనిక్స్ బీమ్ 540 ధర ఎంతంటే?

భారత్‌లో పోర్ట్రోనిక్స్ బీమ్ 540 ప్రొజెక్టర్ ధరను కంపెనీ ప్రకటించింది. దీనిని రూ.9,499 వద్ద అమ్మకానికి ఉంచినట్లు ఓ పత్రికా కథనంలో వెల్లడించింది. ప్రస్తుతం ఈ ప్రొజెక్టర్‌ను పోర్ట్రోనిక్స్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిఫ్‌కార్ట్ ద్వారా నేరుగా కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా కంపెనీ ఈ డివైస్‌పై ఏడాది పాటు వారెంట్‌ను కూడా అందిస్తోంది.

పోర్ట్రోనిక్స్ బీమ్ 540 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

సరికొత్త పోర్ట్రోనిక్స్ ప్రొజెక్టర్‌లోని ఫీచర్లు వినియోగదారులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. ఈ బిమ్ 540 ప్రొజెక్టర్, 4,000 ల్యూమెన్ల పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇది బాగా వెలుతురు ఉన్న గదులలో కూడా స్పష్టమైన చిత్రాలను అందిస్తుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం..ఇది 2 మీటర్ల దూరంలో 62-అంగుళాల విస్తీర్ణంలో స్స్కీన్‌ను, 2.5 మీటర్ల వద్ద.. 80-అంగుళాల విస్తీర్ణంలో, 2.8 మీటర్ల దూరంలో 100-అంగుళాల డిస్ప్లేలను ప్రొజెక్ట్ చేయగలదు. ఈ డివైస్ 720p రిజల్యూషన్‌తో 4K రిజల్యూషన్‌లో కంటెంట్ ప్లేబ్యాక్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి ఓటీటీ యాప్స్ ప్రీ-ఇన్‌స్టాల్‌గా వస్తాయి. ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారితంగా అవుట్-ఆఫ్-ది-బాక్స్‌ పనిచేస్తుంది.

పోర్ట్రోనిక్స్ బీమ్ 540 డివైస్‌ హైట్, యాంగిల్‌ను అటు ఇటు సర్దుబాటు చేసేందుకు వీలుగా ఇది టెలిస్కోపిక్ స్టాండ్‌ను కలిగి ఉంది. ప్రొజెక్టర్ ఇన్‌బిల్ట్ స్లాట్‌తో టేబుల్, వాల్ లేదా సీలింగ్ మౌంటింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ప్రొజెక్టర్‌ను ఎక్కడైనా సులభంగా అమర్చవచ్చు. ప్రొజెక్టర్‌కున్న ఇన్‌బిల్ట్ స్లాట్‌తో దీనిని గోడపైనా గానీ, బల్లపైన గానీ పెట్టి సులువుగా ఉపయోగించుకోవచ్చు. ఇందులో LED ల్యాంప్‌ అమర్చబడి ఉంది. ఇది 30,000 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఇందులోని డ్యూయల్-టర్బో కూలింగ్ సిస్టమ్ చాలా ప్రత్యేకతను కలిగి ఉంది. ఇది ప్రొజెక్టర్ వేడెక్కకుండా, రంగు మారకుండా నిరోధించేందుకు తోడ్పడుతుంది.

పోర్ట్రోనిక్స్ బీమ్ 540 ప్రొజెక్టర్ వినూత్న ఫీచర్లను కలిగి ఉంది. ఇది ఆటో-ఫోకస్ మరియు స్మార్ట్ వర్టికల్ ఆటో కీస్టోన్ కరెక్షన్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ డివైస్ త్వరితగతంగా, వక్రీకరణ-రహిత సెటప్‌ను అనుమతిస్తుంది. ఇందులో Wi-Fi, బ్లూటూత్ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. అలాగే వైర్డు కనెక్షన్‌ల కోసం HDMI, USB, AUX పోర్ట్‌లను కలిగి ఉంటుంది. ఇందులో ఇన్‌బిల్ట్‌ 3W స్పీకర్‌ను కలిగి ఉంటుంది. ఇది బయట ఉన్న ఆడియో పరికరాలకు మద్దతు ఇస్తుంది.

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Samsung సాధారణంగా తన ఫ్లాగ్‌షిప్ ఫోన్లను జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదల చేస్తుంది
  2. Realme ఇప్పటికే వియత్నాం మార్కెట్‌లో ఈ ఫోన్‌ను అధికారికంగా టీజ్ చేసింది
  3. Oppo ఐదు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, ఆరు సంవత్సరాల భద్రతా అప్‌డేట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది
  4. మార్కెట్లోకి రానున్న ఐకూ నియో 11.. 7,500mAh బ్యాటరీతో రానున్న మోడల్
  5. 7,500mAh బ్యాటరీ సపోర్ట్‌తో రానున్న రెడ్ మీ టర్బో 5.. స్పెషాలిటీ ఏంటంటే?
  6. కళ్లు చెదిరే ఫీచర్స్‌తో వన్ ప్లస్ ఏస్ 6.. సరసమైన ధరకే అదిరే ఫోన్
  7. గత ఇది iPhone Air మరియు Galaxy S25 Edge లకు పోటీగా నిలవనుంది.
  8. గత వారం వచ్చిన మరో రిపోర్ట్ కూడా ఇదే విషయాలను నిర్ధారించింది.
  9. టెలిఫోటో ఎక్స్ ట్రా కిట్‌తో రానున్న వివో ఎక్స్300 సిరీస్.. ఇక ఫోటోలు ఇష్టపడేవారికి పండుగే
  10. దీని పరిమాణం 161.42 x 76.67 x 8.10mm, బరువు సుమారు 211 గ్రాములు.
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »