మీరు ప్లేస్టేషన్ 5 మరియు దాని యాక్సెసరీస్ కోసం ఆఫర్లను వెతుకుతున్నట్లయితే, వాటి కోసం ప్రత్యేక డీల్స్ జాబితా కూడా అందుబాటులో ఉంది. అదే విధంగా, స్మార్ట్‌ఫోన్లపై ఎర్లీ డీల్స్ తెలుసుకోవాలనుకుంటే, మీకు ఉపయోగపడే గైడ్ కూడా సిద్ధంగా ఉంది.
Photo Credit: Amazon
ప్రైమ్ సభ్యులకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 కు 24 గంటల ముందే యాక్సెస్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 ఈ నెల సెప్టెంబర్ 23 నుండి ప్రారంభం కానుంది. ఈ సేల్ ఈవెంట్ అమెజాన్ నిర్వహించే సంవత్సరంలోని అతిపెద్ద ఆఫర్‌లలో ఒకటి. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ టీవీలు, స్పీకర్లు వంటి పలు ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌లు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా, కొత్త అమెజాన్ ఎకో డివైజ్ కొనుగోలు చేయాలనుకునేవారికి సేల్ ప్రారంభం కాకముందే ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి.అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025కి ముందుగానే కొన్ని ఎర్లీ డీల్స్‌ను అమెజాన్ ఇప్పటికే ప్రకటించింది. ఈ డీల్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండి, ప్లాట్‌ఫామ్ డిస్కౌంట్‌లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ ఆప్షన్లతో వస్తున్నాయి. అంటే వినియోగదారులు తమ పాత డివైజ్‌లను ఇచ్చి అదనపు తగ్గింపులు పొందవచ్చు. ప్రస్తుతం ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ట్రాన్సాక్షన్ సమయంలో 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాక, వాయిదాల్లో చెల్లించాలనుకునేవారికి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది, దీని ద్వారా 24 నెలల వరకు ఈఎంఐలు చెల్లించే అవకాశం ఉంటుంది.
ఈ సారి అమెజాన్ ఎకో డివైజ్‌లపై పెద్ద ఎత్తున ఆఫర్లు ఉన్నాయి. స్మార్ట్ స్పీకర్లు, స్మార్ట్ డిస్ప్లేలు మాత్రమే కాకుండా, ప్రత్యేకంగా బండిల్ ఆఫర్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయి. అంటే ప్రతి ఎకో డివైజ్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌కు విప్రో 9W LED స్మార్ట్ బల్బ్ ఉచితంగా లభిస్తుంది.
మీరు ప్లేస్టేషన్ 5 మరియు దాని యాక్సెసరీస్ కోసం ఆఫర్లను వెతుకుతున్నట్లయితే, వాటి కోసం ప్రత్యేక డీల్స్ జాబితా కూడా అందుబాటులో ఉంది. అదే విధంగా, స్మార్ట్‌ఫోన్లపై ఎర్లీ డీల్స్ తెలుసుకోవాలనుకుంటే, మీకు ఉపయోగపడే గైడ్ కూడా సిద్ధంగా ఉంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025లో ఎకో డివైజ్‌లపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఎకో డాట్ 5వ జనరేషన్ మరియు స్మార్ట్ బల్బ్ కాంబోను అసలు ధర రూ. 7,598 ఉండగా, సేల్ ధర కేవలం రూ. 4,999 మాత్రమే. ఎకో పాప్ మరియు స్మార్ట్ బల్బ్ బండిల్ అసలు ధర రూ. 7,098 అయినా, ఇప్పుడు కేవలం రూ. 3,499కే లభిస్తోంది. ఎకో 4వ జనరేషన్ మరియు స్మార్ట్ బల్బ్ కాంబో ధర రూ.
12,098 ఉండగా, సేల్ ఆఫర్‌లో ఇది రూ. 5,550కి దొరుకుతోంది. అదేవిధంగా, ఎకో స్పాట్ మరియు స్మార్ట్ బల్బ్ కాంబినేషన్ రూ. 11,098 స్థానంలో రూ. 7,999కి అందుబాటులో ఉంది. ఎకో షో 5 మరియు స్మార్ట్ బల్బ్ కాంబో ధర రూ. 14,098 ఉండగా, ఆఫర్‌లో ఇది రూ. 11,549కి లభిస్తోంది. ఎకో షో 8 మరియు స్మార్ట్ బల్బ్ కాంబో రూ. 16,098 స్థానంలో కేవలం రూ. 9,549కే దొరుకుతోంది. ఈ ఆఫర్లు స్మార్ట్ హోమ్ ఉత్పత్తులను తక్కువ ధరలో పొందాలనుకునే వారికి మంచి అవకాశాన్ని అందిస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన