Amazon ప్రైమ్ మెంబర్‌లకు ముందస్తు యాక్సెస్‌ను అందించిన 24 గంటల తర్వాత అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ అందరి కోసం ప్రారంభమైంది. ఈ పండుగ సీజన్ స్పెషల్ సేల్ ఈవెంట్ బ్రాండెడ్ మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, అమెజాన్ పరికరాలతోపాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్‌లను అందిస్తోంది. అయితే, Amazon అందిస్తోన్న వందల కొద్దీ డీల్‌లను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. సేల్ సమయంలో ధరలలో మార్పులు ఉండవచ్చు. ఈ విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు.
తగ్గింపు ధరల్లో బ్రాండెడ్ ఫోన్‌లు..
- ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌లో ఐఫోన్ 13 తగ్గింపు ధర రూ. 39,999 (MRP రూ. 59,600)గా ఉంది. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేయడం ద్వారా ఈ ఫోన్ రూ. 36,700లకే సొంతం చేసుకోవచ్చు. SBI క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌తో చెల్లించడం వలన మీరు రూ. 1,250 నుంచి రూ. 1,500 తగ్గింపు ఉంటుంది.
- Samsung Galaxy S23 Ultra 5G కూడా తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఈ సేల్ సమయంలో రూ. 74,999లకు లభిస్తుంది. SBI క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు కొనుగోలుపై అదనంగా రూ.1,500 తక్షణ తగ్గింపు ఉంటుంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ. 65,000లకు లభిస్తుంది.
- OnePlus 12R 5G ఈ వారం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ. 37,999 (MRP రూ. 42,999)లకు లభిస్తుంది. అలాగే, ఎక్స్‌ఛేంజ్ ద్వారా రూ. 35,000లకు పొందవచ్చు.
- Samsung Galaxy M35 5G ధర ఈ సేల్‌లో రూ.14,999 (MRP రూ. 24,499). పాత ఫోన్‌ను మార్చుకోవడం ద్వారా రూ. 14,150లకు లభిస్తుంది.
ఎలక్ట్రానిక్స్‌పై బెస్ట్ ఆఫర్‌లు..
- Apple నుండి వస్తోన్న MacBook Air M1 13.3-అంగుళాల మోడల్ ఈ సేల్‌లో రూ. 52,990 (MRP రూ. 92,900)గా ఉంది. పాత ల్యాప్‌టాప్‌ని ఎక్స్‌ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ. 11,900 తగ్గింపు పొందవచ్చు. SBI క్రెడిట్ కార్డ్ చెల్లింపు ఆఫర్‌ను జోడించి, కొనుగోలుపై రూ. 4,000 డిస్కౌంట్ ఉంటుంది.
- Samsung Galaxy Tab S9 FE రూ. 26,999 (MRP రూ. 44,999) తగ్గింపు ధరలో ఉంది. పాత ట్యాబ్‌ను ఎక్స్‌ఛెంజ్ చేసుకోవడం ద్వారా రూ 24,150లకు లభిస్తుంది.
- Sony యొక్క Bravia KD-55X74L 55-అంగుళాల 4K Google TV రూ. 54,990 (MRP రూ. 99,900)లకు అందిస్తోంది. SBI క్రెడిట్ కార్డ్ ఉపయోగించి చెల్లింపు చేయడం ద్వారా రూ. 4000 వరకూ డిస్కౌంట్ పొందవచ్చు.
- ఫైర్ టీవీ స్టిక్ అనేది మామూలు టీవీని స్మార్ట్ టీవీగా మార్చడానికి సరసమైన సరైన ఎంపిక. ఇది ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో రూ. 2,199 (MRP రూ. 4,999)గా ఉంది. ఈ మోడల్ సరికొత్త అలెక్సా వాయిస్ రిమోట్‌తో వస్తుంది.