Photo Credit: Apple
Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సేల్ స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, గృహోపకరణాలు లాంటి అనేక రకాల ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డీల్‌లను అందిస్తోంది. ప్రస్తుతం వినియోగిస్తున్న గాడ్జెట్‌లను అప్‌గ్రేడ్ చేయాలనుకునే వినియోగదారులకు ఇది సరైన సమయమనే చెప్పాలి. ఎందుకంటే, ఈ సేల్‌లో ప్రత్యేకమైన ఆఫర్‌ల ప్రయోజనాలతోపాటు కోరుకున్న ఉత్పత్తులను అతి తక్కువ ధరలకు పొందొచ్చు. అందుకే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ సమయంలో మీరు కొనుగోలు చేయగల టాప్ ప్రీమియం హెడ్‌ఫోన్‌లు కూడా భారీ డిస్కౌంట్ సేల్‌లో అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు, కొత్త స్మార్ట్‌వాచ్‌ని కొనుగోలు చేయడం మీ మనసులో ఉంటే ఈ సేల్ మీకు సరైన వేదికలాంటిది. బ్రాండెడ్ ఉత్పత్తులపై వచ్చే డిస్కౌంట్లు, బ్యాంక్ ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రధానంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సందర్భంగా Apple, Samsung, Amazfit, OnePlus స్మార్ట్‌వాచ్‌లపై వస్తోన్న ప్రత్యేక ఆఫర్‌ల పూర్తి వివరాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి. ఈ జాబితాలో Apple Watch Series 10 ఇప్పటికే తగ్గింపుతో అందుబాటులో ఉంది. అలాగే, Samsung Galaxy Watch 4 LTE కూడా రూ. 8,099ల తక్కువ ధరకే లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో అత్యంత సరసమైన LTE స్మార్ట్‌వాచ్‌లలో ఇది ఒకటి. Amazfit, OnePlusల స్మార్ట్‌వాచ్‌లపై కూడా ఇలాంటి డీల్‌లు అందుబాటులో ఉన్నాయి.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్‌ల గురించి చెప్పుకోవాలి. సేల్‌లో తగ్గింపు ధరతోపాటు కస్టమర్లు SBI డెబిట్, క్రెడిట్ కార్డ్, EMI లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు. అంతేకాదు, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సందర్భంగా ఎంపిక చేసిన ఉత్పత్తులపై రూ.5000 వరకు కూపన్ తగ్గింపులు కూడా ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన