దేశీయ మార్కెట్‌లోకి Sony Bravia 2 II సిరీస్ టీవీలు.. ధ‌ర‌తోపాటు ఫీచ‌ర్స్ చూసేయండి

పిక్చ‌ర్‌ మెరుగుద‌ల కోసం ఈ Sony Bravia 2 II సిరీస్ టీవీలను హెచ్‌డీఆర్‌, హెచ్ఎల్‌జీకి స‌పోర్ట్ చేసేలా రూపొందించారు. వీటి విజ‌వ‌ల్ టెక్నాల‌జీ డాల్బీ అట్మాస్‌తోపాటు DTS:X ఆడియో ఫీచ‌ర్స్‌తో అటాచ్ చేయ‌బ‌డి ఉన్నాయి.

దేశీయ మార్కెట్‌లోకి Sony Bravia 2 II సిరీస్ టీవీలు.. ధ‌ర‌తోపాటు ఫీచ‌ర్స్ చూసేయండి

Photo Credit: Sony

ఈ టీవీలు గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తాయి మరియు సోనీ పిక్చర్స్ కోర్ ఎంటర్‌టైన్‌మెంట్ యాప్‌ను కూడా అందిస్తాయి

ముఖ్యాంశాలు
  • Sony Bravia 2 II సిరీస్ 50Hz రిఫ్రెష్ రేట్‌తో 4K UHD స్క్రీన్‌లను క‌లిగి
  • Google TV OS, సోనీ X1 పిక్చర్ ప్రాసెసర్ ద్వారా ఇవి ర‌న్ అవుతాయి
  • గేమర్స్ కోసం ALLM, MotionFlow XR టెక్నాలజీని అందించిన కంపెనీ
ప్రకటన

దేశీయ మార్కెట్‌లోకి Sony Bravia 2 II సిరీస్ అడుగుపెట్టింది. ఈ కొత్త టీవీ లైన‌ప్ Google TV OS ద్వారా శ‌క్తిని గ్ర‌హిస్తుంది. అలాగే, 4K ఆల్ట్రా హెచ్‌డీ స్క్రీన్‌ను కంపెనీ దీనికి అందించింది. ఇది ప్రోప‌ర్టీ 4K X- రియాల‌టీ ప్రో పిక్చ‌ర్ ఇంజ‌న్ ద్వారా శ‌క్తిని గ్ర‌స్తుంద‌ని కంపెనీ స్ప‌ష్టం చేసింది. ఇవి న్యారో బెజ‌ల్స్‌తో మ‌ల్టిప్లే డిస్‌ప్లే సైజ్‌ల‌తో మార్కెట్‌లోకి అందుబాటులోకి రానున్నాయని కూడా ధృవీక‌రించింది. పిక్చ‌ర్‌ మెరుగుద‌ల కోసం ఈ Sony Bravia 2 II సిరీస్ టీవీలను హెచ్‌డీఆర్‌, హెచ్ఎల్‌జీకి స‌పోర్ట్ చేసేలా రూపొందించారు. వీటి విజ‌వ‌ల్ టెక్నాల‌జీ డాల్బీ అట్మాస్‌తోపాటు DTS:X ఆడియో ఫీచ‌ర్స్‌తో అటాచ్ చేయ‌బ‌డి ఉన్నాయి.రూ. 5000 వ‌ర‌కూ క్యాష్ బ్యాక్,మ‌న దేశంలో కొత్త Sony Bravia 2 II సిరీస్ 43 అంగ‌ళాల వేరియంట్(K-43S25M2) ధ‌ర రూ. 50,990 నుంచి మొద‌ల‌వుతుంది. ఈ లైన‌ప్‌లో మొత్తంగా 55, 65, 75 అంగుళాల స్క్రీన్ సైజుల ధ‌ర‌ను కంపెనీ వ‌రుస‌గా రూ. 75,990, రూ. 97,990, రూ. 1,45,990గా నిర్ణ‌యించింది. ఆఫ‌ర్‌ల‌లో భాగంగా కంపెనీ రూ. 5000 వ‌ర‌కూ క్యాష్ బ్యాక్ పొందే అవ‌కాశం క‌ల్పించింది. ఈ- కామ‌ర్స్ పోర్ట్‌ల్‌తోపాటు దేశ‌వ్యాప్తంగా కంపెనీ కేంద్రాలు, ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్ షాప్‌ల ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటాయి.

లైవ్ క‌ల‌ర్ టెక్నాల‌జీతో

Sony Bravia 2 II సిరీస్ కు చెందిన అన్ని వేరియంట్‌లు కూడా 50 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌, 4K ఆల్ట్రా హెచ్‌డీ(4,096 x 2,160 పిక్సెల్‌లు) ఎల్‌సీడీ ప్యానెల్‌ల‌తో రూపొందించ‌బ‌డ్డాయి. అలాగే, ఇవి X1 పిక్చ‌ర్ ప్రాసెస‌ర్ ద్వారా శ‌క్తిని గ్ర‌హిస్తాయి. క్వాలిటీ సౌండ్ కోసం ప్ర‌త్యేకమైన ఫీచ‌ర్‌ను క‌లిగి ఉన్న‌ట్లు కంపెనీ చెబుతోంది. ఈ టీవీలు లైవ్ క‌ల‌ర్ టెక్నాల‌జీతో అటాచ్ చేయ‌బ‌డి, అందుబాటులోకి రానున్నాయి.

మోష‌న్ ఫో XR టెక్నాల‌జీ

Sony కంపెనీ త‌మ 4K X- రియాలిటీ ప్రో ఇంజ‌న్ 4K డేటాబేస్‌ను వినియోగించి, 2K లేదా ఫుల్ హెచ్‌డీ కంటెంట్‌ను కూడా 4K లోకి పెంచ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. అలాగే, మోష‌న్ ఫో XR టెక్నాల‌జీ ద్వారా పిక్చ‌ర్ క్వాల‌టీతోపాటు ఫ్రేమ్‌ల‌ను ఆక‌ర్ష‌ణీయంగా అందిస్తాయ‌ని కంపెనీ చెబుతోంది. గేమ‌ర్‌ల‌కు టీవీలు ఆటో లో లాటెన్సీ మోడ్‌తో అందుబాటులోకి తీసుకువ‌స్తున్నట్లు స్ప‌ష్టం చేసింది.

ప్యూర్ స్ట్రీమ్ ఫీచ‌ర్ ద్వారా

Bravia 2 II సిరీస్‌తోపాటు కంపెనీ Sony పిక్చ‌ర్స్ కోర్ మూవీ స‌ర్వీస్‌ను కూడా అందిస్తోంది. ప్యూర్ స్ట్రీమ్ ఫీచ‌ర్ ద్వారా హెచ్‌డీఆర్ మూవీస్‌ను 80 Mbps వ‌ర‌కూ స్ట్రీం చేయొచ్చు. దీంతోపాటు వంద సినిమాల వ‌ర‌కూ ఏడాది యాక్సెస్ ఉంది. క‌నెక్టివిటీ ఆప్ష‌న్‌ల‌లోత డ్యూయ‌ల్ బ్యాండ్ Wi-Fi 6, బ్లూటూత్ 5.3, ALLM, eArc స‌పోర్ట్‌తో నాలుగు హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, రెండు యూఎస్‌బీ టైప్ ఏ పోర్ట్‌లు, ఓ ఆర్ఎఫ్ పోర్ట్ ను అందించారు.

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. సరికొత్త Apple స్మార్ట్ వాచ్‌లు వచ్చేశాయ్, ఆరోగ్య లక్షణాలు చెప్పే సెన్సార్లు, 19 నుంచి సేల్స్ ప్రారంభం
  2. కళ్లు చెదిరే మోడల్స్, ధరతో ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్
  3. iPhone Air పూర్తిగా eSIM-only మోడల్‌గా వస్తుంది
  4. iPhone 17 లో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది
  5. నేపథ్యంలో రాబోయే iPhone 17 సిరీస్పై వరుసగా లీకులు వెలుగులోకి వస్తున్నాయి
  6. iPhone 17 Pro మోడళ్ల రూపకల్పనలో కూడా కీలక మార్పులు జరగనున్నాయి
  7. ఈ ఈవెంట్‌లో ఐఫోన్ 17 లైనప్‌లో నాలుగు కొత్త మోడల్స్ ప్రకటించబడతాయని అంచనా
  8. మార్కెట్‌లోకి సరికొత్త Apple స్మార్ట్ వాచ్‌లు, కళ్లు చెదిరే ఫీచర్లు
  9. ఐఫోన్ 17 సిరీస్ రెడీ టు లాంఛ్.. ఏ ఏ మోడల్స్ వస్తున్నాయంటే?
  10. దయచేసి మీ ఫోన్లను రీస్టార్ట్‌ చేయండి అని ఎయిర్‌టెల్ వినియోగదారులకు సూచించింది
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »